Friday, May 1, 2020

బంధరాహిత్యము

👨‍👩‍👧 " బంధరాహిత్యము "

▪బంధం అంటే ఇతరులతో బంధం కలిగి ఉండడం కాదు. మీతో మీరు బంధం కలిగి ఉండడం

▪ బంధరాహిత్యానికి పర్యవసానం ప్రేమ అయితే బంధానికి పర్యవసానం స్వార్థము

▪ మనకు పదుల కొద్దీ వందలకొద్దీ బంధాలు ఉన్నాయి. వాటి నుంచి స్వేచ్ఛ పొందాలంటే మొట్ట మొదట వాటిపట్ల ఎరుక (సృహ కలిగి మేల్కొని) కలిగి ఉండాలి

▪ప్రతి వస్తువు, ప్రతి విషయం యొక్క అస్థిరత్వం పట్ల ఎరుక మీ బంధరాహిత్య శక్తిని పెంచుతుంది

▪ ప్రతి వస్తువు ప్రతి విషయం యొక్క అస్థిరత పట్ల నిరంతరంగా ఎరుక ఉండండి.

▪ అంటే అవి శాశ్వతం కావు. అవి ఎప్పటికీ అక్కడ ఉండవు. అవి మీ జీవితమంతా కూడా అక్కడ ఉండవు అన్న స్పృహతో ఉండడం.

అక్కడ లేని దానిని కోరుకోవడమే బంధం
అక్కడ లేని దానిని కోరుకోకపోవడం, ఉన్న దానిని స్వీకరించి ఆనందించడమే బంధరాహిత్యం.

▪ మనం అనుబంధం పెంచుకోడానికి ఎక్కడ స్థిరమైనది లేదు. ఇది జ్ఞాపకం ఉంటే మనము ఏ విషయం పట్ల, ఏ వస్తువు పట్ల, ఏ వ్యక్తి పట్ల ,బంధంలో ఉండము.

▪మీరు బంధాల నుంచి మిమ్మల్ని మీరు విముక్తులు చేసుకుంటే

▪అటువంటి వ్యక్తిని కూడా స్వీకరించి ప్రేమిస్తారు.

అతను అక్కడ ఉంటే మీరు అతని ఆనందిస్తారు

▪అతను అక్కడ లేనప్పుడు ఉండాలని కోరుకోరు. అతను ఉండే తీరుకు భిన్నంగా ఉండాలని కోరరు.

బంధ రాహిత్యంతో ఉండడం అంటే ఇదే.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂

No comments:

Post a Comment