మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం !!
అవగాహనే మనసుకు మంచి మందు. అవగాహన అంటే మనసుకు విషయం సంపూర్ణంగా, సమగ్రంగా, సమూలంగా అర్ధంకావడం. మనకు బాల్యం నుండి మనసును పోల్చుకోవడం, పోటీపడటం అలవాటుగా మారింది. అదే అలవాటుతో దేవుడు, సాధన, ముక్తి వంటి ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనసు పోల్చుకోవడం, పోటీ పడటం చేస్తోంది. నిజానికి మన జీవనం సాఫీగా సాగటానికి ఎవరితోనూ పోటీ పడక్కర్లేదు. మనతో మనం సక్రమంగా ఉంటే సరిపోతుంది. మన గుణాలను దాటటానికి, ప్రవృతిని మార్చుకోవడానికి అనుదినం మనతో మనమే పోటీపడాలి. మనలో వచ్చే మార్పే శాంతికి సోపానం. మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం. దీన్ని ఎవరినీ అడిగి తెలుసుకోవాల్సిన పనిలేదు. మనం నిత్యజీవితంలో ఎంత శాంతిగా ఉంటున్నాం, ఎన్ని విషయాల్లో శాంతిగా ఉంటున్నామనేది ఎవరిది వారికే తెలిసే విషయం !

No comments:
Post a Comment