Tuesday, May 5, 2020

చంపేది కూడా ప్రకృతి దేవుడే అని ఇంకా అర్దంకాలేదా...!!!

బ్రతికితే దేవుడు ఉన్నాడు అంటారు.. చస్తే దేవుడు లేడు అంటారు. కాని... చంపేది కూడా ప్రకృతి దేవుడే అని ఇంకా అర్దంకాలేదా...!!!

ఎప్పుడైనా చూసారా ఇలాంటి విపత్తు.??
నేనే గొప్ప, నా కులమే గొప్ప, నా మతమే గొప్ప, నాకు కోట్ల రూపాయల డబ్బుంది, నేను మంత్రి, సీఎం, పీఎం అనే వాళ్ళందరినీ కలిపి ప్రాణభీతితో మూసుకుని మూలన కూర్చోబెట్టింది..!!!

ఇప్పుడు వచ్చిన ఈ విపత్తు కు కడుపులోనే చంపబడ్డ పసిపిల్లల మద్దతు వుంది.
చెత్తకుప్పల్లో విసిరివేయబడ్డ బిడ్డల మద్దతు వుంది.
మోసపోయిన, అన్యాయంగా చంపబడిన అమాయకుల మద్దతు వుంది...!!!

అభివృద్ది పేరు చెప్పి చంద్రమండలంలోకి పొయే సత్తా నీకుంటే,
గడప దాటకుండా ఇంట్లో కూర్చొపెట్టే సత్తా ప్రకృతికి వుంది !!!

ఆరుబయట పడుకుని ఆకాశంలోకి చూస్తే వేల కిలోమీటర్ల దూరంలో వుండే గ్రద్దల సమూహం కనపడేది.
కిరోసిన్ దీపం వెలుగులో సైతం చీమలు కనపడేవి.
ఇప్పుడు 1000 లైట్ల వెలుతురులో కూడా కంటి అద్దాలు లేకుండా కనీసం ఎదుటి మనిషి కనపడటలేదు.
మనిషి మనుగడ కనుమరుగయ్యే అభివృద్ది దేనికి..???

తినే తిండి కల్తీ, త్రాగే నీరు కల్తీ, మాట్లాడే మాట కల్తీ, చూసే చూపు కల్తీ, చేసే పనిలో కల్తీ..
ఏం...
ఆయుషు పెంచటానికి పనికిరాని ఆదాయం ఏం చేసుకుంటారు...!!!

అందుకే అభివృద్ది పేరుతో మనం చేసిన అపరిశుభ్రతను, తనకు తానుగా శుభ్రం చేసుకుంటుంది ప్రకృతి...!!!

ప్రకృతికి లోబడి ఉంటేనే జీవితం... అలా కాకుండా మూర్ఖంగా ఎదురు వెళ్తే, కోత ఎంత కొయ్యాలో ఖచ్చితంగా కోసే వెళ్తుంది...!!!

ఇకనైనా ప్రాణం విలువ ఏ పాటిదో తెలుసుకుని, బ్రతికినంత కాలం హుందాగా బ్రతుకుదాం.. అత్యాశలు, అధిక సంపాదన, పదవులు, ఉద్యోగాల పేరుతో విలయతాండవాన్ని మాని ప్రతి ప్రాణాన్ని గౌరవిస్తూ.. ప్రకృతిని అందంగా మార్చుకుందాం..

No comments:

Post a Comment