నేటి మంచిమాట లో కొన్నిఆణిముత్యాలు.
*సమస్యలు నిన్ను చుట్టుముడుతాయి.*
*బాధలు నిన్ను అమాంతం అలుముకుంటాయి.*
*కష్టాలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.అనేక భావోద్వేగాలు నిన్ను ఆవేదనకు గురిచేస్తాయి.*
*నువ్వు అష్టదిగ్బంధనంలో ఇరుక్కుంటావు కానీ నువ్వు ఓర్పుతో నేర్పుతో పట్టుదలతో క్రమశిక్షణతో ఉండు కాలమే ప్రతి సంఘర్షణకు సమాధానం ఎందుకంటే ఏ నిమిషం శాశ్వతం కాదు...*
*మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే..*
*మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా* *మర్చిపోయేలా చేస్తుంది కాబట్టి కత్తెరలా అందరిని విడకొట్టకుండా సూదిలా* *అందరిని కలుపుకుంటుపో అప్పుడు అందరు నీతోనే ఉంటారు వారే నీకు కొండంత బలం అవుతారు నీ విజయానికి దోహద పడతారు...*
*మనిషిగా పుట్టడమే*
*ఒక అదృష్టం.*
*ముడిపడుతున్నా*
*బంధాలు ‘వరాలు’.*
*ఎదురయ్యే అడ్డంకులు*
*విలువైన ‘పాఠాలు’.*
*కష్టాల గురించే ఆలోచించరాదు అవి వచ్చిపోతుంటాయి.*
*ఆనందంగా పదిమంది మంచిగా చెప్పుకునేలా జీవించాలి*
*ఇదే జీవిత పరమార్థం.*
అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి. మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment