Thursday, June 22, 2023

మీసప్తచేతన మనసుకున్న శక్తి ధనంమూలం ఇదం జగత్💰

 ⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓
మీసప్తచేతన మనసుకున్న శక్తి

 ధనంమూలం ఇదం జగత్💰

మీకెప్పుడైన లక్షలు, కోట్లు సంపాదిస్తే బాగుండనిపించిందా? Yes అనిపించినపుడే మీరు సంపదపరులు కావడానికి బీజం పడింది. కాని అప్పుడే మీరు దాన్ని మరిచిపోయారు. ఇప్పటికైనా ఇబ్బంది లేదు. Money, Wealth అనే విత్తనం ఉంది. ఇపుడే నాటండి. ప్రతి రోజు నేను గతంలో Money Mantra లో చెప్పినట్టు నీళ్ళు పోయండి. మీ మనసులో దాన్ని జాగ్రత్తగా పెంచండి. అది మీకు గొప్ప సంపదనిస్తుంది. Yes మీరు సిద్ధంగా ఉన్నారు. పట్టుదల వదలకుండా మీరు ప్రయత్నించండి. మీరనుకున్నది సాధిస్తారు. ఎవరైతే సంపద కావాలనుకున్నారో వారి దగ్గరికే సంపద వస్తుంది. మీరు దానికి పూర్తి అర్హులు. ఎంతైనా సంపాదించండి. సంతోషంగా ఉండండి. డబ్బు, సంపద మీరేం చేయాలనుకుంటున్నారో చేసేయండి. ఎవరో ఏమో అనుకుంటారేమో అని ఆలోచించవద్దు. Yes. మీ ఆలోచననే మీ పెట్టుబడి మీరు ఎంత ఆలోచిస్తే అంతా మీదే. ఆ యూనివర్స్ మీకివ్వదడానికే ఉంది. మీరు ఎప్పుడూ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. డబ్బుని ఎప్పుడూ బంధీ చేయకండి. వీలైనంత ఖర్చు పెట్టినపుడే అది మీ దగ్గరికి వస్తుంది. అపరిమితమైన సంపద మీకోసం ఆ విశ్వం సిద్ధంగా ఉంచింది. దాన్ని మీ ఆలోచనల ద్వారా పొందే ప్రయత్నం చేయండి
మీ దగ్గరలోని సంపదపరులను ఎప్పుడైనా గమనించండి. వాళ్ళ సంపదను ఎలా మెయింటైన్ చేస్తున్నారు. మీకు ప్రతిదీ తెలియాలి. ఒక కోటీశ్వరుడి గురించి, డబ్బు ఎలా తయారవుతుంది? financial గా మీకు సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి. వీటి మీద చాలా పుస్తకాలు గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా చదవాలి. వారూ ఒకప్పుడు మనలాంటి వాళ్లే. ఈ రోజు ఆ స్థాయికి వచ్చారు. వారి జీవితాలు చదివి డబ్బు, సంపద కావాలన్నపుడు వీటన్నిటిపైన మీకు అవగాహన ఉండాలి. అప్పుడు డబ్బు, సంపదకు మీరు అర్హులుగా ఆ విశ్వం దృష్టిలో గుర్తింపబడుతారు. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రతీ క్షణం ఈ రకమైన ఆలోచనలతో ఉన్నప్పుడు Universe మీ ఆలోచనల్ని స్వీకరిస్తుంది. మీ ఆలోచనలకు అనుగుణంగా మీకు ఎలా - ఇవ్వాలి అనే ప్లాన్ వేసుకుంటుంది. ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది మీకు వచ్చిన డబ్బు సంపాదన అనే ఆలోచనలు మీ కోరికగా మార్చుకోండి. బలమైన కోరిక ఉన్నపుడే సాధ్యమవుతుంది. మీ జీవితపు రూపురేఖలు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఎలా మార్చుకుంటారనేది మీఇష్టం. మీ జీవితానికి ఎవరూ బాధ్యులు కారు. ఒక విషయం మీరు ఏమి  చేస్తున్నారు అనేది ఎవ్వరికీ చెప్పే అవసరం లేదు. ఇతరులకూ, సమాజానికి, ప్రకృతికి ఇబ్బంది కలగకూడదు. అప్పుడే ఆ విశ్వం మీకు సహకరిస్తుంది. విశ్వ నియమాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా తెలుసుకుందాం
Law of Atraction అంటే ఆకర్షణ యొక్క ధర్మం, అంటే మీరు ఏదైతే ఆకర్షిస్తారో అది మీ సొంతం అవుతుంది. ఏదైనా అంటే ఏదైనా కావచ్చు. డబ్బు, సంపద, వస్తువు, ఇంకేదైనా కావచ్చు. మీరు కోరుకున్న ఏదైనా  మీ సొంతం కావొచ్చు, దీనికై మీరేం చేయాలి? ఇది నిజమా? నమ్మశక్యంగా లేదు. Yes ఎలా అవుతుంది. ఎందుకవుతుంది? నాకే ఎందుకవుతుంది. అవడానికి యెంత సమయం పడుతుంది. ఇంకా ఇది సాధ్యమా? అంటూ ఆశ్చర్యపోతూ మీరు అనుమానాలను వ్యక్తపరచిన కొద్దీ మీకు ఏదీ కాదు. ఈ సిద్ధాంతంలో మూడు ముఖ్యమైన విషయాలను నమ్మండి. 1.బలమైన కోరిక 2.నమ్మకం 3.మీరు కోరిన దాన్ని అనుభవించడం. Simple theory. Yes, ఇవి మూడు ఒకే సరళరేఖ పై కి వచ్చిన మరుక్షణమే మీరు కోరుకునేది మీ ముందుంటుంది.

నిరాశా, నిస్పృహలతో మీ జీవితాన్ని చిన్నదిగా చేసుకోకండి. ఎపుడైతే మీ ఆలోచన చిన్నదిగా మారిందంటే మీకు తెలియకుండానే మీరు క్రుంగిపోయారని అర్ధం, మీకేమి ఉన్నా, లేకున్నా ఉన్న దానికంటే ఎక్కువ ఊహించండి. ఊహించడంలో మనకి ఖర్చు ఏమి లేదు. Yes, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా మలచుకున్నారనేది మీ ఇష్టం. మీరెపుడూ ఆర్థిక పుష్టి కలిగి ఉండాలని మనస్పూర్తిగా కోరుకొండి. దానికి సంబంధించిన అవకాశాలు రావడం మొదలౌతుంది. నిరంతరం  ఉన్నతమైన ఆలోచనలతో మీ మస్తిష్కాన్ని నింపండి. ఏదో కోల్పోయినం చ మాత్రాన మీ జీవితం అయిపోలేదు. గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు అంత అయిపోయిందనుకున్న తరువాతనే మళ్లీ మొదలయ్యాయి. ఒక గొప్ప స్థాయికి చేరుకోవడం జరిగింది.

“మీ జీవితంలో ఎక్కడా ఎవరికీ భయపడకండి భయపడేవాడు చచ్చిన కిందే లెక్క” - స్వామి వివేకానంద"

ప్రతీ రొజూ మీ ఉజ్జ్వల భవిష్యత్తు గురించిన ఆలోచనలపై దృష్టి పెట్టండి. మీ ఆలోచనలు మీ అంతరంగంలో ఒక గొప్ప నిదిని తయారు చేసి మీకు అందిస్తాయి. వీలైనంత ఒంటరిగా ఉండే ప్రయత చేయండి. అపుడే మీ ఇన్నర్ మైండ్ తో కనెక్ట్ అవుతారు. మీ మనసు చెప్పిందే మీరు చేయండి. ఈ ప్రపంచంలో ఎవరి మాటా వినకoడి అద్భుతమైన కలలతో మీ జీవితాన్ని సాకారం చేసుకోండి. అందరుమీ వైపు చూసేలా...

డాక్టర్. అశోక వర్ధన్ రెడ్డి
7337068200
⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓

No comments:

Post a Comment