🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(258వ రోజు):--
శస్త్రచికిత్స జరిగిన తర్వాత, సిద్ద బరికి తన నివాసాన్ని తరలించే ఆలో చనను స్వామీజీ విరమించుకున్నారు. నిజానికి, ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు ఆరోగ్యానికి సంబంధించినవి కావు. అప్పటివరకూ ఆయన ముఖ్య అను చరుల్లో ఒకరుగా ఉన్న స్వామి దయానంద తనకు సరిపడా వనరు లున్నాయని గ్రహించి, ఆచార్యవృత్తి ని వదిలి తన స్వంతసంస్థ స్థాపించ డానికి నిర్ణయించుకున్నారు. సాందీపనికి ముఖ్యాచార్యునిగా ఉన్న ఆయనను ఆవిధంగా కోల్పోవ డం ఒక పెద్ద విఘాతమే. దీనికితోడు తను బోధించిన బ్రహ్మచారులలో చాలామందిని తనతోపాటు తీసుకు పోయారాయన. ఆ ఖాళీలను భర్తీ చెయ్యడానికి మరో విద్యార్థిబృంద పు చదువు పూర్తయ్యేదాకా ఆగాల్సిందే.
ఐతే, హిమాలయాలలోని ఆశ్రమంలో మాత్రం అంతా యథా తథంగా కొనసాగింది. ప్రతి సంవత్స రం ఆధ్యాత్మికశిబిరం నిర్వహించ డానికి స్వామీజీ వేసవికాలంలో అక్కడకు వచ్చేవారు. అటువంటి శిబిరాలూ, వేదాంతపాఠాలే కాక, ఇతర సమాజసేవాకార్యక్రమాలు కూడా అక్కడ మొదలయ్యాయి. స్థానిక గ్రామస్థులకు వైద్యసదుపా యం ఏర్పాటుచేయబడింది. 1985 ఏప్రిల్లో 30 మంది ఉత్సాహవంతు లైన, తెలివైన, సుమారు 20 సంవత్సరాల వయస్సున్న యువతు లు ఆ ప్రాంతాల జనులకు వైద్యకీయ సేవలందించడానికి 18 నెలలపాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో చేరారు. దానితోపాటు ఉదయం రామాయణ పఠన కార్యక్రమంలో కూడా వారంద రూ పాల్గొని, రామాయణకావ్యం ఆధ్యాత్మికంగా బోధించే విషయా లన్నిటినీ నేర్చుకొంటారు.
1986 శరదృతువులో సిద్దబరి లో మొదటి బ్రహ్మచారుల బృందం వారి పాఠ్యoశాలను పూర్తిచేయటం జరిగింది. స్వామీజీ వారందరికీ బ్రహ్మచారులు ధరించే పసుపు దుస్తులనూ, ఒక నూతననామాన్నీ బహుకరించారు. ఈ ప్రోత్సాహవచ నాలతో వారిని సాగనంపారు :
"హిమాలయ సాందీపనిలో కొత్తగా పట్టభద్రులైనవారిని ఉద్దేశిం చి చేసిన ప్రసంగం"
పచ్చని పట్టువస్త్రాలను మీకిచ్చి నది మీ మార్గం సుగమం కావటాని కే. ఈ దుస్తులు మిమ్మల్ని బ్రహ్మచా రులుగా మార్చవు. అవి ఒక కంచె వంటివి మాత్రమే. పుష్పాలూ, ఫలాలూ వృక్షంనుంచే వస్తాయి. కాని వృక్షాన్ని సంరక్షించడానికి దాని చుట్టూ కంచె ఉండాలి. కంచెనుండి ఫలాలు లభిస్తాయని ఆశించకండి. ఈ దుస్తుల ప్రయోజనం సమాజం నుంచి మీకూ, మీనుంచి సమాజాని కీ రక్షణ కల్పించడానికే !
ఈ 2 1/2 సంవత్సరాలూ మీకు నేర్పినది మళ్లీమళ్లీ గుర్తుచేసుకుం టూండడం ఇకనుంచి మీవిధి. ఇక్కడి తరగతులలో భావాలు మా నుంచి మీకు ప్రవహించాయి. బాహ్య ప్రపంచంలోకి అడుగిడిన తర్వాత కూడా ఇక్కడ నేర్చిన విషయాలను మననం చేసుకొని, మీస్వతంత్రమైన ఆలోచనద్వారా వాటిని స్వంతం చేసుకోడానికి మీరు కొంత సమయా న్ని కేటాయించుకోవాలి. వాటి గురించి సమగ్రంగా ఆలోచించక పోతే, మీరు ఎంతగొప్ప పండితు లైనా సరే, మీ భావాలను స్పష్టంగా వ్యక్తీకరించలేరు. వేదాలలోని సత్యo స్పష్టంగా తెలుసుకోవాలంటే చాలా చింతన అవసరం. మీకు స్పష్టమైన పుడే, మీ మాటలద్వారా ఇతరులకు కూడా స్పష్టంగా తెలుస్తుంది.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment