🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(260వ రోజు):--
స్వామి తేజోమయానంద బోధన లో బొంబాయిలోని సాందీపని సాధ నాలయంలో పట్టభద్రులైన బ్రహ్మచా రుల నుద్దేశించి 1987లో స్వామీజీ ఇలా మాట్లాడారు :
గురువుకు ఆహారం సంపాదించి తెచ్చిపెట్టడం, తర్వాత తను భుజించ డం, నిద్రించడం - ఇది ప్రాచీనకాలం లో బ్రహ్మచారుల పద్దతిగా ఉండేది. దీనివల్ల హిందూమతం మురిగిపో యి, నాశనమయ్యే స్థితికి వచ్చింది. మీరుకూడా బ్రహ్మచారులే ; కాని, పద్దతి మాత్రం అదికాదు. హిందూ మతాన్ని రక్షించటానికీ, దానినిఇంకా అభివృద్ధి చేయటానికీ, మనం ఒక కార్యకర్తల సైన్యాన్ని తయారుచేస్తు న్నాం - భరతమాత నిజమైన హృదయాన్ని జనులు గ్రహించేలా.
ఈవిషయంలో మీకు విశ్రాంతి అనేది ఉండకూడదని నేను భావిస్తు న్నాను. పని ఎక్కువగా ఉంటోందని జాలిపడే ప్రశ్నేలేదు. నేను పనిచే స్తుంటే ఎవరూ దిగులుపడలేదు. ఇప్పుడు హఠాత్తుగా అందరూ నాకే చెప్తున్నారు నాకు 70 ఏళ్ళని! నేను వృద్దుడనౌతున్నానని నాకు తెలియ నేలేదు ; దానిగురించి ఆలోచించ డానికి నాకు ఒక్కక్షణమైనా తీరిక లేదు. బ్రహ్మచారులైన మీరందరూ కూడా అదేవిధంగా పనిచెయ్యాలని నేను ఆశిస్తున్నాను.
1987 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లోనూ, పట్టణాల్లోనూ సుమారు 50 మంది బ్రహ్మచారులు పనిచేస్తున్నారు. వారంతా బోధన లోనూ, మిషన్ కార్యక్రమాలు నిర్వ హించటంలోనూ, వారి సామర్థ్యం, సమాజపు అవసరాలు, పరిస్థితు లనుబట్టి వివిధ సేవాకార్యక్రమాల్లో నూ నిమగ్నులయ్యారు. వారిలో చాలామంది తమంతతామే సేవా పథకాలను యోచించి అమలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని కడపజిల్లాలో గ్రామస్థులు విరాళంగా ఇచ్చిన 22 ఎకరాల భూమిలో స్వామిని శారదా ప్రియానంద గ్రామీణుల సేవకోసం చిన్మయారణ్యం అనేపేరుతో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ భూమి ఎటువంటిదంటే, దానిమీద ఒకచెట్టై నా, మొక్కైనా లేదు; మారుమూల నున్న ఆ ప్రాంతాన్ని చేరాలంటే, ఒక మైలుదూరాన్నుంచి ఎద్దుబండి మీదనే ప్రయాణం చేయాలి. అటు వంటి స్థలంలో ఐదు సంవత్సరాల్లో నూతులు త్రవ్వారు, చెట్లునాటారు, వ్యవసాయం మొదలుపెట్టారు, ఒక మైదానం చుట్టూ భవనాలు నిర్మిం చారు. వంటగది, భోజనశాల తప్ప మిగిలిన వాటన్నిటినీ స్థానికులు అక్కడున్న ముడిసరుకుతోనే ఆ ప్రాంతపు శైలిలో వెదురుకఱ్ఱలు తాపడం చేసిన మట్టిగోడలతోనూ, గడ్డితో చేసిన పైకప్పుతోనూ నిర్మిం చారు. ఆ భవన సముదాయంలో ఒక సభాభవనం, తరగతులకు గదు లు, వృద్దులకు వేరువేరుగా నిర్మించి న చిన్నచిన్న కుటీరాలు, బాలబాలిక లకు ప్రాథమిక పాఠశాల, రెండువస తి గృహాలుఉన్నాయి. అంతేకాకుం డా, స్థానికప్రజల అవసరాలను దృష్టి లో ఉంచుకొని ఉచిత హోమియో పతి వైద్యసదుపాయం, పేదవిద్యా ర్థుల అవసరాలకు తగినట్లు ఒక పాఠశాల, వృత్తివిద్యాకేంద్రం, 6గురు చిన్నపిల్లలున్న ఒక అనాథ శరణా లయం కూడా ఏర్పాటుచేశారు. శ్రీమతి అనంతరావమ్మ అనే 80 ఏళ్ల బామ్మగారు పిల్లల సంరక్షణ బాధ్యత వహిస్తున్నారు. వృద్దులకూ, అంగవైకల్యంతోఉన్న పేదవారికీ మధ్యాహ్నభోజనం ఉచితంగా లభిస్తుంది. ప్రతిఆదివారం ఒక వారానికి సరిపడే ఆహారధాన్యాల నూ, విరాళంగా లభించిన కూరల నూ, దుస్తులనూ విద్యార్థులు సమీ పగ్రామాల్లో అవసరమైన జనులకు అందజేస్తున్నారు. స్వామినికున్న అంతులేని శక్తి, ఉత్సాహం, ప్రేరణ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా నిధులు అందజేసేలా చేశాయి. 1988లో ఆమె గుంటూరులో నాలు గెకరాల స్థలంలో చిన్మయారణ్యం శాఖ నిర్మాణాన్ని కూడా స్వయంగా పర్యవేక్షించారు.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment