@ నిర్వాణం @
ఓటమీ
గెలుపూ
బతుకు
పయనంలో
మజిలీలు మాత్రమే
విజయం అంటే
ఆగక సాగే పయనం మాత్రమే
******
పూలూ ఉంటై
పదునైన ముళ్ళూ ఉంటై
జననం
మొదలూ ....
అంతిమ శ్వాస వరకూ
భయపడి
ఉన్నచోటనే నిలచిపోవడమే
పరాజయమంటే
*******
ప్రశంసలూ
సుమాలై కురుస్తు ఉంటై
కరుకు
రాళ్ళై విమర్శలూ
మనసును తాకుతునే ఉంటై
తడబడి పొరబడి
శిరస్సు వంచేయడమే
లొంగిపోవడమంటే
*****
నిరాశలూ
నిస్ఫృహలూ
వడగాలులై సోలిపోజేస్తై
అహమూ
కామమూ స్వార్థమూ
విష వాయువులై స్పృహను హరించేస్తై
అరిషడ్వర్గాల
ఉచ్చుల పాశాలకు చిక్కడమే
జీవచ్ఛవమైపోవడమంటే
*******
మరి ...
ఏదో తెలుసా
నీ అంతిమ గమ్యం
నువ్వు
చేరుకోవాలని
ఆరాటపడే లక్ష్యం
విముక్తీ
జీవన్ముక్తీ
అది చిదానందమే
- రత్నాజేయ్ (పెద్దాపురం)
No comments:
Post a Comment