నిరంతర యాత్ర.
విజయం అనేది శాశ్వతం కాదు,
గమ్యమూ కాదు,
అది కేవలం రేపటి మెట్టు
మాత్రమే!
వైఫల్యం అనేది అంతిమం కాదు...
ముగింపు అంతకన్నా కాదు...
అది నేర్చుకునేందుకు, మలుపు తిరిగేందుకు దారి మాత్రమే!
విజయం వచ్చిందని
ఆగకు మిత్రమా..
ఆగిపోతే నీ గమ్యం
నీకు దూరమవుతుంది.
ఉత్సాహంతోనే.. ముందుకు సాగిపో..
శిఖరాలను నువ్వు చేరాలి!
వైఫల్యం ఎదురైందని నిరాశపడకు..
దారిలో చిన్న గుంత
మాత్రమే..
ప్రయత్నం ఆపకు..
పట్టు వదలకు ఏనాడూ..
ఓటమిని దాటితేనే కదా.. గెలుపు రుచి తెలిసేది..
గెలుపోటములు రెండూ.. జీవితంలో ఒక భాగమే..
నిరంతరం కృషి.. చేయడమే మన లక్ష్యం..
Bureddy blooms.
No comments:
Post a Comment