Tuesday, November 4, 2025

 అమరులు....పొట్టి శ్రీరాములు....
---------------------------------------------

అప్పటి మద్రాసు ఇప్పటి చెన్నయ్ రాష్ట్రంలో జార్జి టౌన్ పట్టణం, అన్నాపిళ్లై వీధి,ఇంటి నెం.163 లో 1901 మార్చ్ 16 తేదీన జన్మించారు మన పొట్టి శ్రీరాములు.....

గురవయ్య ,మహాలక్ష్మమ్మ ఈయన తల్లి దండ్రులు.......

ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో పడమట పల్లె ఈయన స్వస్థలం ......

విద్యాబ్యాసం అంతా మద్రాస్ లోనూ, బొంబాయి లోనూ సాగింది.....

చదువు పూర్తి కాగానే గాంధీ గారి సిద్ధాంతాల పట్ల ఎంతో ఆకర్షితుడైనాడు శ్రీరాములు.....

తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీ గారి అనుమతి తో 1930 ఏప్రిల్ లో సబర్మతి ఆశ్రమం లో చేరారు శ్రీరాములు......

అపుడే నెల్లూరులో దళితులకు ఆలయ ప్రవేశం, అస్పృశ్యత నివారణ వంటి వాటికోసం పోరాడుతూ చేశారు ఎన్నో నిరసన దీక్షలు.......

వివిధ రాష్ట్రాలలో చేశారు సత్యా గ్రహ ఉద్యమాలు......

ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన ఆమరణ నిరాహార దీక్ష కు ముందు 5 సార్లు చేశారు నిరాహార దీక్షలు శ్రీరాములు........

వీటి తర్వాత  ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబరు 19 నుండి డిసెంబరు 15 వరకూ 58 రోజులు  ఆమరణ నిరాహార దీక్ష చేశారు శ్రీరాములు  ........

డిసెంబరు 16 వ తేదీన మరణించి అయినారు అమరులు.......

ఈయన అంతిమ యాత్ర రెండెడ్ల బండిపై సాగుతున్నపుడు శోక సంద్రంలో మునిగిపోయాయి పుర వీధులు.......

కన్యకాపరమేశ్వరి దేవస్థానం లో ఆర్య వైశ్యులు స్మశాన వాటికలో జరిగాయి శ్రీరాములు గారి అంత్య క్రియలు......

గాంధీజీ తుపాకీ గుళ్ళు కు బలి కాగా శ్రీరాములు ఆత్మ బలిదానం చేసి అయ్యారు ఇద్దరూ అమరులు........

ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని బలిదానం చేశారు మన పొట్టి శ్రీరాములు.....

అపుడు శ్రీరాములు గారి ప్రాణ త్యాగాన్ని కొనియాడారు ఎందరో మహనీయులు......

డిసెంబరు 19 వ తేదీన లోక్ సభ లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గా ప్రకటించారు నెహ్రూ గారు.ఎంతగానో సంతోషించారు ఆంధ్ర ప్రజలు.......

1853 అక్టోబరు 1తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.ఆ క్షణాలు ఎంతో మధుర క్షణాలు.....

2008 మే 22 తేదీన నెల్లూరు జిల్లా ను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గా నామకరణం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఊరికే పోవు త్యాగాలు.....

అమరజీవి కీ.శే.పొట్టి శ్రీరాములు గారు ఇప్పటి తరానికి ఎంతో ఆదర్శ నీయులు....

నేడు ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ....

                 వెంకట్ పొలమూరి.
                  అంబాజీపేట.🙏

No comments:

Post a Comment