Friday, August 28, 2026

మహాభారతంలో అతిపెద్ద మిస్టరీ: దుర్యోధనుడికి స్వర్గం, పాండవులకు నరకం ఎందుకు?

మహాభారతంలో అతిపెద్ద మిస్టరీ: దుర్యోధనుడికి స్వర్గం, పాండవులకు నరకం ఎందుకు?

Author Name:cinegod

Youtube Channel Url:https://www.youtube.com/@cinegod-films

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7GQi3u2h1o8



Transcript:
(00:00) యుధిష్ఠిరుడు స్వర్గం చేరుకున్నాడు కానీ అక్కడ సింహాసనం మీద కూర్చుని ఉన్నది దుర్యోధనుడు. మరి పాండవులు ఎక్కడ ద్రౌపది ఎక్కడ వాళ్లంతా నరకంలో ఉన్నారు. ఇది ట్విస్ట్ కాదు ఇది మహాభారతం ఇచ్చిన లాస్ట్ షాక్ అవును మీరు విన్నది నిజమే. ఇది మహాభారతం చివరి భాగం స్వర్గారోహణ పర్వంలో ఉన్న కథ. గత వీడియోలో పాండవులు మంచు కొండల్లో ఒక్కొక్కరిగా పడిపోవడం చూసాం.
(00:29) కానీ స్వర్గ ద్వారం దాటాక యుధిష్టిరుడికి ఎదురైన షాక్ ఇంకా పెద్దది విలన్ కి స్వర్గం హీరోలకు నరకం ఆ ద్వారం తెరుచుకుంది. బంగారు వెలుగు దేవతల మధ్య ఒక కింగ్ పూర్తి రాజ వైభవంతో కూర్చుని ఉన్నాడు. యుధిష్టిరుడు దగ్గరగా వెళ్లి చూశాడు. అది దుర్యోధనుడు అదే ఫస్ట్ షాక్ ఆ ఒక్క క్షణంలో అతని మైండ్ బ్లాంక్ అయింది. కళ్ళు ఎర్రబడ్డాయి. పిడికిలి బిగుసుకుంది.
(00:58) ఈ యుద్ధం అంతటికీ కారణమైన వాడికి స్వర్గమా యుధిష్ఠిరుడు వెనక్కి తిరిగాడు. సినేగాడ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మహాభారతం ఆఖరి పర్వంలో జరిగిన ఆ ఫైనల్ ట్విస్ట్ చూద్దాం. వెనక్కి తిరిగిన యుధిష్టిరుని నారద మహర్షి సైలెంట్ గా ఆపాడు. ఆయన ఇచ్చిన ఆన్సర్ యుధిష్టిరుడికి ఇంకా షాక్ రాజా స్వర్గంలో శత్రుత్వాలు ఉండవు.
(01:23) దుర్యోధనుడు గురించి చెడుగా మాట్లాడకు అన్నాడు. ఇతను క్షత్రియ ధర్మం ప్రకారం బతికాడు ఒక వారియర్ల యుద్ధంలో వెన్నుచూపలేదు తన శరీరాన్నే యుద్ధాగ్నిలో ఆహుతి చేశాడు. అందుకే వీరులకు దక్కే ఈ లోకం ఇతనికి దక్కింది. యుధిష్టిరుడు ఒప్పుకోలేదు లోకాన్నే నాశనం చేసిన వాడికి వీరుల లోకమా నాకు ఈ స్వర్గం వద్దు నా తమ్ములు ద్రౌపది ఎక్కడ ఉంటే నేను అక్కడికే వెళ్తాను.
(01:51) ఒక దేవదూత ముందుకు వచ్చాడు. సరే రాజా రా నీ వాళ్ళు ఉన్న చోటికి తీసుకెళ్తాను అన్నాడు. కానీ ఆ దారి పైకి కాదు కిందికి అది చాలా డేంజరస్ దారి కట్ చేస్తే వెలుతురు మొత్తం పోయింది. చుట్టూ చీకటి కాళ్ళ కింద ముళ్ళు ఎముకలు గాలిలో భరించలేని కంపు ఒక పక్క వైతరని నది రక్తంతో మరుగుతూ ప్రవహిస్తోంది. ఇంకో పక్క అసిపత్రవనం ఆకులు అన్ని కత్తుల్లా ఉన్న అడవి కాలుతున్న ఇసుక మండుతున్న నూనె గుండాలు యుధిష్టిరుడు ఆగిపోయాడు ఇంకా ఎంత దూరం నాకు ఇక్కడ ఉండాలని లేదు వెనక్కి వెళ్దాం అన్నాడు అతను వెనక్కి తిరిగిన ఆ క్షణంలో
(02:38) చీకట్లోంచి ఒక గొంతు వినిపించింది. ఆగు కొంచెం సేపు ఆగు యుధిష్ఠిరుడు ఆగిపోయాడు. ఎవరు నువ్వు నేను కర్ణున్ని యుధిష్ఠిరుడి గుండె ఆగినంత పని అయ్యింది. యుద్ధం అయిపోయాక కానీ తనకు ఆ రియాలిటీ తెలియదు. కర్ణుడు తన సొంత అన్నయ్య అని ఆ అన్నయ్య ఇప్పుడు ఈ చీకట్లో వెంటనే ఇంకో గొంతు అన్నయ్య నేను భీముణని నూరుగురిని ఒంటి చేతితో ఓడించిన ఆ పవర్ ఇప్పుడు ఆ గొంతులో లేదు నువ్వు దగ్గరికి వచ్చేసరికి ఒక చల్లని గాలి వస్తోంది.
(03:21) ఆ గాలికి నా బాధ తగ్గుతోంది. కొంచెంసేపు ఇక్కడే ఉండు ఇంకో గొంతు ఇంకా దూరం నుంచి నేను అర్జునుడిని ప్రపంచాన్నే గెలిచిన ఆ గ్రేట్ వారియర్ చేతులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. అన్నయ్య నువ్వు ఉన్నంతసేపు ఇక్కడ కొంచెం వెలుతురు ఉంటుంది వెళ్ళిపోకు నేను నకులుడిని అంది ఒక గొంతు నేను సహదేవుడిని అంది ఇంకోటి నేను దృష్టదిమనుడిని ప్రతి గొంతులో ఒకటే మాట కొంచెం సేపు ఆగు లాస్ట్ కి ఒక ఆడ గొంతు వినిపించింది.
(03:59) చాలా బలహీనంగా ఈ మూమెంట్ లో యుధిష్టిరుడి ధైర్యం మొత్తం పోయింది. నేను ద్రౌపదిని ఆ మాట వినగానే యుధిష్టిరుడు కుప్పకూలిపోయాడు. ఆ చీకట్లో అతని ఫ్యామిలీ మొత్తం ఉంది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. గొంతు పెగలేదు ఇదేం న్యాయం ధర్మం కోసం బతికిన వీళ్ళు ఇక్కడ ఈ కంపులో అధర్మం చేసినవాడు అక్కడ సింహాసనం మీద ఇదే నా దేవతల రూల్ ఇది చాలా హాష్ రియాలిటీ జీవితంలో మొదటిసారి యుధిష్ఠిరుడికి దేవతల మీదే కోపం వచ్చింది.
(04:39) ఆ ఒక్క క్వశ్చన్ తో అతని ధర్మం మొత్తం కదిలిపోయింది. దేవదూత అన్నాడు రాజా చూసావు కదా ఇక పద దేవలోకంలో నీకోసం ఎదురుచూస్తున్నారు. యుధిష్ఠిరుడు ఒక్క క్షణం ఆగాడు. తర్వాత అతను చెప్పిన ఆ మాట మహాభారతం మొత్తంలో బిగ్గెస్ట్ గూస్పంస్ మూమెంట్ ఇక్కడ మాట్లాడింది ఒక కింగ్ కాదు ఒక అన్నయ్య నువ్వు వెళ్ళు వెళ్లి దేవతలకు చెప్పు యుధిష్టిరుడు రావట్లేదు అని నేను ఇక్కడ నిలబడితే నా వాళ్ళ బాధ తగ్గుతోంది.
(05:12) అలాంటప్పుడు నాకు స్వర్గం ఎందుకు నా తమ్ములు ఎక్కడ ఉంటే అదే నా స్వర్గం నేను ఇక్కడే ఉంటాను. రాజ్యం వదిలేశాడు కిరీటం వదిలేశాడు ఇప్పుడు స్వర్గాన్నే వదిలేశాడు. ఇదే అతని ఫైనల్ టెస్ట్ ఇక్కడే అతను నిజమైన రెస్పెక్ట్ సంపాదించాడు. ఈ స్టోరీ నచ్చుతుంటే సినేగార్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ మాట పూర్తి అవ్వగానే ఒక మ్యాజిక్ జరిగింది.
(05:39) చీకటి మాయమైంది. కంపు పోయింది. వైతరణి లేదు కత్తుల అడవి లేదు ఇంద్రుడు యమధర్మరాజు దేవతలందరూ ఎదురుగా నిలబడ్డారు. అక్కడ అసలు నరకమే లేదు అది మొత్తం ఒక ఇల్యూజన్ దేవతలు క్రియేట్ చేసిన మాయ ఇది నీకు పెట్టిన మూడో టెస్ట్ అన్నాడు ఇంద్రుడు మరి ఈ పరీక్ష ఎందుకు పెట్టారు ఇక్కడే మహాభారతం అసలు రీజన్ చెప్తుంది.
(06:08) యుద్ధంలో ద్రోణాచార్యుని ఆపడం ఎవరికీ ఇంపాజిబుల్ అయింది. అప్పుడు ఒక ప్లాన్ వేశారు. అశ్వత్థామ అనే పేరున్న ఏనుగును చంపారు. తర్వాత యుధిష్టిరుడు గట్టిగా అన్నాడు. అశ్వత్తామ చనిపోయాడు అని కొడుకు పేరు వినగానే ద్రోణుడు ఆయుధాలు కింద పెట్టాడు. నిజానికి చనిపోయింది ఏనుగు మనిషి కాదు ఆ చివరి మాటను మాత్రం యుధిష్టిరుడు చాలా మెల్లగా అన్నాడు. ద్రోణుడికి అది వినిపించనే లేదు.
(06:36) జీవితం మొత్తం నిజమై మాట్లాడిన మనిషి ఒక్కసారి మాత్రం చిన్న ట్రిక్ చేశాడు. అందుకే అతనికి కూడా మాయతోనే నరకం చూపించారు. మరి దుర్యోధనుడికి స్వర్గం ఎలా దక్కింది ఈ పర్వం ఒక రూల్ చెబుతుంది. పాపాలు ఎక్కువ ఉన్నవాడు తన కొద్దిపాటి పుణ్యాన్ని ముందు అనుభవిస్తాడు తర్వాత కిందికి పోవాల్సిందే పుణ్యం ఎక్కువ ఉన్నవాడు తన చిన్న పాపాన్ని ముందు అనుభవిస్తాడు.
(07:05) తర్వాత శాశ్వతంగా పైకే వెళ్తాడు. అంటే దుర్యోధనుడు చూసిన స్వర్గం స్టార్టింగ్ మాత్రమే పాండవులు చూసింది కూడా స్టార్టింగే దుర్యోధనుడి స్వర్గం శాశ్వతం అని కొన్ని కథనాలు ఉన్నాయి. కానీ ఈ పర్వంలో క్లియర్ గా చెప్పింది మాత్రం ఇదే తర్వాత యుధిష్టిరుడు ఆకాశగంగలో స్నానం చేశాడు. మనిషి శరీరం పోయింది. దివ్య రూపం వచ్చింది. అప్పుడు అసలు నిజం కనిపించింది.
(07:33) కర్ణుడు సూర్యుడిలో కలిసిపోయాడు. ద్రౌపది శ్రీదేవి రూపంలో నిలబడింది. భీముడు వాయువులో నకుల సహదేవులు అశ్విని దేవతల్లో అర్జునుడు కృష్ణుడి పక్కనే నరకం అనుకున్నది రియల్ కాదు అది ఒక పరీక్ష ఆ పరీక్ష పెట్టింది శిక్ష కోసం కాదు శుద్ధి కోసం మహాభారతం ఇక్కడ ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇస్తుంది. నిజం చెప్పడం గొప్ప కాదు ఒక్కసారి కూడా తప్పకుండా చెప్పడం గొప్ప.
(08:05) ఒక్క చిన్న కాంప్రమైజ్ కూడా లెక్కలోకి వస్తుంది. యుధిష్టిరుడు తీసుకున్న ఆ డెసిషన్ మీకు కరెక్ట్ అనిపించిందా మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మహాభారతం అన్టోల్డ్ స్టోరీస్ కోసం సినీ గాడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరో మహాభారత కథతో మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment