Monday, August 31, 2026

కర్మ మనల్ని ఎలా వెంటాడుతుందో తెలిస్తే..| Dr. Newton Kondaveti Explains Karma Siddhantam | itsUTV

కర్మ మనల్ని ఎలా వెంటాడుతుందో తెలిస్తే..| Dr. Newton Kondaveti Explains Karma Siddhantam | itsUTV

Author Name:it's UTV Spiritual

Youtube Channel Url:https://www.youtube.com/@itsUTVSpiritualChannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dVl0ziA2TDY



Transcript:
(00:03) చాలామంది ఈ జన్మ పునర్జన్మ భవిష్యత్తు చాలా లైట్ తీసుకుంటారు. ప్రస్తుతం గడిఫ్త అయిపోయింది ఈరోజు అయిపోతే చాలు అన్నట్టుగా ఉన్నారు. అలా కాకుండా ఈ జన్మ పునర్జన్మ కర్మ ఈ మూడిటికీ ఉన్న సంబంధం చెప్తారా సర్ డెఫినెట్లీ ఇప్పుడు కర్మలు అనేవి అందరికీ ఉంటాయి ప్రతి ఒక్కళళకి ఒక జన్మ తీసుకున్నారంటే కర్మ లేకపోతే జన్మ తీసుకోం ఒక జన్మ తీసుకుని ఒక మానవ జన్మ గాని ఏ జన్మ తీసుకున్నా కూడా ఈ భూమ్మీదకి మనం వచ్చాము అంటే కొన్ని కర్మలు ఉంటాయి ఇక్కడ కచ్చితంగా అకౌంట్స్ ఉంటాయి కర్మ అంటేనే సంస్కృత
(00:49) భాషలో మనం ఏ పని చేస్తున్నామో అది దాన్నే కర్మ అంటాం చేసే పని మనం ఈ మాటతో పని చేస్తున్నాం కూడా మాట కూడా ఒక కర్మే మాట కూడా క్రియేట్ చేస్తుంది కర్మ మన ఆలోచనలు కూడా క్రియేట్ చేస్తాయి కర్మలు మనం నెగిటివ్ థాట్స్ తో కొంతమందిని అఫెక్ట్ చేస్తాం అనుకోండి అది కూడా కర్మే మన వర్డ్స్ తో కొంతమందిని బాధిస్తాము అది కూడా కర్మే థాట్ తో మనిషిని ఇబ్బంది పెట్టిన కూడా కర్మ కింద కర్మే అది కూడా కర్మే మనం ఒక వర్డ్ చెప్పకుండా చాలా కోపంగా మనం కళ్ళు ఎర్ర చేసి ఒకళని చూసాము దాని వలన వాళ్ళకి బాధ కలిగింది వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు వాళ్ళ పట్ల మన ప్రవర్తన బాలేదు
(01:36) మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం అది కూడా కర్మ క్రియేట్ చేస్తుంది. మనం వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాం అంటే హింసాత్మకంగా బిహేవ్ చేస్తున్నాం. అయన్నీ కూడా కర్మలు క్రియేట్ చేస్తాయి ఇప్పుడు కొంతమంది పైకి నవ్వుతూ ఉంటారు లోపలేమో విషయం ఉంటుందన్నమాట వాళ్ళ పైన అది కూడా కర్మ కింద క్రియేట్ అయిపోతుందా అది కూడా కర్మ కింద క్రియేట్ చేస్తారు ఇది అవుతుంది ఎందుకంటే నవ్వుతూనే మోసం చేశారు అనుకోండి ఎవరినైనా నవ్వుతూనే బిట్రే చేశారు నమ్మక ద్రోహం చేశారు అవన్నీ కూడా కర్మలే ఎందుకంటే ఈ యొక్క భౌతిక తలము ఏ అర్త్ మీద మనం ఉంటున్నామో ఇక్కడ జన్మ తీసుకున్నామో
(02:14) ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా మన యొక్క యాక్షన్స్ కి మనం రెస్పాన్సిబుల్ దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అంటే మనము ఏ పని చేస్తున్నామో దానికి పర్యవసానం కచ్చితంగా ఉంటుంది ఏదో ఒక రూపంలో మనకు ఉంటుంది. అందుకే మనం ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు మనకి ఆ ఎరుక అనేది మనకి కలుగుతుంది. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఈ ఎరుకని కలుగజేస్తుంది.
(02:43) నా వలన ఇంతమంది బాధపడ్డారా ఒకసారి మనకి తెలియకుండానే మనం ఎంతో మందికి బాధ క్రియేట్ చేస్తుంటాం. సో కర్మలు చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. కర్మ ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు. అకర్మిగా ఉండలేరు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఎవ్వరూ అకర్మిగా ఉండలేరు. అలా చేయాలని కూడా లేదు ఎందుకంటే చేస్తూ ఉండాలి కర్మలు చేస్తూ ఉండాలి కానీ మనం చేసే కర్మలు ఎరుకతో చేసినప్పుడు కొన్ని రెక్టిఫై అవుతాయి మనం కొన్ని నెగిటివ్ కర్మలు చేయం దుష్కర్మలు చేయం ఓకే శుభ కర్మలు చేస్తాం మంచి కర్మలు చేస్తాం సత్య కర్మలు చేస్తాం ఇంకా ఇంకొక లెవెల్ ఏంటంటే హైయర్ లెవెల్లో
(03:29) అది లోకోద్ధారణ కోసంగా లోక కళ్యాణం కోసంగా మనం చేసే కర్మలు అవి చాలా ఉత్తమోత్తమైనటువంటి కర్మలు అవి చేస్తాం. కానీ మనం అకౌంటబుల్ అన్నమాట. మన కర్మ ఏదైతే చేశమో ఒక నెగిటివ్ అవన్నీ కూడా మన క్రెడిట్ కార్డులో లోన్ లాంటిది క్రెడిట్ కార్డ్స్ మనం యూస్ చేస్తాం కానీ మనం ఎప్పుడైనా అది క్లియర్ చేసుకోవాలి. ఆ క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్నీ మనం క్లియర్ చేయాలి.
(04:01) మరి పుణ్యకర్మ అంటే డెబిట్ కార్డు అన్నమాట. డెబిట్ కార్డు లో మీరు ఆల్రెడీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి మీరు ఎంతో పుణ్యం చేసుకని వచ్చారు ఈ జన్మలో మీకు అన్నీ జాక్పట్టే అన్ని మంచి అవకాశాలు వస్తుంటాయి మీరు కష్టాలు ఏం లేవు ఏది అడగకపోయినా అన్ని వస్తుంటాయి మీ చెందకి అందరూ అంటారు మీరు చాలా అదృష్టవంతులు అక్కడ అదృష్టం కాదు అదృష్టం అంటేనే మనం చూడలేనిది ఆ దృష్టికి మనకి కనిపించనిది ఏంటంటే మనకు కనిపించింది వాళ్ళు చేసిన పుణ్యకర్మ ఎన్నో జన్మల్లో వాళ్ళు పుణ్యకర్మ చేశారు.
(04:37) ఆ పుణ్యకర్మల ఫలానా ఇప్పుడు వారికి ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది అంత విజయమే కానీ కొంతమందికి ఏది పట్టుకున్నా కూడా ఫెయిల్యూర్స్ వస్తుంటాయి కూడా ఏది చేసినా కూడా ఫలించవు వాళ్ళు అనుకున్నది చేయలేకపోతుంటారు. ఇది ధర్మం అని తెలుసు కానీ అంటే వాళ్ళ పర్పస్ అని తెలుసు వాళ్ళ జీవితం జయంని తెలుసు ఇది చేస్తే నేను ఆనంద పడతాను అని తెలుసు కానీ చేయలేరు ఎందుకంటే కర్మ సైకిల్స్ వాళ్ళని లాగి పట్టేస్తాయి ఇరుక్కొని ఉంటారు సో నెగిటివ్ కర్మ ఉంటుంది పాజిటివ్ కర్మ కూడా ఉంటుంది. ఈ రెండు ఉంటాయి.
(05:23) సో ఇవి మన జనన మరణ చక్రాలకి పునాది అవుతాయి ఇవన్నీ క్రియేట్ చేస్తాయి ఈ కర్మ అకౌంట్స్ రెండిటిని అకౌంట్స్ క్లియర్ చేసుకోవాలంటే మళ్ళా జన్మ తీసుకోవాల్సిందే మళ్ళా తీసుకుంటాం జన్మ తీసుకుంటాం తప్పదా తప్పదు ఎందుకంటే ఈ జన్ మరణ చక్రాల ద్వారా మనమందరం కూడా ప్రతి ఒక్కరు జన్మ తీసుకున్న వారందరూ కూడా పరిణామ క్రమంలో ముందరికి వెళ్ కాదు ఈ భూమండలం అనేది ఒక అద్భుతమైనటువంటి పాఠశాల.
(05:59) ఇక్కడ మనకి ఎన్నో మనకి లెసన్స్ ఉంటాయి పాఠాలు ఉంటాయి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అహింస హింస లేకుండా ఉండడము అహింస అనేది ఒక పాఠం ఆ చిన్న పాఠం నేర్చుకోవడానికి ఎన్ని జన్మలు పడుతుందో ఒక జన్మ కాదు ఎన్నో జన్మలు సేవ చేయడం అనేది కూడా ఒక గొప్ప పాఠం ఆత్మ పాఠం సేవ చేయాలనే బుద్ధి కూడా కొంతమందికి పుట్టదు ఎప్పుడు సెల్ఫిష్ నేను నేను నేను నేను కానీ ఒక ఆత్మ పరిణామ స్థాయిలో ఒక స్థాయికి చేరు జరుకున్నటువంటి వారు వారు వారి జన్మలో ఎప్పుడు కూడా సేవ ఫస్ట్ అన్నమాట వారు నేను ఈ అందరికీ
(06:46) సంఘానికి ఏం చేయగలను అందరికీ నేను ఏం చేయగలను ఈ ప్రపంచానికి నేను ఏం చేయాలి ఏం చేయగలను అని ఆ క్వశ్చన్ వచ్చి వాళ్ళు చేయడానికి ముందరకి వస్తారు. సో ఆత్మ పరిణామ క్రమంలో ఎన్నో జన్మలు తీసుకుంటాం. ఈ కర్మలే డిసైడ్ చేసుకుంటాం కర్మలే డిసైడ్ చేస్తాయి మనం సో మన కర్మలను బట్టే మన బుద్ధి కూడా ఉంటుంది. కర్మానుసారమే బుద్ధి బుద్ధి అనుసారనే కర్మాను కూడా చాలామంది సార్ ఇప్పుడు చెడ్డవాళ్ళకు దుర్మార్గులకు దుష్టులకే మనం గమనిస్తే అంటే అట్లాని కాదు పైసా ఉంటుంది వాళ్ళకే పవర్ ఉంటుంది వాళ్ళకే సమాజంలో వాళ్లే చలామణి అవుతారు వాళ్లే నలుగురిట్లో పేరు
(07:32) ఉంటుంది. ఎలా సర్ మరి అది తాత్కాలికమే మన ప్రయాణం ఎన్నో జన్మల ప్రయాణం ప్రతి ఒక్కరి ప్రయాణం ఎన్నో జన్మలు సో ఇప్పుడు తాత్కాలికంగా వాళ్ళు ఒకళ్ళని మోసం చేసో లేకపోతే ఆధిపత్యం చేసి వాళ్ళ మీద పెద్దలను చలాయించి లేకపోతే ఏదో కంట్రోల్ చేసి ఏదో ఉన్నారు వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు వచ్చి ఉండొచ్చు కానీ ఎంత కాలం ఉంటాయి మనం కరెక్ట్ గా చూస్తే దేర్ ఈస్ ఏ డౌన్ ఫాల్ వాళ్ళ కర్మ పర్యవసానం వాళ్ళు అనుభవించి తిరవల్సిందే ఎందుకంటే అక్కడ ఇక్కడ మామూలుగా మనం సిసీ కెమెరాస్ అని మాట్లాడుకుని ఉంటాం ఆ పైన కూడా ఒక
(08:17) పెద్ద సిసీ కెమెరాలు ఉంటాయన్నమాట అన్ని రికార్డు కాబడుతుంటాయి చిత్రగుప్తుడు అనేవారు మనం వింటుంటాం చిత్రగుప్తుడు అంటేనే గుప్త చిత్రాలు అన్నమాట అన్ని చిత్రాల లెక్కన తీసుకుని ఉంటుంది మన యూనివర్స్ విశ్వం నుంచి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళళ కర్మలు అన్నీ కూడా ఏం చేస్తున్నాము ప్రతి ఒక్కటి కూడా అక్కడ స్టోర్ కాబడి ఉంటుంది ఆ డేటా స్టోర్ అయి ఉంటుంది.
(08:44) సో కచ్చితంగా దాని యొక్క ఇన్ఫ్లయన్స్ ప్రభావం మన మీద ఉంటుంది. ఉండి తీరుతుంది కానీ ఒక్కొక్కసారి ఆ కర్మలు ఇప్పుడే చేశారు బ్యాడ్ కర్మ చేశారు నెగిటివ్ కర్మ చేశారు ఒకళ్ళకి హాని చేశారు కానీ వాళ్ళు చాలా పేరు ప్రఖ్యాతలు అన్ని వచ్చాయి. అప్పుడే వాళ్ళకి ఫలించలేదు ఇంకా దీన్నే దాన్నే మనం కర్మ ఫలము అంటాం. కర్మ విత్తనాలు నాటబడ్డాయి ఇప్పుడు వాళ్ళు నాటుకున్నారు అవి ఫలిస్తాయి కచ్చితంగా విత్తనం ముక్క కావాలి ముక్క నుంచి ఫలం వస్తుంది అంతే ఈ యొక్క కర్మ ఫలం అనుభవించి తీరాల్సిందే ఎవరైనా సరే అది ఒక్కొక్కసారి అదే జన్మలో కావచ్చు ఒకసారి నెక్స్ట్
(09:31) జన్మలో కావచ్చు సర్ మనము గమనిస్తే కదా ఈ పూర్వ జన్మ గురించి తెలుసుకోవడం అవసరం అంటారా ఒక పరిణామ స్థాయికి వీచేయన తర్వాత ఖచ్చితంగా మనకు తెలుస్తాయి. అంతవరకు అది అవసరం లేదు. ఇప్పుడు ఎల్కేజీ లో ఉన్నప్పుడు మనం పోయెట్రీ అన్ని నేర్చుకోం ఫిలాసఫీ నేర్చుకోం మనం కిండర్ గార్డటెన్ లో ఉన్నప్పుడు మనం ఆ ప్రాథమిక స్థాయిలో ఉండే ఆ పాఠాలు మాత్రమే నేర్చుకుంటాం.
(10:07) అలానే ఆధ్యాత్మికత పరంగా కొంతమంది పరిణామ క్రమంలో చాలా ముందరికి వెళ్ళిన వాళ్ళు వారు రెడీ అయ్యారు వారు సంసతతో ఉన్నారు వాళ్ళ యోగ్యత వచ్చింది వారికి ఈ జన్మలు కచ్చితంగా తెలుసుకుంటారు వా్ యోగులకి ఋషులకి వాళ్ళకి తెలుసు వాళ్ళ ఒక జన్మ ప్రయాణం కాదు ఇది ఒక జన్మతో అయ్యేది కాదు ఎన్నో జన్మలు బహునిమే వ్యతీతాని జన్మాని తవచార్జున ఓ అర్జున ఎన్నో జన్మలు ఎన్నో జన్మలు తీసుకున్నావ్ మర్చిపోయావు కానీ నాకు అన్నీ గుర్తున్నాయి నా జన్మలన్నీ నాకు తెలుసు నీ జన్మలు కూడా
(10:52) తెలుసు సో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ విషయం చెప్పాడు ఎన్నో జన్మల ప్రయాణం తెలుసుకో యోగి భవార్జున ఆ అర్జునుడు రెడీ అయ్యాడు. ఓకే మీరు పూర్వజన్మలో ఏంటి సార్ నా పూర్వజన్మలో నేను ధ్యాన సాధన ప్రారంభించినప్పుడు నాకు కొన్ని అనుభవాలు వచ్చాయి దానిలో ఒక బౌద్ధ భిక్షువుడిగా నేను చూసుకున్నాను అన్నమాట ఒక సుమారు 2000 సంవత్సరాల క్రితం ఎందుకంటే ఆ విజన్స్ కానీ ఆ దృశ్యాలు మనకి కనిపించినప్పుడు స్మృతి అంటామ అన్నమాట దాన్ని అంటే లోపలి నుంచి మనకి ఓ ఇది 2000
(11:38) సంవత్సరం క్రితం ఇది తక్షశిల యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ పేరు కూడా నాకు లోపల వచ్చేసింది. అక్కడ నేను ఒక ఆచార్యుడిగా ఉండేవాడిని అక్కడ బౌద్ధ భిక్షువులందరికీ కూడా ఈ కర్మ గురించి పునర్జన్మ సిద్ధాంతం గురించి బోధించేవాడిని బౌద్ధ భిక్షువు ఉంది నేను ఎంత గ్రేట్ అంటే అందరూ గ్రేటే అందరూ ఉంటాయి ఎన్నో జన్మలు కానీ మనం ఈ జన్మలో మనం అది నిలబెట్టుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుంచి నేను యోగ ప్రశ్న ఉన్నాయి అని అనుకోండి అక్కడ పరిణామ క్రమంలో చాలా చాలా పైకి వెళ్ళాను ఇక్కడంతా స్నేక్ అండ్ లాడర్ గేమ్ మేడం
(12:19) అవును వైకుంఠపాలి అంటే వైకుంఠపాలి పాము ఎక్కడైనా మింగేస్తుంది. మనం చివరి స్టెప్ వరకు చాలా జాగరూకతతో ప్లస్ ఎరుకతో ఉండాలి లేకపోతే మనం మళ్లా యోగ భ్రష్టులు అవుతాం. అందుకే ఈ జన్మ కూడా ఇంపార్టెంట్ ఈ జన్మలో నేను ఇన్ని జన్మలు చూసుకున్నా కూడా ఆ జన్మ పరిపూర్ణమత ఈ జన్మలో కూడా నేను జీవించగలుగుతున్నానా ఆ కరుణతో జీవించగలుగుతున్నానా ఆ ఆధ్యాత్మికతో నేను జీవించగలుగుతున్నానా అది ఇంపార్టెంట్
(13:04) ఆ ప్రస్తుతం ఉన్న లౌకిక జీవన విధానంలో అందర అందరూ కూడా డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉంటున్నారు. కంఫర్ట్స్ డబ్బు ఇంకా థర్డ్ స్టెప్ ఏంటంటే హెల్త్ ఇది తప్ప అసలు ఇంకా ఏమీ లేదు అసలు కరెక్ట్ మేడం ఇవి మనుగడ కోసం కావాలి కచ్చితంగా కావాలి. ప్రతి ఒక్కళ్ళకి డబ్బు కావాలి. ఎక్కువ అక్కర్లేదు వాళ్ళకి కంఫర్టబుల్ లైఫ్ చాలు ప్రతి ఒక్కళ్ళకి అత్యాశ పోకూడదు.
(13:37) అత్యాశ అంటే భయంతో మనం ఎక్కువ ఫ్యూచర్ లో అన్నం దొరుకుతుందో లేదో ఫ్యూచర్ లో ఏమన్నా విపత్తు వస్తే ఏమవుతుందో ముందుగానే సంపాదించి బ్యాంకులో పెట్టుకుందాము ఈ విధంగా ఆలోచనలు వస్తాయి ఎక్కువ అత్యాసకు వెళ్తాం దురాసకు వెళ్తాం. మన టైం అంతా కూడా దానికే పెట్టేసుకుంటాం. అవును లౌకికమైనటువంటి ఈ యొక్క ఓన్లీ ప్రాపంచికమైనటువంటి ఈ విషయాలు తప్పేం కాదు కచ్చితంగా డబ్బు అవసరమే హెల్త్ అవసరమే తర్వాత వాళ్ళ కుటుంబము అవసరమే సామరస్యంగా ఉండాలి కుటుంబంలో అందరూ కూడా అది కూడా అవసరమే దానితో పాటు ఆధ్యాత్మికతను కూడా
(14:23) ఇంక్లూడ్ చేసుకోవాలి అన్ని ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉంది అని చెప్తా ఉంటాం అంటే అంటే అన్ని ఉన్నాయని ఆధ్యాత్మిక లేదునుకోండి జీరోనే అంటే వెలితి ఉంటది లోపల అంటే ఒక ఆధ్యాత్మికత అనేది ఒక పరిపూర్ణతను తీసుకొస్తుంది ఒక మనిషిలో ఒక సార్ధకతను తీసుకొస్తుంది. వాళ్లో ఒక సంతుష్టిని తీసుకొస్తుంది. చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
(14:54) ధన్యవాదాలు థాంక్యూ వీక్షించారు కదండీ ఇప్పటివరకు డాక్టర్ న్యూటన్ గారు చెప్పినట్టుగా సాధన అనేది చాలా ముఖ్యం. ఒక సాధన చేయటం ఒక మంచి పుస్తకాన్ని మీరు చదవటం ఒక మంచి స్నేహితులతోటి మీరు సంచారం చేయటం ఇటువంటి వాటి వల్ల మీలో ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోయి ఒక చక్కటి పాజిటివిటీ తోటి మీ జీవితంలో మీరు అనుకున్న సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
(15:26) చాలా అంశాల గురించి చాలా విస్తారంగా చెప్పారు. మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ యు టీవీ నేను మీ డాక్టర్ శ్రృతి సైనింగ్ ఆఫ్ నమస్తే. [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment