Sunday, March 29, 2020

కరోనా వైరస్ - ముఖ్య సమాచారం తెలుసుకుందాము..

కరోనా వైరస్ - ముఖ్య సమాచారం తెలుసుకుందాము..

కరోనా వైరస్ అనేది కొత్తదేమీ కాదు. ఇప్పటికే '6' రకాల కరోనా వైరస్ లకు సంబంధించిన సమాచారం మనకు అందుబాటులో ఉన్నది.

ఇప్పటి వైరస్ కరోనా జాతి లోని '7'వది అవుతుంది. అంతకు ముందు లేని కొత్త జన్యు రూపంతో ఇది బయట పడింది. కాబట్టి దీనికి NAVAL CORONA VIRUS అని, 2019 లో కనుగొనబడింది కాబట్టి NAVAL CORONA VIRUS- 19 అని నామకరణం చేశారు.

దీని ద్వారా వచ్చే జబ్బును COVID-19గా వ్యవహరిస్తున్నారు.

దీని GENE MAPPING ను కూడా తెలుసు కున్నారు. అన్ని వైరస్ లాగే ఇది కూడా ఒక వైరసే. కాకపోతే కొత్త జన్యు రూపంతో ఉన్నది కాబట్టి దీని గురించి ఎక్కువ విషయాలు మానవాళికి ఇంకా తెలియలేదు. ఇంకా పరిశోధన దశ లోనే ఉన్నాయి.

వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడి వున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే. ఇది ఒక నిర్జీవి.

ఇది కంటి, ముక్కు,గొంతు లోని కణాలతో కలిసి నప్పుడు తన యొక్క జన్యు కోడ్ ను మార్చుకొని, ఆ కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే కాక అవి సంఖ్యలో వృద్ధి అయ్యే విధంగా చేస్తుంది.

వైరస్ అనేది జీవి కాదు కాబట్టి, దీనిని చంపడం అనేది జరుగదు. దానంతట అదే క్షయమవుతుంది (నాశనం).

వైరస్ క్షయం (నాశనం) అయ్యే సమయం ఉష్ణోగ్రత, గాలిలో తేమ & అది ఉన్న ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది.

వాస్తవానికి వైరస్ చాలా బలహీన మైనది. తేలికగా విచ్చిన్నమయ్యే గుణం కలిగినది. కానీ దానికి రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది.

అందుకే సబ్బు, డిటర్జెంట్స్ వాడటం వలన, వాటి నుండి వచ్చే నురగ కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది.
అందుకే సబ్బు తదితర పదార్థాలతో కనీసం 30 సెకండ్లు గట్టిగా రుద్దమని చెబుతారు.
సబ్బుతో రుద్దడం వలన కొవ్వు కణాలు విచ్చిన్నమై, లోపల వున్న వైరస్ (ప్రోటీన్) కూడా దానంతట అదే విచ్చన్నమౌతుంది.

వేడి కొవ్వును కరిగిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అందుకే 25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వున్న నీటితో చేతులు, బట్టలు, ఇతరాలను శుభ్ర పరచుకోవాలి.

వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం కూడా ఉన్నది. నురగ ఎంత ఎక్కువగా ఉంటే, వైరస్ ను అంత సులభంగా కరిగించ గలం.

కొవ్వులు ఆల్కహాల్‌ లో కరుగుతాయి. అందుకే 65% తగ్గని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్‌ మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.

ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీరు కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించినట్లయితే వైరస్ లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేసి, వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.

హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ప్రోటీన్ (వైరస్) అణువులను విచ్చిన్నం చేసే శక్తి ఉన్నది. అందుకే చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు.

వైరస్ నిర్జీవి కనుక దానిని Anti Biotics నిర్వీర్యం చేయలేవు. కానీ వాటి నిర్మాణాన్ని కొంత మేరకు కుదించ గలవు. Anti Biotics బాక్టీరియాను మాత్రమే చంపగలవు.

ఉపయోగించిన లేదా ఉపయోగించని బట్టలను దులపడం లేదా విదిలించడం చేయ రాదు. ఎందుకంటే వాటిలో వైరస్ ఉంటుంది కాబట్టి..

వైరస్ నిర్వీర్యం కాకుండా/నిలచి వుండే సమయం:

వైరస్ బట్టలపై - 3 గంటల వరకూ
సహజ సిద్ధమైన ఏంటి సెప్టిక్ అయిన రాగి పై - 4 గంటలు, చెక్క పై - 4 గంటలు, కార్డ్ బోర్డు పై - 24 గంటలు, లోహాలపై - 42 గంటలు, ప్లాస్టిక్ పై - 72 గంటలు నిర్వీర్యం కాకుండా ఉంటుంది.

వైరస్ ఉన్న బట్టలు, ఇతరాలను మనం దులిపి నపుడు వైరస్ గాలిలో కలసి సుమారు మూడు గంటలు ఉండే అవకాశం ఉంది. అటువంటి గాలిని మనం పీల్చినప్పుడు వైరస్ మన ముక్కు ద్వారా ఊపిరితిత్తుల లోనికి ప్రవేశిస్తుంది.

వైరస్ లు చల్లని వాతావరణంలో, ఎయిర్ కండిషనర్ల కారణంగా ఏర్పడే కృత్రిమ చల్ల దనంలో మరియు చీకటిలో వాటి అస్తిత్వాన్ని నిలకడగా కొనసాగిస్తాయి.

కావున మన పరిసరాలను తేమ లేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురు తో వుండేలా చూసు కోవాలి.

ప్రతి రోజూ గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.

అల్ట్రా వయొలెట్ కిరణాలు కూడా వైరస్ లోని ప్రోటీన్ లను విచ్చిన్నం చేస్తాయి. కానీ UV Rays చర్మంపై పడితే (మన చర్మం లోని కొలాజిన్ అనే ప్రోటీన్ ను విచ్చిన్నం చేస్తాయి) చర్మ కేన్సర్ వచ్చే అవకాశం వుంటుంది.

ఆరోగ్య వంతమైన మానవవుని చర్మం ద్వారా ఈ వైరస్ లు శరీరం లోకి ప్రవేశించ లేవు.

వెనిగర్ వలన ఉపయోగం లేదు ఎందుకంటే వెనిగర్ కు కొవ్వులను కరిగించే శక్తి లేదు.

స్పిరిట్, వోడ్కాల వలన కూడా వైరస్‌ను కట్టడి చేయలేం ఎందుకంటే వాటిలో 40% కన్నా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది. వైరస్ నిర్వీర్యం కావాలంటే 65% ఆల్కహాల్ కావాలి.

65% ఆల్కహాల్ కలిగిన శానిటీజర్స్, లిస్టరిన్ వలన కొంత ఉపయోగం ఉంటుంది.

తక్కువ వెలుతురు, గాలి కలిగిన ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

విశాలమైన ప్రదేశం, గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది.

చేతులు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసు కోవాలి. ఎందుకంటే ఎండిన చేతుల్లోని పగుళ్ళలో వైరస్ దాక్కొనే అవకాశం ఉంటుంది.

మనం ఉపయోగించే మాయిస్చరైజర్ ఎంత చిక్కగా ఉంటే వైరస్ ను విచ్చిన్నం చేయడానికి అంతగా ఉపయోగ పడుతుంది.

గోళ్ళ సందుల్లో వైరస్ ఉండకుండా గోళ్ళ పరిమాణం చాలా తక్కువ వుండేలా చూసు కోవడం కూడా ముఖ్యమే.

Note:
ఇనుముపై 12 గం.ల వరకూ వుంటుంది - కాబట్టి తాళాలు, తలుపుల నాబ్స్, స్విచ్ లు, రిమోట్స్, సెల్ ఫోన్, వాచీలు, కంప్యూటర్ లు, డెస్కులు, టివిలు ముట్టుకున్నప్పుడు, బాత్రూమ్ కు వెళ్ళి నప్పుడు, బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు, భోజనానికి ముందు తప్పక చేతులు సబ్బులు ఉపయోగించి 10 ని.లకు తగ్గకుండా శుభ్రం చేసుకోవాలి.

మీకు కరోనావైరస్ ఉందని ఎలా తెలుసు?
1. గొంతులో దురద,
2. పొడి గొంతు,
3. పొడి దగ్గు.
4. జలుబు, తల నొప్పి నుండి తీవ్ర జ్వరము కూడా వస్తుంది.

కావున మీరు ఈ మూడు లక్షణాలు మనకు వున్నాయేమో మనకు మనమే గమనించుకుంటూ ఉండాలి.
ప్రతి రోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.

ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహన ని పెంచుదాం.
నలుగురికి ఈ విషయాలు తెలిసేలా పంచుదాం.

Maximum Help to Maximum People..

ఈ సమాచారాన్ని మీ వద్ద మాత్రమే ఉంచ వద్దు. మీ కుటుంబం మరియు స్నేహితులందరికీ పంపించండి.

Friday, March 27, 2020

రూపానికి ముందు నువ్వున్నావు.రూపంలో నువ్వున్నావ్.రూపం వదిలేశాకా నువ్వుంటావు.

64లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణ మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది.

అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది.

ప్రవేశించిన తరువాత కేవలం 24గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే.
ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..

అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది.
రూపాన్ని పొందుతుంది.
కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి.
ఏమి చేసినా భరించాలి.
క్రమంగా దేహం పెరుగుతుంది.
దేహం మీద మోహం పెరుగుతుంది.
ఈ దేహం నేనె అంటాం.
కానీ ఎలా?
నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?
ఏ భాగము వినదు.
వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.

చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6అడుగులు అవుతుంది.

అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.

ఈ దేహం నీదే కదా!
ఎందుకు మొరాయిస్తుంది?
ఈ దేహం నీదేకదా!
ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?
ఈదేహం నీదేకదా!
ఎందుకు నీమాట వినడంలేదు?
ఈదేహం నీదేకదా!
ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?

ఎందుకంటే ఈ దేహం నీది కాదు.
ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈదేహం నాదే.
నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.

ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు.

శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు.
ఈ సృష్టి యొక్క అర్థం అని తెలుసుకొ..

రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.
రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.
చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.

ఇక్కడ ఉన్నది నువ్వు కాదు.
నీకు తల్లిదండ్రులు ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.

రూపానికి ముందు నువ్వున్నావు.
రూపంలో నువ్వున్నావ్.
రూపం వదిలేశాకా నువ్వుంటావు.

ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు.

ఈ దేహం అమ్మ నాన్న లు ఇచ్చిన ఓ అద్భుత వరం.

కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి, నేను కూడా అదే ప్రయత్నం లో వున్నాను.

అలాగే ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం.

మానవుడు ప్రకృతి ధర్మాన్ని వదిలి తన ఇష్టం వచ్చినట్లు బ్రతకాలి అని నిర్ణయించుకున్నప్పుడు కరోనా, హంటా లాంటివి వెంటాడుతూనే ఉంటాయి.
ఇవన్నీ సృష్టి వినాశనానికి మూల సంకేతాలుగా కనపడుతున్నాయి.

కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ధర్మో రక్షితే రక్షితః.


మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాం, ఎవరు పంపారు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం, ఒక్కసారి ఆలోచించుకుందాం.
మనం అభివృద్ధి ని సృష్టించు కుంటున్నామా లేక మన వినాశనాన్ని పురిగొల్పుతున్నామా! ఏమో మనకే తేలియాలి.

బాధలు, కష్టాల గురించి

🕉️☀️💥🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️💥☀️🕉️

27-03-2020

☀️ "అమర చైతన్యం" ☀️
( శ్రీ రమణ మహర్షి బోధనలు )

బాధలు, కష్టాల గురించి:

సృష్టి ఆరంభం నుంచి కష్టాలు, బాధలు, చెడ్డతనము ఉన్నాయి. ఋషులు ఈ స్థితిని ఎందుకు మార్చలేదు. రాక్షసులున్నారని వేదం చెప్పింది. ఏదో ఒక నిరోధకశక్తి కష్టాలను దుఃఖాన్ని సృజిస్తుంది. ఇదంతయు మానవుల మంచికి మరియు వికాశమునకు పనికి వచ్చింది. ప్రకృతిలోని మరొక శక్తి యొక్క పనియే ఇది.

ప్రశ్న: ప్రపంచంలోని బాధల వలన, చెడుల వలన ప్రయోజనమేమిటి ?

జవాబు: ప్రపంచంలో కష్టాలు లేకపోతే మనము మనము మన నిజస్వరూపాన్ని గురించి ఆలోచించము. దుఃఖమే మనిషికి భగవంతుడిని గుర్తు చేస్తుంది. జ్ఞానులకు తప్ప రాజు మొదలుకొని కూలివాని వరకు కూడా ఎంతోకొంత బాధ, దుఃఖము వుంటాయి. కొంచెం బాధలకే మనిషి భగవంతుడిని తలవడు. దెబ్బ కొంచెం గట్టిగా తగిలితేనే భగవంతుడు గుర్తుకువస్తాడు. మనకు ఈ శరీరం వచ్చింది మన నిజస్వరూపాన్ని (ఆత్మని) తెలుసుకొనుటకు మాత్రమే. సృష్టి యొక్క ప్రయోజనం నిన్ను నీవు తెలుసుకోవడమే. నీ నిజస్థితిలో మాయ అనేది లేదు. నీ గురించి నీవు తెలుసుకొనక పోవడమే నీవు చేసే పొరపాటు.

ప్రశ్న: ప్రపంచం పురోగమిస్తోందా..

జవాబు: ప్రపంచాన్ని నడిపే వాడొకడున్నాడు. అదీ అతని పని.
సృష్టి చేసినవాడే దానిని నడుపుతున్నాడు. మనకు అభివృద్ధి వుంటే ప్రపంచం కూడా అభివృద్ధి చెందినట్లే.. నీవెలాగో ప్రపంచం కూడా అలాగే. నిన్ను నీవు తెలుసుకోకుండా ప్రపంచాన్ని గురించి తెలుసుకున్నందువల్ల నీకేమి ఉపయోగం.. ఆత్మజ్ఞానం లేక ప్రపంచ జ్ఞానం వల్ల ఉపయోగం లేదు. ప్రపంచాన్ని ఆత్మదృష్టితో చూడు.

జీవిత పరమార్తం గురించి చిన్న సినిమా వీడియో క్లిప్

EMBED

Thursday, March 26, 2020

సెల్ఫ్ హెల్ప్ బుక్స్ గురించి ఒక ఆర్టికల్

ఈ సందర్భంగా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ గురించి నేను చదివిన ఒక ఆర్టికల్ పోస్ట్ చేస్తున్నాను.

పుస్తక విపణిలో వ్యక్తిత్వ వికాసం పేరిట వేడివేడి పకోడీల్లా వందలాది పుస్తకాలు అమ్ముడుపోవడం ఆశ్చర్యమేస్తుంది. ఇంతటి ఘనమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద గల తెలుగు జాతికి విడిగా వ్యక్తిత్వ వికాసమంటూ ఓ కొత్త విషయంలా నేర్పవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. ఉగ్గుపాలతో నేర్చిన సుమతీ, వేమన శతకాల్లోని వ్యక్త్విత్వ వికసన పాఠాలు కాలం చెల్లిపోయాయా? వాటిని మించిన తత్త్వబోధ ఈ పుస్తకాల్లో ఏముంది? ప్రస్తుతం చలామణీ అవుతున్న పుస్తకాలను పరిశీలించే ముందు అసలు వ్యక్తిత్వ వికాసం పరిధి ఏమిటో అర్థం చేసుకోవాలి. మనిషి సంపూర్ణ మానవుడిగా ఎదగడం అని అనుకుంటే వ్యక్తిగా సమాజం పట్ల బాధ్యత కలిగి వుండాలి. పుట్టిన దేశానికి ఋణపడి ఉండాలి. కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని అంటిపెట్టుకొని ఉండాలి. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. మరి ఈ ‘వికాసం’ పుస్తకాల్లో ఏముందో వాటి పేర్లే సగం చెబుతాయి. కొన్ని మెట్లు ఎక్కితే విజయం, విజయానికి అభయం అనడంలో దాగిన ‘విజయం’ ఎవరికి? వ్యక్తికా? వ్యక్తి భాగమయిన సమాజానికా? వ్యక్తిగత అభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి సంబంధం ఏమిటి? వింతైన పేర్లలో మరికొన్ని - నెంబర్‌వన్ అవడం ఎలా? నిన్నటి దాకా శిలనైనా? 30 నిమిషాల్లో మిమ్మల్ని మీరు మార్చుకోండి! విజయపథ గర్జన, మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక నిమిషం చాలు! ఎంతో ఆకర్షణీయమైన పేర్లు ఇవి.
సామాజిక బాధ్యతను ఏమాత్రం మోయకుండా కాల్పనిక జగత్తులో, క్షుద్ర సాహిత్యంలో యువతను ఉత్కంఠభరితుల్ని చేసిన రచయితలు ఎత్తిన మరో అవతారమే ఇది. వారి చేతికి దొరికిన మరో మంత్రదండమే ‘వ్యక్తిత్వ వికాసం’. కొందరు సైకాలజిస్టులు రాసినవైనా ప్రయోజనం మాత్రం నేతి బీరకాయ చందమే.
అయిదారు మెట్లలో విజయం దొరుకుతుందంటే ఆశపడనిదెవరు? పైగా ‘ప్రసిద్ధ’ రచయితలు అబద్ధమాడతారా! యువత ఎగబడడం, లక్షలాది ప్రతులు అమ్ముడుబోవడం తథ్యమే. అయితే అందులో మారిన శాతమెంత? వింతేమిటంటే ఒక రచయిత ఓ అడుగు ముందుకేసి - ‘నా తొలి పుస్తకం చదివి 10వేలమంది విజేతలైనారు. ఇది రెండో పుస్తకం. అంతకంటే ఎక్కువమంది విజేతలు అవుతారని ఆశ’ అని ముందుమాటలో రాసుకున్నాడు. ఈ లెక్కలు ఎక్కడివి? పాఠ్యపుస్తకాలు వదిలేసి అందరూ వీరి పుస్తకాలు చదివితే అందరూ విజేతలే కదా!
నిజానికి వికాసమంటే అందరినీ ప్రేమించడం. తన పిల్లలకన్నా ఇతరులు ముందుంటే ఈర్ష్య పడకుండా ప్రోత్సహించడమూ. భారతీయ తత్త్వవేత్తల బోధనలను గాలికొదిలి విదేశీ రచయితలు ‘పర్సనాలిటీ డెవలప్‌మెంట్’ పేరిట రాస్తున్న కూతలన్నింటినీ తెలుగులో అనువదించి వండి వార్చడం జాతి ద్రోహం అనదగ్గదే. ఇన్ని పాఠ్యపుస్తకాలు, సిద్ధాంత గ్రంథాలు, పలకా బలపం పట్టి చదివిందంతా జీవితంలో విజయాలు సాధించడానికి పనికి రానిదై పోయింది. నేటి యువత షార్ట్ రూట్‌లో జాక్‌పాట్ కొట్టడానికి ఉబలాటపడి ఉన్న కాస్త చిల్లర సొమ్మును దోపిడీపాలు చేసుకుంటున్నారు. మరో మెట్టు ఎక్కితే విజయం సొంతమని నమ్ముతూ ఎండమావుల్ని చూసి చెంబు బోర్లేసుకుంటున్నారు. అసలు విజయం అంటే ఏమిటి? గెలుపంటే ఒక మనిషి హాయిగా, ఆనందంగా, తక్కువ సమస్యలతో, మంచి సంబంధాలతో, నలుగురి మధ్య మంచి పేరుతో, ఉన్నంతలో ఇతరులకు సహాయం చేస్తూ, ఆరోగ్యం కాపాడుకుంటూ, తన సమయాన్ని, సహనాన్ని, సమృద్ధిని తన అదుపులో పెట్టుకొని ప్రశాంతంగా జీవించడం అని ఓ కోణంలో చెప్పుకోవచ్చు. ఇవన్నీ 30 నిమిషాల్లో ఓ పుస్తకం చదివితే సాధ్యపడతాయా? లభించే చిన్నపాటి లాభాన్ని సర్వరోగ నివారిణిలా ప్రచారం చేయడం యువతను మోసం చేసినట్లే కదా? ఇలా వస్తున్న పుస్తకాలు రాయడం తేలిక. ఇతర భాషల్లో కుప్పలు తెప్పలుగా సమాచారం లభిస్తుంది. కాస్త ఇంగ్లీషు పరిజ్ఞానం, తెలుగు భాషపై పట్టు, ఆసక్తికరంగా రాయగలగడం తెలిస్తే ఇక యువతకు నిషా ఎక్కించడం చిటికెలో పని. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తత్త్వవేత్తల కొటేషన్లకు కాస్తంత సొంత చాపల్యం కలిపి పిసికితే ఓ పుస్తకం సిద్ధం. కాపీరైట్ల సమస్యే లేదు. ఒక్కొక్క మెట్టు పెంచుతూ చదువరి కూలబడేదాకా ఎన్ని మెట్ల పుస్తకమైనా రాయొచ్చు. ‘పట్టు దప్పి అగాధంలోకి జారిపోతున్నవారిని పట్టుకొని పైకిలాగి ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞాన సంజీవిని ఈ పుస్తకం’ అని ముఖచిత్రంపై ఉన్న ఈ వాక్యాల ఆకర్షణకు పుస్తక ప్రతుల అమ్మకాలు పట్టుతప్పాయి. 12వ ముద్రణగా యాభైవేల ప్రతులు మార్కెట్లోకి వచ్చాయి. ఇంతకన్నా మంచి లాభసాటి వ్యాపారం రచనా వ్యాసాంగంలో ఎక్కడా లేదు. గొప్ప గొప్ప పత్రికల కాలమిస్టులకు, టీవీ చర్చల్లో పాల్గొనే మేధావి పాత్రికేయులకు కూడా ఇంత సంపాదన లేదు. ఇదే అదునుగా కొత్తగా వస్తున్న స్వామీజీలు, గురువుల బోధనలను కూడా వారి శిష్య బృందం వ్యక్తిత్వ వికాసం ముసుగులో ప్రచారం చేసి లాభాలు గడిస్తోంది.
రెండు వందలకు పైగా మార్కెట్‌లో ఉన్న ఈ పుస్తకాల్లో ఉన్న విషయం మాత్రం ఒక్కటే. అది విజయానికి మెట్లు వేయడం. ఒక పుస్తకం కొని చదివాక దానితో విజయం లభించక, అది మరో పుస్తకంలో దాగి ఉందేమోనని చదువరి కొత్త పుస్తకం వెంటపడ్తాడు. చివరకు అదొక వ్యసనమై ఆ పుస్తకాల చుట్టూనే తిరుగుతుంటాడు. లేనిచో ఇన్ని లక్షల పుస్తకాలు అమ్ముడుపోవడం అసాధ్యం. ఇప్పుడు పుస్తక విక్రయ కేంద్రాల్లో సైతం ఈ పుస్తకాలకు ప్రత్యేక విభాగం. ప్రవేశం వద్దే వీటి దర్శనం. ఆ తర్వాత ఆధ్యాత్మికం. ఆనక సాహిత్యం. కథ, కవిత, నవలలు సాహిత్యంలో ప్రధాన అంగాలైనా అమ్మకాలను బట్టే దుకాణాల్లో చోటు. ఒక ప్రముఖ రచయిత రాసిన ‘వికాస’ పుస్తకం పలు భారతీయ భాషల్లోకి అనువదింపబడి రెండు కోట్లకు పైగా కాపీలు అమ్ముడుబోయిందని ఒక ఆన్‌లైన్ పుస్తక విక్రేత ధ్రువీకరించడం నమ్మశక్యంగా లేదు. వీటికి తోడుగా శిల్‌ఖెరా, అరిందమ్ చౌదరీ వంటి మేనేజిమెంట్ గురుల పుస్తకాలు కూడా తెలుగులోకి అనువదింపబడి మంచి వ్యాపారం, ప్రచారం పొందాయి. అవి చదవడం, ఆచరించడం పక్కనపెట్టి పుస్తకాల అరలో అలంకరించడం ఓ మోజుగా మారింది. ఈ పుస్తకాల్లో పేర్కొన్నట్టు వాటి అక్షరాలకు అంత శక్తి ఉంటే విజేతలతో దేశం నిండిపోయేది. నిజంగానే అందులో ఓ జీవన క్రమాన్ని, వికసించే విధానాన్ని వివరించినా అవి మన కాల పరిస్థితులకు, ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులకు సమాంతరంగా ఉండాలి. కొటేషన్లు చదవడానికి ఆకర్షణీయంగానే ఉంటాయి. జీవితానికి అన్వయించుకొనే వేళ దారులు మారతాయి. ఒకే విషయంపై ఇన్ని పుస్తకాలు రావడానికి కారణం - రచయితల్లో ఎవరి చమక్కులు వారికి, ఎవరి అక్షర లాఘవం వారికి ఉండటమే. విఠలాచార్య జానపద సినిమాలన్నీ ఒకే కథగా ఉన్నా అత్యధిక హిట్టు కావడానికి కారణం ఆయన దర్శక ప్రతిభ. ఈ ‘విజయ సోపానాల’ కథ కూడా అంతే! గొప్ప రచయితలు గొప్పగా రాసినా ఈ పుస్తకాల మాటున సామాజిక ప్రయోజనం కన్నా వ్యక్తిగత లాభమే ఉంది. ‘వ్యక్తిత్వ’ వికాసం పరిభాష రీత్యా గొప్ప విషయమే. దేశ పౌరుల్లో అది సాధించడానికి నిజాయితీగా కృషి చేసి సామాజిక సంస్కర్తగా పేరు సంపాదించవచ్చు. ఈ పుస్తకాల ప్రచురణలో ఆ చిత్తశుద్ధి ఇసుమంత కూడా కానరాదు.
అవకాశాలు తక్కువ, ఆశావహుల సంఖ్య అధికమవుతుండటం ఈ పుస్తక రచయితలకు వరమైంది. యువతకు ఓటమి నెదుర్కొనే మనోధైర్యాన్ని, జీవించడమంటే అందలాలు ఎక్కడమొక్కటే కాదని చెప్పవలసిన అవసరం ఉంది. ఏటా చదువు పట్టా పట్టుకొని బయటికొస్తున్న విద్యార్థుల్లో అందరికీ సమాన ఉద్యోగ అవకాశాలుండవు. వారివారి సామర్థ్యపు విలువలను బట్టి చిన్న, పెద్ద ఉద్యోగాల్లో సర్దుకొని ఉండవలసిందే. చదువుకు తగ్గ ఉద్యోగం దొరుకుతున్న వారి సంఖ్య ఇరవై శాతం మించి ఉండదు. ఈ శాతం పెరగాలంటే దానికెన్నో రంగాల అభివృద్ధి అవసరం. నేటి ప్రభుత్వాలు ఆ కృషి జరిపితే యువతకు అవకాశాలు వాటంతటవే దక్కుతాయి. ఏ సోపానపు పుస్తకం తిరగేయాల్సిన అవసరం ఉండదు.
నిజానికి వ్యక్తిత్వ వికాసం అవసరమున్న వర్గాలు మన దేశంలో చాలా ఉన్నాయి. స్వార్థమే పరమార్థంగా ఏలుతున్న రాజకీయ నాయకులకు, అధిక లాభాలు దండుకుంటూ ధనికులు అవుతున్న పారిశ్రామికవేత్తలకు, విద్య పేరిట ఫీజుల రూపంలో తల్లిదండ్రుల గోళ్లూడగొడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల అధిపతులకు, దొంగ లెక్కలు చూపి పన్నులు ఎగ్గొడుతున్న వ్యాపారులకు, లంచంతో చేయి తడపందే ఫైలు ముట్టని అధికారులకు ఈ పాఠాలు అవసరం. ‘నిజాయితీగా బతకడం ఎలా?’ అనే శివ్‌ఖెరా పుస్తకం లక్షల కాపీల్లో అమ్ముడుపోయింది గాని అందులో ఒక్క శాతమైనా నిజాయితీగా బతకడానికి సిద్ధపడ్డారా అనేది అసలు విషయం.
వ్యక్తిత్వ శుద్ధికి పాల్పడుతున్న ఈ రచయితలకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పై వర్గాల్లో మార్పు కోసం కృషి చేయాలి. తద్వారా యువతేం ఖర్మ దేశమే బాగుపడుతుంది. అందాకా జారుడుమెట్లు ఏవో, గెలుపు మెట్లు ఏవో యువతను స్వయంగా తెలుసుకోనియ్యాలి. ఎవరికైనా స్వీయ అనుభవాలను మించిన పాఠం ఉండదు.

Reference : whatsapp message

అవధూత అంటే

అవధూత అంటే:

బట్టలు విప్పుకు తిరిగే పిచ్చివాడా? భగవదన్వేషణలో ఉన్మత్త ప్రలాపాలు చేస్తూ తిరిగే దేశదిమ్మరా?

కాదు! కానే కాదు!
ఆత్మజ్ఞానం ఎలా అనిర్వచానీయమో ‘అవధూత’ కూడ నిర్వచనానికి నిబద్ధుడు కాని ఆత్మజ్ఞాని. ఎవరిలో ఏ విధమైన సంకల్పాలు ఉత్పన్నం కావో, ఎవరు అన్నీ తెలిసి ఏమీ తెలియని అమాయకుల్లా, పిచ్చివారిలా ప్రవర్తిస్తారో, ఎవరు కర్తృత్వ, భోక్తృత్వ అభిమానాలకు అతీతులై, త్యాగశీలురై ఉంటారో, ఎవరు సమదర్శన వీక్షణాలతో, పరిపూర్ణ శాంతితో ఉంటారో, ఎవరు వైరాగ్య పరిమళంతో ప్రకాశిస్తుంటారో, ఎవరు సర్వమూ త్యజించి బికారిలా పరిభ్రమిస్తూ దగ్గర చేరినవారికి జ్ఞానబోధ చేస్తుంటారో వారే అవధూతలు.

అట్టి అవధూత స్థితిని తెలియజెప్పే గ్రంథరాజమే అవధూత గీత. వేదాంతవాజ్గ్మయంలో ఇది అతి ప్రశస్తమయినది. ఇది అష్టాధ్యాయాల్లో 289 గీతలతో విరాజిల్లుతున్నది. తీవ్ర వైరాగ్యవంతులై, మొక్షాపేక్షగలవారికి మాత్రమే ఈ గీత ఉపయుక్తం. ఇంతటి ఆత్మతత్వాన్ని ప్రతిబోధించే ఈ అవధూత గీతను ఎవరు, ఎవరికీ బోధించేరు?

త్రిమూర్తుల అంశగా ఆవిర్భవించిన దత్తాత్రేయుల వారు సుబ్రహ్మణ్యస్వామికి దీనిని బోధించేరు. ఇది అత్యుత్తమ అద్వైత బోధ.
ఇంతకీ ఎవరా దత్తాత్రేయులు? ఏమా కథ?

కలహాప్రియుడు నారదుడు తన ‘ఆకలి’ తీర్చుకోవడానికి ఇనుపగుగ్గిళ్ళు తీసుకెళ్ళి వండి పెట్టమని పార్వతి, లక్ష్మి, సరస్వతులను ఒకరి తర్వాతనే ఒకర్ని అర్థిస్తాడు. ఇనుపగుగ్గిళ్ళును వండటం తమవల్ల సాధ్యంకాదని వారు అ అశక్తతను వ్యక్తం చేయడమేగాక అవి అసలు పచనమయ్యే ఖాద్యములే కావని, ఎవరూ వందలేరని వాదనలకు దిగుతారు. అప్పుడు నారదుడు భూలోకానికి వచ్చి, అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళి అతని అర్థాంగి అనసూయా దేవిని అర్థిస్తాడు గుగ్గిళ్ళు వండి పెట్టమని.
ఆమె “సరే!” అంటుంది. తన భర్త అత్రి మహాముని చరభక్తితో కడిగి, ఆ పాదోదకాన్ని ఇనుప గుగ్గిళ్ళ పైన చల్లుతుంది. గుగ్గిళ్ళు పక్వమైపోతాయి! ఆ గుగ్గిళ్ళను తీసుకెళ్ళి నారదుడు ‘ముగ్గురమ్మ’ లకు చూపిస్తాడు. చాకితులైన దేవిత్రయం సిగ్గుపడి తల దించుకుంటారు. పరాభవం, ఈర్ష్య, అసూయలు వారిని దహించి వేయగా మాతృత్రయం అనసూయ శక్తి సామర్థ్యాల్ని పరీక్షించమని తమ తమ భర్తలు త్రిమూర్తులను ఉసిగొల్పుతారు.
అనసూయ పాతివ్రత్యమహిమ తెలిసిన త్రిమూర్తులు భార్యల కోరికకు అడ్డుచెప్పక అనసూయను పరీక్షించడానికి సన్యాసుల వేషంలో అత్రిమహాముని ఆశ్రమానికి వస్తారు. అనసూయాదేవిని ‘నిర్వాణభిక్ష’ కోరుతారు. అనసూయ మారు చెప్పక తన భర్త పాదాల్ని కడిగి ఆ చరణామృతాన్ని కపట సన్యాసులపై చల్లుతుంది. త్రిమూర్తులు ముగ్గురు పసిపిల్లలుగా మారిపోతారు! అనసూయ, అప్పటి కప్పుడు తన చనుదోయి చేపుకి రాగా, పాలను ఆపిల్లలకు కుడుపుతుంది. ఈ విషయం తెలిసిన అత్రి మహాముని తన దివ్యదృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. అనసూయ త్రిమూర్తులవంటి బిడ్డ కావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నది. ఆ కోరిక ఈ విధంగా తీరిందని సంతోషిస్తాడు. భార్య త్రిమూర్తుల అంశతో బిడ్డ కావాలన్నది గనుక, అత్రిమహాముని ఆ ముగ్గురు పసిపాపలను కౌగలించుకోగానే, వారు ముగ్గురూ అదృశ్యమై మూడు శిరస్సులు, ఆరు చేతులుగల ఒకే పిల్లవాడిగా మారిపోతారు. అత్రిమహాముని ఆ పిల్లవానికి ‘దత్తాత్రేయుడు’ అని నామకరణం చేస్తాడు.
త్రిమూర్తులు అదృశ్యమయ్యారని తెలిసిన ముగ్గురమ్మలు లబోదిబోమంటూ అత్రిమహామునీశ్వరుని పతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు. మహాముని వారి అభ్యర్థన మేరకు త్రిమూర్తులను తిరిగి ప్రసాదిస్తాడు. త్రిమూర్తుల అంశతో జన్మించిన ఈ దత్తత్రేయుడే నిత్యవైరాగ్యంతో అవధూతలా అడవిలో సంచరిస్తున్నపుడు ఎదురుపడ్డ సుబ్రహ్మణ్యస్వామికి ఆయన అభ్యర్థనమేరకు అవధూత గీతను బోధిస్తాడు.

ఇంతకీ అవధూత లక్షణాలేమిటి?
అవధూత గీతయే అష్టమాధ్యాయంలో ‘అవధూత’ పదంలోని నాలుగు అక్షరాలలో ఒక్కొక్క అక్షరం శ్లోక ఆరంభ అక్షరంగా, నాలుగు అక్షరాలకు నాలుగు శ్లోకాలలో అవధూత లక్షణాలను వ్యక్తం చేసింది:

ఆశాపాశ వినిర్ముక్తః ఆదిమధ్యాన్త నిర్మలః
ఆనందే వర్తతే నిత్యం
ఆకారం తస్య లక్షణమ్


ఆశాపాశాళ నుంచి విడువబడినవాడు, ఆదిమధ్యాంతరములందు నిర్మలుడు, నిత్యానందస్వరూపుడు అయిన అట్టివానికి ‘అ’ కారం అతని లక్షణం.

వాసవా వర్జితా యేవ
వ్యక్తవ్యం చ నిరామయమ్
వర్తమానేషు వర్తేత
వకారం తస్య లక్షణమ్


ఎవని చేత వాసనలు విడువబడినవో, ఎవడు నిరామయుడై ఉన్నాడో, ఎవడు వర్తమాన పదార్థాలలో ఉనికి కలిగివున్నాడో అట్టివానికి ‘వ’ కారం లక్షణమై ఉన్నది.

ధూర్ది ధూసర గాత్రాణి
ధూత చిత్తో నిరామయః
ధారణ ధ్యాన నిర్ముక్తో
ధూకార స్తస్య లక్షణమ్


ఎవని శరీరం ధూళిధూసరితమై ఉందో, ఎవని చిత్తం నియమింపబడి ఉన్నదో, ఎవడు ధ్యాన ధారణల విముక్తుడై ఉన్నాడో వానికి ‘ధూ’కారం లక్షణమై ఉన్నది.

తత్త్వ చిన్తా ధృతా యేవ
చిన్తా చేష్టా వివర్జితః
తమోహంకార నిర్ముక్తః
తకార స్తస్య లక్షణమ్


తత్త్వచింత కలిగియున్నవాడు, చింతాచేష్టాలు వీడినవాడు, అహంకార మాంద్యములను విడిచినవాడు ఎవడో వానికి ‘త’కారం లక్షణం.
అవధూత గీత అద్వయ సత్తా స్వరూపమై భాసిల్లే ఆత్మస్థితిని ప్రతిబోధించే జ్ఞాన బోధయేకాక ఈ గీత రచన చక్కని పదజాలంతో సంగీతపరంగా శ్రవణానందంగా ఉంటుంది. మచ్చుకు,

తత్త్వమస్యా ది వాక్యేన
హ్యాత్మాహి ప్రతిపాదితః
నేతి నేతి శ్రుతిర్భూయా
దనృతం పజ్ఞ్చాభౌతికమ్


‘తత్త్వమసి’ ఆది వాక్యాల చేత ఆత్మ ప్రతిపాదించబడినది. అసత్యమై పాంచభౌతికమైన అనాత్మ పరమాత్మ కానేరాదని వేదం చెబుతోంది.

అనంత రూపం నహి వస్తు కిజ్ఞ్చత్
తత్త్వ స్వరూపం నహి వస్తు కిజ్ఞ్చత్
ఆత్మైక రూపం పరమార్థ తత్త్వం
న హింస కొ వాపి న చాస్య హింసా


ఆత్మ తప్ప వేరైన వస్తువేదీ నాశనము లేనిది కాదు. ఆత్మైక రూపమైన పరమాత్మతత్త్వం ఒక్కటే నాశనం లేనిది. ఇది దేనిని హింసించేది కాదు. ఇది దేని చేతను హింసింపబడేది కాదు.

నషండో న పుమాన్ న స్త్రీ న బోధో నైవ కల్పనా
సానందో వా నిరానందం ఆత్మానం మన్యసేకథమ్


నువ్వు నపుంసకుడవు కావు. పురుషుడవూ కావు. స్త్రీవి కావు. జ్ఞానమూ కావు. కల్పనవూ కావు. నువ్వు ఆనందమూ కావు. నిరానందమూ కావు. అలాంటి ఆత్మనైన నిన్ను నువ్వు ఎలా తెలుసుకోగలవు?

న తేచ మాతాచ పితాచ బందుః
న తేచ పత్నీ సుతాశ్చ మిత్రమ్
న పక్షపాతో న విపక్ష పాతః
కథం హి సంతాప పరోసి చేతః


ఓ చిత్తమా! నీకు తల్లీ, తండ్రి, బంధువు, భార్య, బిడ్డ, మిత్రుడు ఎవరూ లేరు. పక్షపాతం ఉండుట, లేక పోవుట రెండూ లేవు. అలాంటి నీకు సంతాపం ఎలా కలుగుతుంది?

విన్దతి విన్దతి నహినహి యత్ర
ఛందో లక్షణం నహి నహి యత్ర
సమరస మగ్నో భావిత పూతః
ప్రలపతి తత్త్వం పరమవధూతః


అవధూత ఎక్కడా దేనిని పొందడు. ఛందో లక్షణాలను ఎరుగడు. సమరసంలో మునిగినవాడై, భావం చేత పవిత్రుడై పరమాత్మ తత్త్వాన్ని చక్కగా చెబుతాడు.

ననురూప విరూప విహీన ఇతి
నను భిన్న విభిన్న విహీన ఇతి
నను సర్వ విసర్వ విహీన ఇతి
కిము రొదిషు మానసి సర్వసమమ్


నువ్వు రూపారూపాల లేనివాడివి, భేదాభేదాలు లేనివాడివి. సర్వాసర్వములు లేనివాడివి. సర్వసముడవైన నీకు దుఃఖం ఎందుకు?

తైలొక్య జననీ ధాత్రీ,
సా భగీ నరకో ధృవం
తస్యాం జాతో రతస్తత్ర,
హాహా సంసార సంస్థితిః


స్త్రీ ముల్లోకాలకీ కన్నతల్లి. ధరించేది. ఆమె భగసౌఖ్యం ఇస్తున్నపుడు నరకమే అవుతున్నది. ఇదినిజం. ప్రాణుల పుట్టుకస్థానమే రతిస్థానం. అవడము కడు శోచనీయం. అయ్యయ్యో! ఇదీ సంసారం.

మద్యపానం మహాపాపం,
నారీసంగ స్తథైవచ
తస్మాద్ద్వయం పరిత్యజ్య,
తత్త్వ విష్ఠో భవెన్మునిః


మద్యపానం మహాపాపం. స్త్రీ సంగమం కూడ అలాంటిదే. ఈ రెండిటినీ వదలి తత్త్వనిష్ఠలో ఉన్నవాడు మౌని అనబడతాడు.

యుగాది పంచాంగ శ్రవణం విశిష్టత

యుగాది పంచాంగ శ్రవణం విశిష్టత

పంచాంగ శ్రవణం గురించి తెలుసుకునేముందు పంచాంగం అంటే ఏమిటో తెలుసుకుందాం.

తిధిర్వారంచ నక్షత్రం యోగః కరణమేవచ పంచాంగమ్.

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనే అయిదు ప్రధాన అంగాలున్నదే పంచాంగం.

కాలరూపుడైన భగవంతుడు ఉండేది తిథి.

ఒక్కొక్క గ్రహం భగవంతుడిని సేవిస్తూ ప్రదక్షిణ చేసే దినం వారం.

క్షత్రం (హాని) కలగకుండా రక్షించేది నక్షత్రం.

అలాగే చంద్రుడు నక్షత్రంతో కలిసి ఉన్నకాలం యోగం.

వీటిని సాధించే ప్రక్రియే కరణం.

ఈ పంచాంగాల కలయిక వల్ల, ఏ ఏ ఫలాలు కలుగుతాయో చెప్పేదే పంచాంగం.

ఈ అయిదు దైవ స్వరూపాలైన కాలవిభాగాలే కనుక వీటిని దేవతా స్వరూపాలుగా ఎంచి, పంచాంగ శ్రవణం చేసేముందు కొత్త పంచాంగాన్ని పూజించాలి.

పంచాంగంలో తిథి శ్రవణం వల్ల సంపద,
వారం వల్ల ఆయుర్ వృద్ధి,
నక్షత్ర శ్రవణం వల్ల పాపవిముక్తి,
యోగం వల్ల రోగనివారణ,
కరణం వల్ల కామితార్థాలు సిద్ధిస్తాయి.

పంచాంగ శ్రవణం వల్ల గంగాస్నాన ఫలం, గోదాన, సర్వ దాన ఫలం లభిస్తుందని ధర్మసింధు వచనం.

సర్వేజనా సుఖినోభవంతు

ఉగాది విశేషాలు

-----//ఉగాది విశేషాలు/- /---
వసంతకాలంలో చైత్ర శుక్ల పాడ్యమి నాడు నూతన సంవత్సరాది.ఈ సంప్రదాయం కన్నడ, మహారాష్ట్రులకు కూడ ఉంది.వింధ్య పర్వతాలకు దక్షిణాన శాలివాహన శకం ఉత్తరాన విక్రమార్క శకము పాటిస్తారు.ఇందుకు ఓ ఆసక్తికరమైన కథ ఉంది.ఇది మహారాష్ట్రలో ప్రచారంలో ఉంది.

పురంధరపురంలో ఓ ధనవంతుడైన వర్తకుడు తాను చనిపోయేముందు తన నలుగురు కుమారులకు సీళ్ళు వేసిన డబ్బాలను ఇచ్చి ఆ ప్రకారం పిల్లలు ఆస్తులు పంచుకోవాలని సూచించాడు.
ఆ పాత్రలలో ఒక దానిలో మట్టి, మరొక దానిలో బొగ్గులు,ఇంకోదానిలో ఎముకలు, చివరి డబ్బాలో తవుడు ఉన్నాయి. దీని భావం తెలియక సోదరులు నలుగురు విక్రమార్క చక్రవర్తి వద్దకు పరిష్కారం కోసం వెళ్ళారు. కాని విక్రమార్కునికి దాని అంతరార్ధం అంతుబట్టలేదు.ఆ సోదరులు పరిష్కారం కోసం ప్రతిష్ఠానపురం వెళ్ళారు. ఎవ్వరూ పరిష్కారం చెప్పలేకపోయారు. కాని ప్రతిష్ఠానపురం లోని ఓ బాలుడు ఆ చిక్కుముడిని విడదీసాడు.

ఆ బాలుడు వారి సమస్యను విని మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమిని, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపనూ,ఎముకలతో నిండిన పాత్ర కలిగిన కుమారుడు ఏనుగులు, గుఱ్ఱాలు మొదలైన జంతువులను,తవుడు తో నిండిన పాత్రను పొందిన కుమారుడు ధాన్యాలనూ పంచుకోవాలని వర్తకుని తాత్పర్యమని చెప్పాడు. ఆ బాలుని పేరే శాలివాహనుడు.

శాలివాహనుని సంగతి విన్న విక్రమార్కుడు ఆ బాలుడిని చూడాలని కుతూహలపడి కబురు చేశాడు. అందుకు శాలివాహనుడు తిరస్కరించి విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందన్నాడు.విక్రమార్కుడు కోపించి శాలివాహనునిపై సమరానికి వచ్చాడు.ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలు చేసి తన మంత్రశక్తితో వాటికి జీవం పోసి విక్రమార్క చక్రవర్తి సేనలను సమ్మోహనాస్త్రంతో నిదురపోయేటట్లు చేశాడు. అప్పుడు ఆకాశవాణి ఆ ఇద్దరినీ ఉద్దేశించి నర్మదానదీ ఉత్తరాన విక్రమార్కుని,దక్షిణాదిని శాలివాసనునీ రాజ్యం చేయమని ఆజ్ఞాపించింది.
ఆ విధంగా చైత్ర శుక్ల పాడ్యమి నాడు శాలివాహనుడు తన రాజ్య పట్టాభిషక్తుడయ్యాడు.శాలివాహన శకారంభకుడయ్యాడు.ఆ రోజు యుగాది అయ్యింది.

ఆదిలో ఈనాడే బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించాడు.ఈ కారణంగానే ఉగాది నాడు కొత్త లెక్కలు ప్రారంభించే ఆచారం వచ్చింది. వనవాసానంతరం సీతారాములు అయోధ్యకు ఈనాడే తిరిగి వచ్చారు.వసుమహారాజు తపస్సు చేసి ఈనాడే రాజ్యాధికారం సాధించాడు. అందుకే ఉగాదికి అంత ప్రాశస్థ్యం.ఉగాది నాడు చేయవలసినవి:
1.ప్రతిగృహ ధ్వజారోహణం:
ఉగాది నాడు ప్రతీ ఇంటిపైన బ్రహ్మధ్వజాన్ని ఎగురవేయాలి.కొత్తగా ఇల్లు కట్టేవారు ఉగాది నాడు కట్టుబడి ప్రారంభించాలి.మనమైతే మానేశాం కానీ మహారాష్ట్రులు ఇప్పటికీ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. వారు ఈ పండుగను" గుడిపర్వా" గా వ్యవహరిస్తారు.

2.తైలాభ్యంఖనము:
ఉగాది నాడు తొలిఝాములోనే నువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి.

3.నవ వస్త్రాభరణ ధారణ,ఛత్రచామరాది స్వీకరణ:
ఉగాది నాడు ఉదయాన్నే శుచి అయి కొత్తబట్టలు‌,కొత్త నగలూ ధరించాలి. ఎండాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి కొత్త గొడుగు,విసనకఱ్ఱలను సమీకరించుకోవాలి.

4.దమనేన బ్రహ్మ పూజనం:
ఈనాడు బ్రహ్మను దమనంతో పూజ చేయాలి. ఈ పక్షంలోని పదిహేను దినాలు ఆయా దేవతలకు దమనంతో పూజలు చేయాలి. ఆ దమనపు ఆకులను స్త్రీలు తమ శిరస్సుపై ధరించాలి.

5.సర్వ పచ్చాంతికర మహాశాంతి:
ఈరోజు చేసే శాంతి కార్యక్రమాన్ని'సర్వ పచ్చాంతికర మహాశాంతి' అంటారు.ఈ శాంతిలో భాగంగా వినాయకుని,నవగ్రహాలను,బ్రహ్మాది దేవతలను పూజించాలి.

6.నింబ కుసుమ భక్షణం;
ఉగాది ఋతుసంబంధమైన పండుగ. ఆయా పండుగలలో ఆయా ఋతువుల్లో లభ్యమయ్యే ప్రకృతి పదార్ధాలను సేవించాలి. ఈ ఋతువులో మాత్రమే లభ్యమయ్యే నింబ కుసుమాన్ని(వేప పూవును) తినాలి.
ఉగాది నాటికి వేప చెట్లు ముమ్మరంగా పూతపూసి ఉంటాయి. వేప పువ్వు ఓషధి.రక్తాన్ని శుద్దిచేసి వృద్ది పరుస్తుంది.పంచాంగంలో 'నింబ కుసుమ భక్షణం'అని ఉన్నా ధర్మసింధువు మాత్రం'నింబ పత్రాశనం'అని చెబుతోంది. దీనిని బట్టి వేప ఆకులను తినాలి.
వేప పువ్వు, అప్పుడే తొడుగుతున్న మామిడి పిందెలు,చెఱకు, అరటిపండు లతో చింతపండు కలిపి పచ్చడి చేసుకొని తింటారు. ఇది కన్నడ దేశంలో కూడ పాటిస్తారు. తమిళ సోదరులు వారి సంవత్సరాది విసు పండుగ నాడు వేప పువ్వును పంచదార తో కలుపుకుని తింటారు.

శ్లో.యద్వర్షాదౌ నింబసుమం
శర్కరామ్ల ఘృతైర్యుతమ్
భక్షితం పూర్వాయామేస్యా
త్తద్వర్షం సౌఖ్యదాయకం

ఉగాది నాడు వేపపువ్వు,చక్కెర,చింతపండు, నెయ్యి కలిపిన మిశ్రమాన్ని తొలిఝాములోనే తినమని ఈ శ్లోక భావం.

7.పంచాగ శ్రవణం:
సంవత్సరాది నాడు పంచాంగానికి పూజచేసి పంచాంగ శ్రవణం చేయాలి. తిధి,వార,నక్షత్ర,యోగ,కరణాలనే పంచాంగముల సమూహమే పంచాంగం.ఆ సంవత్సరం ఏవిధంగా గడుస్తుందో తెలియజెప్పేదే ఈ పంచాంగశ్రవణం.

సంపద కోరేవాడు తిధి విషయంలోనూ...
దీర్ఘాయువును కోరేవారు వారం విషయంలోనూ.....
పాపవిముక్తిని కోరేవారు నక్షత్ర విషయంలోనూ.....
రోగాలనుండి రక్షణ కొరకు యోగ విషయంలోనూ....
పనులలో విజయం కొరకు కరణం విషయంలోనూ...
జాగ్రత్తగా ఉండాలి. వాటి గురించి తెలుసుకోవటానికి ఈ పంచాంగ శ్రవణం చెయ్యాలి.

8.ప్రపాదాన ప్రారంభం:
ఉగాది నాడు తప్పనిసరిగా ఆచరించవలసిన విద్యుక్త ధర్మం ప్రపాదానం.
ప్రప అంటే చలిపందిరి.ప్రపాదానం అంటే చలివేందర ఏర్పాటు చేసి మంచినీరు పంచడం.
దప్పిక కొన్నవారికి మంచినీటిని ఇచ్చి దాహార్తిని తీర్చాలి.తొలకరించే వరకూ ఈ ప్రపాదానాన్ని నిర్వహించాలి.ఇప్పుడు మనం నీరిచ్చినా అది మినరల్ వాటర్ కాకుంటే పుచ్చుకోరు.ఇప్పుడు కూడ చలివేందరలు పెడుతున్నారు.

9.రాజదర్శనం:
స్వప్నంలో అయినా రాజదర్శనం కావడం శుభప్రదమంటారు.
నూతన సంవత్సరాది రోజున రాజదర్శనం చేస్తే శ్రేయోదాయకం.

10.వాసంత నవరాత్రి ప్రారంభం:
ఉగాది చైత్రమాసపు తొలిరోజు. ఆనాడు కలశ స్థాపన చేసి తొమ్మిది రోజులు వసంత నవరాత్ర పూజలు చేసినట్లయితే అపమృత్యు భయం ఉండదని ధర్మసింధువు చెబుతోంది. రెడ్డిరాజులు,విజయనగర ప్రభువులు ఈ వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది.
మామిడి చెట్టు కింద మంటపమేర్పరచి
, దానిపై పూర్ణకలశాన్ని నెలకొల్పి,కస్తూరి,కర్పూరం,మొదలైన సుగంధ ద్రవ్యాలు, దవనం,మరువం మొదలైన సువాసనా పత్రాలనతో కలశను నింపి పూజాపీఠం మీద
వసంతుని,రతీ మన్మధులను,లక్ష్మీనారాయణులను,గౌరీశంకరులను,శచీపురందరులను నెలకొల్పుతారు.
దేశపు రాజు హయారూఢుడై వచ్చి ఈ దేవతలను పూజించి ప్రజలందరిపై పన్నీరు,వసంతాలను జల్లుతాడు.ఆ సందర్భంగా విద్యావినోదాలు,వినోద క్రీడలు ప్రదర్శిస్తారు.

ప్రాయకంగా ఇవీ ఉగాది నాడు చేయవలసినవి.
వీటిలో చాలవాటికి గోవింద కొట్టేశాము.ఒకటో రెండో మిగిలితే వాటిని ఈ సారి కొరోనా తుడిచేసింది.
కొరోనా పుణ్యమా అని ఇంటితెరకూ‌,ఇంటర్నెట్ కూ అతుక్కుపోయిన వారికి ఈ ఉగాది వేడుకల వివరణ.
(ఆండ్ర శేషగిరిరావు గారి పండుగలు పరమార్ధాలు నుండి సేకరణ)
_చక్రావధానుల రెడ్డప్ప ధవేజి
శార్వరి ఉగాది సందర్భంగా...

ఆనంద రహస్యం

ఆనంద రహస్యం

కొన్ని పనులు మనకు పుట్టుకతో వస్తాయి. కొన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడంలో ఆనందం ఉందన్న సంగతి మనందరికీ తెలుసు.

సీతాకోకచిలుకకు ఎగరడం మనం నేర్పక్కరలేదు. చేపకు ఈత నేర్పక్కరలేదు. ప్రకృతితో మమేకమై జీవించే జీవులకు నేర్చుకునే బాధ లేదు. అవి సహజంగా వాటికి అబ్బుతాయి.

నేర్చుకోవడమన్నది మనిషికి అవసరం. కుండలు తయారు చేసేవాడు ఎంత నైపుణ్యంగా, శ్రద్ధగా, ఏకాగ్రతతో చేస్తాడో అలా ప్రతి మనిషీ ఏదో ఒకటి నేర్చుకోవడంలో పొందే ఆనందం అనుభవైకవేద్యం. నిజానికి ఆనందాన్నే సృష్టించడం నేర్చుకోవాలి. ఆనందం బజారులో దొరికే వస్తువు కాదు. ఆనందం మనమీద మనం చిలకరించుకునే పన్నీరు కాదు. అదో సుగంధ ద్రవ్యమూ కాదు.

ఆనందం ఇతరులను ఆనందింపజేయడంలో ఉంది. తనను తాను మరచి ఇతరుల సంతోషం గురించి నిత్యం ఆలోచించడంలో నిజమైన ఆనందం ఉంది. ఇదే ఆనందసృష్టికి కీలకం.

ఆనందంగా బతకడం రాకపోతే మనిషికి సాటి జీవులతో కలిసిమెలిసి ఉండే అవకాశం దొరకదు. ఆనందంతోనే అతడు ప్రకృతికి దగ్గర కాగలడు. ఆనందంతోనే తన అంతరంగంలో జ్యోతిస్సీమలను వెలిగించుకోగలడు.
ఆనందం మనిషికి దీపశిఖ సంచారిణి.

ఆనంద రహస్యం తెలుసుకున్నవాడు నిత్యం నవ్వుతూ, చలాకీగా నవ్విస్తూ ఉంటాడు. అందులో సందేహం లేదు. ఆనందాన్ని అపార్థం చేసుకున్నవాడే విషాదం వెంట తిరుగుతాడు.

ఈ విశ్వంలో మనం సరైన సంబంధాలు కొనసాగించాలంటే ఆనందమే పరమావధిగా జీవించాలి. ఎవరు ఎంత బాగా, తొందరగా దాన్ని తమ శరీరాల్లోకి వ్యాపింపజేసుకోగలరో వాళ్లకే ఈ బతుకు ఆహ్వానం పలుకుతుంది. ఆత్మదారి దొరుకుతుంది.

తిరోగామిని చేసే విషాదం మూసిన తలుపు వంటిది. దాన్ని బాదుతూ కూర్చోకూడదు. అది తెరుచుకుందా... అడుగులేని గొయ్యి లాగా జీవితం నరకప్రాయమవుతుంది.

ఆనందం కోసం బతికే మనుషులకు భగవంతుడు తప్పక సహాయం చేస్తాడు. సత్యం రుజువు చేసి, ఎందుకు విషాదంగా ఉండకూడదో అర్జునుడికి తెలియజేసిన శ్రీకృష్ణుడిలా మనకూ సహాయపడతాడు.

ఆనందం మన జన్మహక్కు. ఆనందంగా జీవించడం కోసం బతుకు రహస్యం తెలుసుకోవాలి. లేకపోతే జీవనం మొదటి పొర చూసి, అంతా విషాదమేనన్న భ్రమలోనే ఉంటాం.

నాచును తొలగిస్తే లోపల నిర్మలమైన నీరుంటుంది. తెల్లవారిన వెంటనే సూర్యుడు కనిపించడు. కొంతసేపు ఓపిక పట్టి నిరీక్షిస్తే తూర్పు ఎర్రబారుతుంది. లోకమంతా వెలుగుతో నిండిపోతుంది.

జీవించడం అయిపోయిన తరవాతా ఆనందం కనుగొనలేని మనిషి అసంతృప్తికి చిరునామాగా మిగులుతాడు.

ఆనందంలో పుట్టి, ఆనందంలో బతికి, ఆనందంలోనే లయమవుతున్నాయి జీవులు అంటున్నాయి ఉపనిషత్తులు.

తనతోపాటు నిత్యమూ ఉండే వస్తువుపై ఎరుక కలగడమే ఆనందం. ఆ ఆనందం తనకు సహజమైనది, చైతన్యవంతమైనది. అదే సత్యం కూడా.

దాన్నే ఆధ్యాత్మికవాదులు, వేదాంతులు ‘సచ్చిదానందం’ అని పిలుస్తారు.


అది ఆకాశంలోను, నీటిలోను, అణువణువులోనూ ఉంది. మనిషిలో మహత్తరంగా ఉంది. అటు దృష్టి పెట్టడంతోనే ఊటనీరు ఊరినట్లు హృదయంలో పెల్లుబుకుతుంది.

గోదావరిపిలిచింది

గోదావరిపిలిచింది

కొత్తగా పెళ్లైన కూతుర్నీ అల్లుడినీ సత్యనారాయణస్వామి దర్శనం చేయించి, భోజనాలయ్యేసరికి ఒంటిగంటయింది. కొత్త దంపతుల్ని వెంటబెట్టుకుని కారెక్కారు దక్షిణామూర్తి దంపతులు. ఆ సమయంలో దక్షిణామూర్తికి తన పెళ్ళి జ్ఞాపకానికొచ్చింది. అప్పుడు కూడా ఇలాగే పెళ్లైన వెంటనే అన్నవరం తీసుకొచ్చి దర్శనం చేయించారు అమ్మా, నాన్న. ఆ మాటకొస్తే దక్షిణామూర్తే కాదు, గోదావరి జిల్లాలో ఏ ఇంట్లో పెళ్ళయినా కొత్త జంట మొదటగా చేసేది సత్యనారాయణస్వామి దర్శనం.

కారు నేషనల్‌ హైవే మీద పరిగెడుతోంది. చుట్టూ పచ్చదనం కమ్ముకున్న పొలాలూ, దూరంగా పచ్చదుప్పటి కప్పుకున్నట్లున్న కొండలూ గజిబిజిగా వేగంగా కనుమరుగవుతున్నాయి. దక్షిణామూర్తి కడుపు నిండింది, మనసు మాత్రం వెలితిగా ఉంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.

ఈమధ్యనే అమ్మాయి పెళ్ళి చేశాడు. అల్లుడికి అమెరికాలో ఉద్యోగం. మంచి స్థితిమంతుల కుటుంబం. భార్య తరఫు బంధువుల ద్వారా వచ్చిన సంబంధం అని, మరో ఆలోచన లేకుండా పెళ్ళి జరిపించాడు. ఒక వారంరోజుల్లో కూతురూ అల్లుడూ అమెరికా వెళ్ళిపోతారు.
తనసలు చుట్టుపక్కల మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నాడు- మంచీ చెడ్డా కళ్ళెదురుగుండా ఉంటే బావుంటుందని భార్య పట్టుపడితే కాదనలేక ఒప్పుకున్నాడు.

అప్పటికీ ఉండబట్టలేక నిశ్చితార్థమప్పుడు వియ్యంకుడితో అనేశాడు ‘‘మీకు పది తరాలకూ తరగని ఆస్తి- అబ్బాయి పదేళ్ళుగా అమెరికాలో సంపాదించుకున్నాడు. నాకూ ఒక్కగానొక్క కూతురు. నాదంతా నా కూతురికే. ఇంకా అమెరికా దేనికంటారూ! ఇక్కడే ఉండమని చెప్పకూడదా బావగారూ’’ అని.
‘ఇంత చదువూ చదివించింది ఇండియాలో పని చేయటానికా?’ అని రాచనాగు లేచినట్టు లేచింది వియ్యపురాలు. ఇంకేం చేయాలో తోచక అన్యమనస్కంగానే నిశ్చితార్థం కానిచ్చేశాడు దక్షిణామూర్తి.

1960లలో చెన్నైలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు దక్షిణామూర్తి. తల్చుకుంటే ఆ రోజుల్లోనే మంచి ఉద్యోగంలో సెటిలైపోయేవాడే. కానీ, సొంతగడ్డ మీద మమకారం, ఏం చేసినా మన వూరికే చేయాలనే సంకల్పం అతన్ని సొంత వూళ్ళొనే స్థిరపడేలా చేశాయి. స్వగ్రామంలోనే వ్యవసాయ పనిముట్లు తయారుచేసే ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్‌ ప్రారంభించాడు. తన చదువునంతా సొంత గడ్డకే ఉపయోగించాడు. తండ్రి ఇచ్చిన పదెకరాల పొలం పాతికెకరాలకు పెంచాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ తల్లో నాలుకై వూరికి పెద్దదిక్కుగా మారాడు. అందరూ పిల్లల్ని ఇంజినీర్లూ డాక్టర్లూ లేదా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా చూడాలనుకుంటే దక్షిణామూర్తి మాత్రం తన కూతుర్ని అగ్రికల్చరల్‌ బిఎస్సీ చేయించాడు. మన రైతుల కోసం ఏదైనా చేయాలని నూరిపోశాడు.

కానీ, పిల్ల పెళ్ళిచేశాక మన చేతుల్లో విషయం కాదు కదా! మనకి ఒంట్లో బాగుండకపోతే మన బిడ్డ మన దగ్గరుండదు. మనం బెంగపడితే మన కంటికి కనపడదు.
ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప దిక్కులేదా?
మన పిల్లలకి అమెరికా తప్ప దారిలేదా? మంచి జీవనం కోసం కొంత డబ్బు చాలు. కొంత డబ్బు కోసం మొత్తం జీవితాలే మారిపోవాలా?
వేల మైళ్ళు ఏళ్ళకు ఏళ్ళు దూరమైపోవాలా?

‘‘కడియంలో కాసేపు ఆపాలయ్యా’’ డ్రైవర్‌కి చెప్పి కారాపించాడు. వియ్యపురాలు ఏవో పూలమొక్కలు కొనుక్కుంటానంది మరి. కడియంలో కారాగింది. అందరూ దిగారు. అదొక పూలస్వర్గం. వియ్యపురాలు ఎప్పుడూ చూడలేదేమో తెగ సంబరపడిపోయింది. రంగురంగుల పూలూ... ఒకటా రెండా వందల రకాల పువ్వులు తివాచీ పరిచినట్టు... ఎరుపూ, నలుపూ, పసుపూ, నీలం, తెలుపు గులాబీలూ, చామంతులూ... అదొక పూల సామ్రాజ్యం.

కారు ధవళేశ్వరం బ్యారేజ్‌ సమీపించింది. ‘‘నాన్నా, కాటన్‌ మ్యూజియంకి వెళ్దాం’’ దక్షిణామూర్తి కూతురు అంది.
‘‘సాయంత్రం అయింది. చీకటిపడేలా ఉంది. ఇప్పుడు మ్యూజియం అంటావేవిఁటే! ఇంటికెళ్ళాక బోలెడు పనుంది. తర్వాత చూద్దాంలే! అయినా చూడ్డానికేవుందీ? మీ నాన్నా, నువ్వూ ఎప్పుడూ చూసేది అదే కదా’’ అంది దక్షిణామూర్తి భార్య హైమ.
‘‘అదికాదమ్మా, ఆయనకి ఒకసారి చూపిద్దామని’’ కూతురనేలోగా దక్షిణామూర్తి కారు దిగాడు. ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా దేవుడి గుడికెళ్ళినట్టు కాటన్‌ మ్యూజియానికి వెళ్ళక మానడు.

బ్రిడ్జ్‌ పక్కనే ఉన్న పదడుగుల విగ్రహం చూసి అల్లుడు కిరణ్‌ అడిగాడు- ‘‘అది ఎవరి విగ్రహం మామయ్యగారూ’’ అని.
హైదరాబాద్‌లో పెరిగి, అమెరికాలో పన్జేసేవాళ్ళకి కాటన్‌ గురించి తెలియదు కదా!
చానాళ్ళక్రితం ఒకసారి ట్రెయిన్‌లో వస్తుండగా విజయనగరం కుర్రాడు తగిలాడు. ‘ఏమయ్యా, గురజాడ అప్పారావుగారి ఇల్లు చూశావా?’ అని అడిగాడు దక్షిణామూర్తి.
దానికా అబ్బాయి... ‘అప్పారావుగారంటే ఎవరండీ?’ అని ఎదురడిగాడు.
అవును, బీటెక్‌ చదివిన ఆ కుర్రాడికి గురజాడ అప్పారావు అవసరం ఏముందీ? విజయనగరంలో పుట్టి, విజయనగరంలో పెరిగినవాడికి గురజాడ అప్పారావంటే తెలియకపోగాలేందీ, హైదరాబాద్‌లో పెరిగి అమెరికాలో సెటిలైనవాడికి కాటన్‌ తెలియకపోవడంలో తప్పేంలేదనుకున్నాడు దక్షిణామూర్తి.

మ్యూజియం ముందుభాగంలో 1840 లలో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలూ, పనిముట్లూ, వాహనాలూ ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా లండన్‌ నుంచి కాటన్‌ తెప్పించారు.
కొంచెం ముందుకువెళ్తే డెల్టాలో 10 లక్షల ఎకరాలకు నీరందించే గొప్ప ప్రాజెక్టును కేవలం 5 సంవత్సరాల్లో పూర్తిచేసిన కర్మయోగి ద గ్రేట్‌ సర్‌ సి.ఆర్ధర్‌ కాటన్.
ఆ రోజుల్లో నివాసం ఉన్న బంగ్లా! దానినే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. లోపలికెళ్ళాక ప్రాజెక్టు వివరాలూ, ఫొటోలూ, చిత్రాలూ ఒక్కొక్కటీ వివరించి చెబుతోంది కూతురు- అల్లుడికి. అల్లుడు చాలా ఆసక్తిగా వింటున్నాడు.

‘‘ఆ రోజుల్లో అంటే 160 ఏళ్ళక్రితం ఇక్కడ తినటానికి వరి లేదు. ఇంట్లో పెళ్ళయితేనో లేదంటే శుభకార్యాలప్పుడో మాత్రమే వరి అన్నం. మామూలు రోజుల్లో జొన్నసంకటే. గోదారికి వరదొస్తే అడ్డే లేదు. కరవూ కాటకాలూ, జనాభా క్షయం... ఇదే ఆనాటి డెల్టా పరిస్థితి.
అప్పుడే కాటన్‌ అనూహ్య ప్రవేశం.
ప్రాజెక్ట్‌ కట్టి, ప్రజల కన్నీళ్ళు తుడవటం నిజానికాయన పనికాదు. కేవలం ఈ ప్రాంత పన్ను వసూలు అధికారి మాత్రమే. కానీ, కష్టం నష్టం తెలుసుకున్నాడు. కంపెనీకి నచ్చజెప్పాడు. అయిదేళ్ళంటే అయిదేళ్ళలోనే అంచనా వ్యయంలోపే ఖర్చుపెట్టి రూ.4,75,572 లతో పని పూర్తిచేసి చూపించాడు’’... దక్షిణామూర్తి చెప్పుకుంటూ పోతున్నాడు.

‘‘మన వూళ్ళొ పుట్టలేదు, మన దేశమే కాదు, మన భాష కాదు, మన మనిషే కాదు... అయినా మనకోసం పదిలక్షల ఎకరాలకు నీరిచ్చి మనకింత అన్నం పెట్టిన ఆ దేవుడు చేసిన దాంట్లో వందోవంతు మన నాయకులూ మన విద్యావంతులూ ఏదో ఒక రంగంలో కృషిచేస్తే మనదేశం ఇలా ఉంటుందా బాబూ’’ అల్లుడితో అన్నాడు దక్షిణామూర్తి.

ఇంటికెళ్ళేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది. అల్లుడు ఏదో ఆలోచనలతో ఉన్నట్టున్నాడు. ‘నా మాటలు విసుగనిపించాయో ఏమో’ అనుకున్నాడు దక్షిణామూర్తి.
మర్నాడు అల్లుడూ కూతురూ బయల్దేరారు. చీరా, సారె, కానుకలూ అన్నీ సర్ది పక్కన పెట్టారు. పెళ్ళి ఫొటోలు వచ్చాయి. చూసుకున్నారు. వీడియో కూడా చూశారు. సాయంత్రమే ట్రెయిన్‌ ఎక్కటం. అనుకున్న సమయం రానే వచ్చింది. సాయంత్రం అయిదు గంటలయింది. అల్లుడూ కూతురూ రెడీ అయ్యారు. దక్షిణామూర్తికీ, భార్య హైమకీ కాళ్ళకు నమస్కారం చేశారు. హైమ కూతుర్ని పట్టుకుని బావురుమంది. వియ్యపురాలు ఓదార్చింది. ఆరున్నరకి రాజమండ్రిలో ట్రెయిన్‌ ఎక్కించారు.
‘‘వెళ్ళొస్తాం మామయ్యగారూ’’ అల్లుడు చేతిలో చెయ్యేసి నొక్కుతూ చెప్పాడు.
‘‘సరే, జాగ్రత్త! హైదరాబాద్‌లో దిగగానే ఫోన్‌ చేయండి’’ కళ్ళు చెమరుస్తుండగా గద్గదస్వరంతో అన్నాడు.
ట్రెయిన్‌ కదిలింది. చెయ్యూపి ఇంటికి బయల్దేరారు దక్షిణామూర్తి దంపతులు.

దక్షిణామూర్తి రొటీన్‌లో పడిపోయాడు... తన వ్యవసాయం, వర్క్‌షాప్‌ పనీ, వూరి పనీ. క్షణం తీరిక లేకపోవటంతో కూతురి బెంగమాట అటుంచి కూతురి గురించే మరిచిపోయాడు. మళ్ళీ వాళ్ళు తిరిగి స్వదేశం వస్తారని ఆశలేదు కాబట్టి, బాధ కూడా లేదు దక్షిణామూర్తికి.
సరిగ్గా పదిరోజుల తర్వాత ఒక ఫైన్‌ మార్నింగ్‌ హాల్లో కూర్చుని కాఫీ తాగుతున్న దక్షిణామూర్తి, భార్య హైమ పిలుపుతో లోపలికెళ్ళాడు ‘‘ఏమండీ, అమెరికా నుంచి అమ్మాయి ఫోను...’’
దక్షిణామూర్తి ఫోనందుకున్నాడు.
‘‘నాన్నా, బావున్నారా?’’
‘‘బావున్నానమ్మా. నువ్వూ, కిరణ్‌ ఎలా ఉన్నారు?’’
‘‘ఫైన్‌ నాన్నా. ఆయన నీతో ఏదో మాట్లాడతారట నాన్నా...’’
ఫోన్‌ అల్లుడికిచ్చింది.

‘‘మామయ్యగారూ బావున్నారా?’’
‘‘బావున్నాను. మీరిద్దరూ ఎలా ఉన్నారు? అమ్మాయికి అక్కడ అలవాటయిందా? ఇబ్బంది ఏమీ లేదు కదా?’’
‘‘అదేంలేదు మామయ్యా. మరి మీతో ఓ విషయం చెప్పాలి మామయ్యా’’ మాటల్లో ఏదో తటపటాయింపు.
‘‘చెప్పు కిరణ్‌, ఫర్వాలేదు’’
‘‘నేను ఇండియా వచ్చేద్దామనుకుంటున్నా మామయ్యా. రాజమండ్రిలోనే నలుగురైదుగురు ఫ్రెండ్స్‌ కలిసి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెడదామని అనుకుంటున్నాం. ఇక్కడ రిలీవ్‌ కావటానికి ఇంకో మూణ్ణెల్లు పడుతుంది. ఈలోపు అక్కడ ఏర్పాట్ల విషయంలో మీ సహాయం కావాలి...’’ కిరణ్‌ చెబుతున్నాడు.
దక్షిణామూర్తికి ఎగిరి గంతేయాలనిపించింది.
‘‘అలాగే అల్లుడూ.
మన వూరు వచ్చి, మన వూళ్ళొ బిజినెస్‌ చేసి, మనవాళ్ళకే ఉద్యోగాలిస్తామంటే అంతకంటే కావాల్సిందేముంది. నేనేం కావాలన్నా చేస్తాను’’ సంతోషంగా అన్నాడు.
‘‘థాంక్స్‌ మామయ్యా’’

‘‘సరే కానీ కిరణ్‌, పెళ్లైన నెలలోపే ఇండియా వచ్చేయాలని ఎలా అనుకున్నావు, చాలా ఆశ్చర్యంగా ఉందే’’ దక్షిణామూర్తి నవ్వుతూ అన్నాడు.
‘‘మనదేశం కాదు, మన భాషా కాదు, మన మనిషే కాదు... అయినా మన నేలకు కాటన్‌ చేసినదాంట్లో వందో వంతైనా చేయాలి కదా, మామయ్యా!.
మీరు మీ వూరికి చేసిన దాంట్లో పదో వంతైనా చేయాలి కదా!"

దక్షిణామూర్తికి ఆ మాటలు వింటుంటే ఏమీ కన్పించట్లేదు. గోడమీద ‘కాటన్‌’ ఫొటో నవ్వుతూ.
‘నీ మంచి మనసుతో మా డెల్టానే కాదు...
నా అమెరికా అల్లుణ్ణి కూడా మార్చేశావా!
కాటన్‌ దొరా... నీకు కోటి నమస్కారాలు’ అనుకున్నాడు దక్షిణామూర్తి మనసులో.

దూరంగా గోదావరి నింపాదిగా, నిర్మలంగా సాగిపోతోంది. తన బిడ్డల్ని ఎక్కడికో కాకుండా తన ఒడి చెంతే ఉండమని పిలుస్తోంది మౌనంగా.

ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలిస్తే?

ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలిస్తే?

మన పూర్వీకులు ఆయా పదార్థాల్లో వున్న పోషకాలు గురించి తెలుసు కనుకనే నువ్వులను మన ఆహారంలో భాగం చేశారు. నువ్వుల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్లూ, ప్రోటీన్లూ వంటి ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయి. వీటిల్లోని పైటేట్ అనే యాంటీ ఆక్సీడెంట్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటుంది. వీటిల్లోని పీచు జీర్ణశక్తికి తోడ్పడుతుంది. నువ్వుల్లోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

1. పాలిచ్చే తల్లులకు రోజూ కొంచెం నువ్వులు పెడితే పాలు పడతాయి. ప్రతిరోజూ ఒక నువ్వుల ఉండ తినడం వలన శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది.

2. నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది. అంతేకాకుండా మధుమేహం, బీపీ లను నివారిస్తుంది.

3. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి నువ్వులు మంచి ఔషధంలా పని చేస్తాయని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. నువ్వులనూనెను ఒంటికి మర్దనా చేసుకోవడం వలన కూడా కీళ్లనొప్పులు తగ్గుతాయి.

4. నువ్వులు ఎముకల వృద్ధికి తోడ్పడతాయి. ఆస్టియోపోరోసిస్‌ని తగ్గిస్తాయి. వీటిని తీసుకోవడం వలన చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

5. వీటిల్లో అధిక మోతాదులో ఉండే కాపర్, కీళ్లు, కండరాల నొప్పుల్నీ మంటల్ని తగ్గించడంతో పాటు శరీరమంతా ఆక్సిజన్ సరఫరాకు తోడ్పడుతుంది.

6. నువ్వుల్లోని సెసమాల్ అనే కర్బన పదార్థం, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో రేడియేషన్ కారణంగా కణాల్లోని డిఎన్ఎ దెబ్బ తినకుండా కాపాడుతుంది. ఉదయాన్నే ఒక టీ స్పూను నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇవి ఆస్త్మా రోగుల్లో శ్లేష్మాన్ని హరిస్తాయి. నిద్రలేమిని తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Wednesday, March 25, 2020

శాంతా బయోటిక్స్ అధినేత వైద్య శాస్త్రవేత్త, sri వరప్రసాద్ రెడ్డి గారు ఏమి చెబుతున్నారో వినండి.

వినండి ఓపెన్ మైండ్ తో.
శాంతా బయోటిక్స్ అధినేత వైద్య శాస్త్రవేత్త, sri వరప్రసాద్ రెడ్డి గారు ఏమి చెబుతున్నారో.
ఆయన బ్రాహ్మణుడు కాదు. కాని వారు వేదాలను quote చేస్తూ, సైన్స్ అని ఆధునికత అని మనం గొయ్యి మనం ఎలా త్రవ్వుకున్నామో చెబుతున్నారు.
పాదయో పాద్యం సమర్పయామి
హస్తయో అర్ఘ్యం సమర్పయామి
శుధ్ధ ఆచమనీయం సమర్పయామి అన్న మాటల వెనుక సైన్స్ ని వివరిస్తున్నారు.
మన ఋషులు నిజమైన సైంటిస్టులు అని చెబుతున్నారు వినండి open మైండ్ తో.

Sri వరప్రసాదరెడ్డి, Chairman, శాంతాబయోటెక్, హెపటైటిస్ వాక్సిన్ తయారు చేయడమే కాక, అమెరికాలో 1000డాలర్ల (Rs74000/-) ఖరీదుచేసే వాక్సిన్ కేవలం Rs25 రూపాయలకే, అంతర్జాతీయ నాణ్యతతో మార్కెట్లో విక్రయించిన ధీరుడు. అంతటి సశాస్త్రీయమైన మహానుభావుడి మాటల్లోనే, మన సంస్కృతి, సాంప్రదాయాలు, వాటి ఔన్నత్యం గురించి వినండి.

వారు నొక్కి వక్కాణిస్తున్నది ఏమిటంటే వ్యాక్సిన్ అన్నది రావటానికి అధమ పక్షం మూడు నుంచి ఐదేళ్లు పడుతుంది. వచ్చినా ధరల పరంగా సామాన్యుడికి అందుబాటులో ఉండకపోవచ్చు.

ఇవన్నీ కాదు మనం చేయాల్సింది మన స్వధర్మాన్ని పాటించటం, చెట్లను ప్రకృతిని గౌరవించటం, ధర్మబద్ధంగా జీవించటం, శుభ్రత నీ పాటించటం, మందు పార్టీలు అని ఎగేసుకుంటూ తిరగకపోవటం, కరక్కాయ, శొంఠి , పసుపు తదితర వంటింటి సామాగ్రిని హాయిగా వాడటం, వేప, మామిడి వంటి వృక్షాలను కాపాడుకోవటం, ఆవుపేడతో చేసిన పిడకలతో ధూపం వేసుకోవటం, జీవహింస మానటం చేద్దామంటున్నారు.

ఛాదస్తం అంటే శాస్త్రం అన్న పదానికి మరో రూపకం. చాదస్తంగా ఉండటం తప్పేమి కాదు.
ధర్మాన్ని తప్పి నడవటమే అన్నీ ఉపద్రవాలకు మూల కారణం అని చెడబుతున్నారు.
ఇవి యే సామవేదం షణ్ముఖ శర్మ గారొ, చాగంటి వారో చెబితే నవ్వి వదిలెయ్యవచ్చు.
అయ్యా చెబుతున్నాయన సాక్షాత్తు వైద్య శాస్త్రవేత్త ఇప్పటికైనా కళ్ళు తెరచుకుందాము.


మహా మృత్యుంజయ మంత్రం

ఈ రోజు ఇళ్లలో ఉన్నవారు మహా మృత్యుంజయ మంత్రం చదువుకోండి ఎలాంటి ఆపద రాకుండా ఉంటుంది.. ఆ మంత్రం చాలా శక్తివంతమైంది మేము ప్రత్యక్ష అనుభవం ద్వారా చెప్తున్నాం..

మహా మృత్యుంజయ మంత్రం జపించుట వలన కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత మరియు ఆనందం తీసుకువచ్చే శక్తి కలిగి ఉంటుంది. ఇది మనస్సు మరియు శరీరంనకు ఒక స్వస్థత బలంగా పనిచేస్తుంది. మంత్రం ఒక వ్యక్తి యొక్క పునర్ యవ్వనమునకు సహాయపడుతుంది. ఇది దీర్ఘాయువు,ఆరోగ్యం మరియు ఒక వ్యక్తి బాగా ఉండటానికి ఒక ఆధారంగా ఉంటుంది. ఈ మంత్రం ఒక వ్యక్తి చుట్టూ మొత్తం ప్రతికూల శక్తిని ఉంచుతుంది. అంతేకాక దైవ కంపనాలను సృష్టిస్తుంది. అందువలన వారు అన్ని భయాలను అధిగమించడానికి సహాయపడుతుంది.

మహా మృత్యుంజయ మంత్రం యొక్క ప్రాముఖ్యత:

మహా మృత్యుంజయ మంత్రం మహాదేవుడు శివునికి అంకితం చేయబడింది. ఋషి మార్కండేయ ద్వారా సృష్టించబడిందని చెబుతారు. ఋషి మార్కండేయచే వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది. ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నిందించబడి ప్రకాశం కోల్పోయెను. అప్పుడు మార్కండేయడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడాడు.

మహా మృత్యుంజయ మంత్రం శివుని యొక్క రెండు అంశాలను వివరిస్తుంది. ఒక అంశం ఏమిటంటే మండే మూడు కనులతో ఉన్న దేవుడుని చూపిస్తుంది. ఇంకా రెండవది మరణ భావన ఉన్న సమయంలో రక్షిస్తాడని నమ్ముతారు. కాబట్టి, యముడు మానవుల మరణం తీసుకుని మరియు ప్రకృతి సంతులనంను పునరుద్ధరించడానికి భాద్యతను తీసుకొనెను.

ఈ కారణంగా మానవులకు భూమి మీద మరణం గురించి బాధ ఎక్కువైనది. అన్ని రకాల భయాలను శాంతింపజేయడానికి మానవ జాతికి శివుడు ఈ మంత్రమును ఉపదేశించెను. ఒత్తిడి, విచారం, అనారోగ్యం లేదా ఆకస్మిక మరణ భయం ఏర్పడినప్పుడు ఈ మంత్రం యొక్క శక్తి స్వస్థత చేకూర్చి కాపాడుతుంది.

మంత్ర జపం ఎలా చేయాలి?

మంత్రం జపించటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఈ మంత్రమును 108 సార్లు ఉచ్చారణ చేయవచ్చు.ఎందుకంటే మంచి గణాంక మరియు ఆధ్యాత్మిక విలువ కలిగి ఉంటుంది. అంతేకాక 12 మరియు 9 గుణకారం మొత్తం 108 అవుతుంది. ఇక్కడ 12 రాశిచక్రాలను,9 గ్రహాలను సూచిస్తుంది. మానవులు అన్ని గ్రహాలు మరియు రాశిచక్ర చిహ్నాలకు బదులుగా జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులు తగ్గి జీవితం సులభం మరియు ప్రశాంతంగా ఉండటానికి ఈ మంత్రాన్ని జపించాలి.

రెండవది,ఒక వ్యక్తి అసహజ మరణం లేదా తీవ్రమైన వ్యాధి బారిన పడినప్పుడు పూజారి ఈశ్వరునికి పూజ ఏర్పాట్లు మరియు ఈ మంత్రాన్ని పఠించును. ఈ మంత్రం పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా జపించవచ్చు. ఇది ఏకాగ్రతను మెరుగుపరచి మంచి నిద్రకు సహాయపడుతుంది.

మంత్రం:

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

అర్థం:

"అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు,సుగంద భరితుడు అయిన శివున్ని మేము పుజిస్తున్నాము. పండిన దోసకాయ తొడిమ నుండి వేరుపడినట్లుగానే మమ్మల్ని కూడా అమరత్వం కొరకు మృత్యువు నుండి విడుపించు కాకా" అని అర్ధం.

www.facebook.com/thalapathranidhi

🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏
#మహా మృత్యుంజయ మంత్రం ( Hara Hara Mahadev ) జై బోలో శంకర్ మహారాజ్ కీ జై బోలో #మృత్యుంజయమంత్రం #హర హర మహాదేవ శంభోశంకర 🙏

దేవుణ్ణి కానీ, దేవుడిచ్చిన మనసుని కానీ నిజంగా ప్రేమించగలిగితే... అతని విలువకు పది ఇంతల విలువను

🌹 చిట్టికథ 🌹

మల్లాది వెంకట కృష్ణమూర్తి...చిన్న కధలు..నుండి

ఓ ఊళ్ళోరాముడ్ని కొలిచే వెంకట్రావు అనే భక్తుడు ఉండేవాడు.

అయితే అతను బంగారం పట్టినా మట్టయ్యేది. దాంతో దరిద్రాన్ని అనుభవించేవాడు.

ఓ రోజు అతని భార్య అతనికి ఓ సలహా ఇచ్చింది.
"రాముడ్ని మన దరిద్రం తీర్చమని ప్రార్ధించరాదూ? ఆయన మీ కోరిక తప్పక తీరుస్తాడు".

"పిచ్చిదానా! మనకేం కావాలో ఆయనకు తెలీదా? అందుకు నేనాయనకు సూచనలు ఇవ్వలేను" అని అతను ఒప్పుకోలేదు.

ఆ రాత్రి రాముడు అతనికి కలలో కనబడి చెప్పాడు.
"నీ ఇంట్లోని గూట్లో ఆరు రూపాయలు ఉన్నాయి కదా? అవి తీసుకొని రేపు సాయంత్రానికల్లా నువ్వు పెద్ద బజారుకి వెళ్ళు. అక్కడ ఆరు రూపాయలకి నీకు ఇష్టమైంది ఏది కనబడితే అది కొను. నీ దరిద్రం తీరుతుంది."

ఉదయం నిద్రలేవగానే తన భార్యకి ఆ కల గురించి చెప్పి, అతను సైకిలు మీద పెద్ద బజారుకి బయలు దేరాడు.

ఓ చోట కోలాటం కర్రలు నచ్చి దాని ధరని అడిగాడు. జత పది రూపాయలు. ఇంకొంచెం ముందుకు సాగాడు, వేలంపాట వేసే ఓ హాల్లో బొమ్మలని వేలం వేస్తున్నట్లు బయట బోర్డుని చూసి లోపలకి వెళ్ళాడు.

గోడకి ఓ పెద్ద చిత్రకారుడు గీసిన బొమ్మలు వేలాడుతున్నాయి. వాటిని కొనడానికి ఖరీదైన దుస్తుల్లో డబ్బున్న వాళ్ళు చాలామంది వచ్చారు.

అతను వెనక్కి తిరిగిపోతుంటే పిచ్చి గీతలతో గీసిన ఓ బొమ్మని చూపించి చెప్పారు నిర్వాహకులు.
"దీని పేరు శ్రీ రామచంద్రుడు. దీన్ని గీసింది దీపక్ అనే ఆరేళ్ళ కుర్రాడు. మా పాట అయిదు రూపాయలు."
చిన్న పిల్లవాడు గీసిన ఆ నైపుణ్యం లేని బొమ్మని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు.

అసహానంగా పెద్ద చిత్రకారుడి బొమ్మల వేలంపాట మొదలవడం కోసం వారంతా వేచి చూడసాగారు.

"మొదటిసారి అయిదు రూపాయలు....రెండవసారి..అయిదు రూపాయలు...."
అది రాముడి బొమ్మ అవడంతో, వెంకట్రావు గట్టిగా 'ఆరు రూపాయలు' అని అన్నాడు.

" ఆరు రూపాయలు, ఒకటోసారి..రెండోసారి..."
దాన్ని కొనడానికి అక్కడున్న వారు ఎవరూ ముందుకు రాకపోవడంతో, 'మూడోసారి' అని డబ్బు తీసుకుని ఆ బొమ్మని వేలంపాట నిర్వాహకులు వెంకట్రావుకి ఇచ్చారు.

అక్కడున్న వాళ్ళంతా ఆ బొమ్మని కొన్న వెంకట్రావు వంక వింతగా చూసారు.

"వేలంపాట మొత్తం ముగిసింది." అని చెప్పారు నిర్వాహకులు.

'అదేమిటి? ఇంకా గోడకి వేలాడే ఆ అసలు బొమ్మలని వేలం వేయాలిగా?" అడిగారు కొనడానికి వచ్చిన వాళ్ళు.

"ఈ బొమ్మలని గీసిన చిత్రకారుడు అతని వీలునామాలో ఏం రాసాడో వినండి. అకాల మృత్యువువాత పడిన తన కొడుకు గీసిన బొమ్మని మొదటగా అయిదు రూపాయలతో వేలం వేయాలని, దాన్ని ఎవరు కొంటే వారికి తను గీసిన చిత్రాలన్నిటిని ఉచితంగా ఇవ్వాలని రాసాడు.

కొడుకు గీసిన అసంపూర్ణ చిత్రానికి తన ప్రేమతో ఎంతో విలువ చేకూర్చాడు..

ఎందుకంటే తండ్రిగా తన కొడుకు గీసిన బొమ్మ మీద అతని ప్రేమ అలాంటిది.
కాబట్టి మీరు కోరుకున్న చిత్రాలని మీరు ఇతని నుండి కొనుగోలు చేయండి."

ఎవరైనా దేవుణ్ణి కానీ, దేవుడిచ్చిన మనసుని కానీ నిజంగా ప్రేమించగలిగితే... అతని విలువకు పది ఇంతల విలువను చేకూర్చడానికి, అవి మీకు సహకారం అందించడానికి ఒక తండ్రిగా మీ వెంట ఉంటాయి..ఆ ప్రేమని పొందగలిగిన వాళ్ళు నిజంగా ధన్యులు..
💥జై శ్రీరామ్💥

శ్రీ ధర్మశాస్త సేవాసమితి🐆విజయవాడ🏹7799797799

మనం సమస్యల్ని చిరునవ్వుతో ఎదుర్కోకుంటే ఏమవుతుంది? చెడు కర్మ చేస్తే దానధర్మాలు చేస్తే అది పోతుందా?

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 12 🌹
🌻 Chapter - కర్మ - 2 🌻
✍️. భావనగరి
📚. ప్రసాద్ భరద్వాజ

Q:-- మనం సమస్యల్ని చిరునవ్వుతో ఎదుర్కోకుంటే ఏమవుతుంది? చెడు కర్మ చేస్తే దానధర్మాలు చేస్తే అది పోతుందా?

A:-- దానధర్మాలు చేసినా చెడు కర్మ ఎదుర్కోవాల్సిందే. చెడు కర్మలు చేసి దానధర్మాలు చేస్తే స్వర్గానికి వెళ్తాము అనేది అబద్దం. మనం ఏ కర్మ అయినా నిస్వార్థంగా, ఫలితం ఆశించకుండా చేయాలి. అప్పుడే ఉన్నత ఆవరణ లేదా స్వర్గం అనవచ్చు, ఆ లోకానికి చేరుతాము.

మనం చెడు పనులు చేసి, దాన్ని కప్పిపుచ్చు కోవడానికి, దానధర్మాలు చేస్తే బాలన్స్ అయిపోతుంది అనుకోవడం అసత్యం. మనం ఏ భావనతో ఆ కర్మ చేసామన్నదే ముఖ్యం.

2. రెండవది:-- మనం సమస్యల్ని చిరునవ్వుతో ఎదుర్కోవాలి.

మనం అనారోగ్యంతో ఉన్నామనుకోండి, మనకు సహాయం చేయడానికి ఎవరన్నా వచ్చారనుకోండి, మనం నిరాశ, నిస్పృహ తో, ఎప్పుడూ గొణుగుతూ, విసుక్కుంటూ, ఫిర్యాదు చేస్తూ, ఉంటే అది ఇంకా వారికి కర్మ add అవుతుంది.

ఎందుకంటే సహాయం చేయడానికి వచ్చిన వారి జీవితం కూడా వారి ప్రవర్తన తో నాశనం చేస్తారు కాబట్టి, అనగా వారి ప్రశాంతత ను పోగొడతారు కాబట్టి, ఇది ఇంకా కర్మను వారికి పెంచుతుంది.

ఎవరైతే బాధను హుందాగా, చిరునవ్వు తో అనుభవిస్తారో, దైవము పట్ల గౌరవం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో, వారే కర్మ పరీక్షలో నెగ్గినట్లు.
🌹 🌹 🌹 🌹 🌹

ఓపికగా తప్పకుండ చదవండి మన సైన్యం గురించి -జై జవాన్..

ఎవరబ్బా… దీన్ని ఇంత అద్భుతంగా రాసింది !!
కొత్త జోష్ నింపింది.
చదవడం స్టాట్ చేస్తే, మీకు 100 % అదే ఫీలింగ్ కలుగుతుంది. ప్రాసీడ్.

అది తూర్పు గోదావరి జిల్లా లో ఓ పల్లెటూరు . రాత్రి తొమ్మిదయ్యింది. పాకిస్తాన్ ‘ఉరీ’ మీద చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ కొమరం వీరేంద్ర భార్య, కొడుకు ఉంటున్న చిన్న పెంకుటిల్లు. ఆర్మీ అధికార లాంఛనాలు, లోకల్ లీడర్లు , మీడియా వాళ్ళ హడావిడి అంతా ఐయిపోయి , చివరికి వాళ్లిద్దరూ, చీకటి, నిశ్శబ్దం మిగిలాయి ఆ ఇంట్లో.
‘అమ్మా’ , పిలిచాడు కొడుకు రవి . ‘ఊ చెప్పు నాన్న’ అంది రాజేశ్వరి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. భర్త జ్ఞాపకాల్లా. ‘నాన్నకి యుద్ధం అంటే ఇష్టమా అమ్మా’ అడిగాడు రవి. ‘లేదు నాన్న’ అంది బాధగా. ‘మరి మనమంటే కోపమా,’ ‘లేదమ్మా ఎందుకు ఆలా అడుగుతున్నావు’ కొంచెం విసుగ్గా అడిగింది రాజేశ్వరి. ‘మరెందుకమ్మా నాన్న మనకి దూరంగా వెళ్ళిపోయాడు ?’ రవి ఏడుస్తూ అడిగాడు.
‘అదేం లేదు నాన్నా. అప్పట్లో మీ నాన్న పెద్దగా చదువుకోలేదు. కొంచెం బలిష్టంగా ఉండేవారు. మీ తాత వెళ్ళమంటే వెళ్లారు. అంతే.’ నాన్నకి దేశమంటే చాలా ఇష్టమని ఎందుకో కొడుక్కి చెప్పాలనిపించలేదు.
‘అమ్మా’, మళ్ళీ పిలిచాడు రవి. ‘చెప్పు నాన్నా’ ఈ సారి విసుక్కి ముసుగేసింది.
‘పక్కింటి అంకుల్ ఏం చదివారమ్మా’ అడిగాడు రవి.
‘ఆయన కూడా మీ నాన్నలాగే పెద్దగా చదువుకోలేదు . ఎందుకు అడుగుతున్నావు’ ?
‘మరి పక్కింటి అంకుల్ ఈ ఊర్లోనే జాబ్ చేస్తున్నారు . పైగా వాళ్లకి పెద్ద మేడ, కారు ఉన్నాయి. వాళ్ళ అబ్బాయికి కూడా మంచి క్రికెట్ కిట్ ఉంది. ఎలా అమ్మ, ఇవన్నీ’ .
‘వాళ్ళ నాన్న మున్సిపాలిటీలో బంట్రోతు నాన్నా, రెండు మర్చిపోతే డబ్బుకు లోటు ఉండదు” పైకి చెప్పలేదు రాజేశ్వరి.
‘పడుకో నాన్న, రేపుటినుంచి స్కూల్ కి వెళ్ళాలి” అంటూ అటు తిరిగి పడుకుంది. ఆకలి వెయ్యక పోయినా, తినాలి, నిద్ర రాకపోయినా పడుకోవాలి. ఏడుపు వస్తున్నా ఆపుకోవాలి. చా వాలని ఉన్నా బతకాలి.
పొద్దున్నే టిఫిన్ పెడుతూ అంది . “రవీ, నువ్వయినా బాగా చదవాలి. ఎదురింటి అన్న లాగ ఇంజనీరింగ్ చేసి అమెరికా లో సెటిల్ అవ్వాలి . ఇప్పుడు టెన్త్ క్లాస్. ఇప్పటినుంచి బాగా చదువు . మంచి కాలేజీ లో ఇంజినీరింగ్ సీట్ రావాలి నీకు సరేనా”. ‘అలాగే అమ్మా’ అన్నాడు రవి . వాడు కూడా ఎవరిమీదో తెలియని కసితో ఉన్నాడు.
కొన్నేళ్ల తర్వాత
అది ఐఐటీ, చెన్నై ప్రాంగణం. ఇన్డోర్ ఏసీ ఆడిటోరియంలో చల్లగా గాలి వీస్తోంది. క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యిన వాళ్లకి మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్ లాంటి కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చే ఫంక్షన్. పేరెంట్స్ ని కూడా ఇన్వైట్ చేసారు. హాలు మొత్తం స్టూడెంట్స్ , పేరెంట్స్ తో నిండిపోయింది. ఫంక్షన్ మొదలైంది.ఒకరి తర్వార్త ఒకరు మాట్లాడుతున్నారు. ప్యాకేజీలు అదిరిపోయాయి. పేరెంట్స్ కళ్ళల్లో చెరువు నిండిన కరువు రైతు పొందే ఆనందం.
రెండో వరుసలో ఆఖరి సీట్లో కూర్చుని ఉంది రాజేశ్వరి. మళ్ళీ ఆమె కళ్ళల్లో నీళ్లు. ఈసారి ఆనందంతో . ఆమె పక్కన ఉన్నావిడ చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. రాజేశ్వరికేసి చూసి ఒకసారి నవ్వింది. రాజేశ్వరి కూడా చిన్నగా నవ్వింది.
అందరూ మాట్లాడిన తర్వాత కంపేర్ నెమ్మదిగా ఇంగ్లీష్ లో చెప్పింది ‘ఇప్పుడు ఈరోజు చీఫ్ గెస్ట్ మాట్లాడుతారు’ .
చీఫ్ గెస్ట్ నెమ్మదిగా మొదలుపెట్టారు.
“డియర్ ఫ్రెండ్స్, ఆరు సంవత్సరాలు మీరు పడిన కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది. అందుకు మీకు అభినందనలు. దాదాపు 25 లక్షల మంది రాసిన ఎగ్జామ్ లో మొదటి 1000 లోపు వచ్చి ఉంటారు మీరు. దేశంలోనే ది బెస్ట్ ఫాకల్టీ ద్వారా ప్రొఫెషనల్ గా ట్రైన్ అయ్యారు. ఒక ఏడాది పని చేసాక, మీలో చాలా మంది యూ.ఎస్ లో ఉంటారు. ఈ దేశానికీ మీరే అతిపెద్ద సంపద. అక్కడ వాళ్లకి పనిచేస్తూ, వాళ్ళ ఎకానమీ బాగా పటిష్ట పరుస్తూ, అక్కడే గడిపేస్తారు. వాళ్ళు ఆ డబ్బుతో ఆయుధాలు తయారుచేసి, అవి పాకిస్తాన్ కి అమ్ముతారు. వాళ్ళు అవి మనమీద దొంగదెబ్బ తీయడానికి వాడుతూ ఉంటారు.

ఇక్కడ మీరు కట్టే ఫీజు ఈ స్థలాన్ని అక్వైర్ చేయడానికి గవర్నమెంట్ ఖర్చు పెట్టిన దానికి అయ్యే వడ్ఢేలో వందోవంతు కూడా ఉండదు. సగటున ప్రభుత్వం మీ ఒక్కొక్కరి మీద దాదాపు 10 లక్షలు ఖర్చు పెడుతోంది అన్ కండీషనల్ గా. దేశంలోని ప్రజలు మొత్తం కట్టే టాక్స్ లో కొంత మీ మీద ఇన్వెస్ట్ అవుతోంది. బట్ నో రిటర్న్స్. దేశంలో అతి కొద్దీ మంది మేధావుల్లో మీరు కొందరు. పోనీ ఇక్కడ అవకాశాలు లేవా అంటే . అసలు అవేంటో తెలుసుకొనే టైం కూడా మీకు లేదు, వీళ్ళు ఇవ్వరు.
(కంపెనీ ప్రతినిధులూ, యూనివర్సిటీ మానేజ్మెంట్ కొంచెం ఎంబేరాస్సింగ్ గా చూస్తున్నారు గెస్ట్ కేసి). సారీ, చెప్పి, తిరిగి మొదలుపెట్టాడు. ఇస్రో, DRDO , R & D , BRO, సివిల్ సర్వీసెస్, స్టార్ట్ అప్స్ , ఎంట్రప్రెన్యూర్షిప్, IT , ఇలా ఎన్నో ప్రొడక్టివ్ దారులు మీ గురుంచి తెరిచి ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేయండి. మీ మీద, మీ పిల్లల మీద, ఈగ కూడా వాలకుండా మా ప్రాణాలు అడ్డేసి కాపాడుతాం. మీరు హాయిగా లగ్జరీ గా బ్రతికేంత జీతాలు పెరిగాయి ఇప్పడు. దేశానికీ మీలాంటి మేధావుల అవసరం చాలా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మీలాంటి మేధావులంతా ఆన్ లైన్ కిరాణాల్లోనూ, వర్చ్యువల్ గేమింగ్ కంపనీల్లోనూ జాయిన్ అవ్వటం కొంచెం బాధగా ఉంటోంది. నిజమే, మనకున్న తెలివికి, మనం పడే కష్టానికి సరిపడా సంపాదించాలి అనుకోవటం న్యాయమే. కానీ, “ x+n = x” అనే థియరీ ఒకటి చెప్తాను. మనం హాయిగా బ్రతకటానికి ‘x ‘ అమౌంట్ ఆవరసరం అనుకుంటే, అంతకు మించిన సంపాదన (n ) మనకి ఏ రకంగానూ ఉపయోగపడదు (0) . ఉదాహరణకి ఒక ఇల్లు, ఒక కారు, ఒక ac , ఆ తర్వాత ? పెరుగన్నం తిన్న తర్వాత బిర్యానీ ఎంత బావున్నా మళ్ళీ తినలేంకదా.
పోనీ మన తర్వాత తరాలకి కూడా దాచాలనుకొంటే, ఈ మధ్య ఓ తెలుగు సినిమాలో చెప్పినట్టు, మన పిల్లలు మంచి వాళ్లయితే వాళ్లకి మన డబ్బు అవసరంలేదు. అలా కాదనుకొంటే మనం ఎంతిచ్చినా వాళ్ళు నిలబెట్టలేరు. నేను పైన చెప్పిన ఏ సర్వీసులో జాయిన్ అయ్యినా మీరు, మీ ఫామిలీ హాయిగా బ్రతకడానికి సరిపోయే జీతం వస్తోంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడున్న కంపెనీ ప్రతినిధులందరికి నా క్షమాపణలు. అయినా, దీన్నికూడా వాళ్లకున్న ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ లో ఒక భాగం అనుకుంటే సరిపోయే. జై హింద్.” అంటూ ముగించారు.
అప్పుడు స్టేజి మీద ఉన్న కంపేర్ మైక్ అందుకుని, “ఐ అం సారీ, చీఫ్ గెస్ట్ ని ఇంట్రడ్యూస్ చెయ్యడం మర్చిపోయాను. హి ఐస్ కమాండర్ కొమరం రవీంద్ర, సన్ అఫ్ లేట్ కొమరం వీరేంద్ర, పరమ్ వీర్ చక్ర. కమాండర్ రవీంద్ర ఇక్కడే బి.టెక్ చేసి, ఇండియన్ ఆర్మీ లో ఇంజనీరింగ్ వింగ్స్ లో ఒకటయిన మద్రాస్ sappers గ్రూప్ లో కంబాట్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఈ మధ్య కాశ్మీర్ లోని ‘ఉరీ’ వద్ద జరిగిన యుద్ధంలో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి వీరందించిన సహకారంతో ఎటువంటి ప్రాణహాని లేకుండా, శత్రువులని తుదముట్టించగలిగింది మన సైన్యం. వీరి సేవలకు ప్రభుత్వం ‘థియేటర్ హానర్’ అవార్డు కూడా ఇచ్చింది.
హల్ అంతా ఒక్కసారి చప్పట్లతో మార్మోగిపోయింది.
రాజేశ్వరి కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు. ఈసారి తృప్తితో.
కారు నెమ్మదిగా వెళ్తోంది. ‘సారీ అమ్మా, నేను అంతగా ఎమోషనల్ అవ్వకుండా ఉండవలసింది. నన్నుగుర్తు పెట్టుకొని ఇన్వైట్ చేసినందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టున్నాను.” అన్నాడు రవి.
రాజేశ్వరి చిన్నగా నవ్వి రవి చేతి మీద చేయి వేసింది. “నిజానికి నేను నీకు సారీ చెప్పాలి రా. మీ నాన్న పోయిన మొదట్లో నాకు ఎదో తెలియని ఉక్రోషం ఉండేది ఈ దేశం మీద. ఆ కసితోనే నిన్ను ఇంజనీరింగ్ చదవమని కంపెల్ చేశాను. ఎలాగైనా ఈ దేశం వదిలి పోవాలని. కానీ, ఆలా చేస్తే మీ నాన్న త్యాగానికి, గవర్నమెంట్ మన మీద చూపించిన కంపాషన్ కి విలువ లేకుండా పోతుంది. అందరిలాగా నువ్వూ ప్యాకేజీ చూడకుండా నా మాటకి విలువిచ్చినందుకు థాంక్స్.” అంది రాజేశ్వరి.
మళ్ళీ ఆమె కళ్ళల్లో నీళ్లు. బాధ, ఆనందం, తృప్తి, ఇవేవీ కాదు. అంతకు మించి. దేశభక్తితో
‘ఉరీ’కి నా భర్తని పంపఁగా
పోరుకి తానర్పితమవ్వగా
కరిగిన సింధూరం సాక్షిగా
మరిగిన నా రుధిరం కోరగా
తరిమెను నా కొమరుణ్ణి
ఎదురుగ పోరాడమని
అవసరమై కోరగా దేశం
ఇంకోసారమ్మగ మారనా
మరో వీరుణ్ణి అంకితమివ్వనా
ఎప్పుడో డైరీ లో రాసుకున్న వాక్యాలు గుర్తొచ్చాయి ఆమెకి.కారు స్థిరమైన వేగంతో ముందుకి కదుల్తోంది. దేశం ప్రగతిలాగా….
(ఇది వాట్సప్ మెసేజ్… ఆ రచయితకు ధన్యవాదాలు, పేరు తెలిస్తే చెప్పండి, ముందస్తుగా కృతజ్ఞతలు))

శివుడి వద్ద నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం ఎందుకు? పరమార్థం ఏమిటి?

💐💐శివుడి వద్ద నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం ఎందుకు? పరమార్థం ఏమిటి?💐💐💐

ఆది పరాశక్తి , జగజ్జనని అయిన పార్వతీదేవికి భర్త అయ్యి శివుడు అర్ధనారీశ్వరుడైనాడు. గణపతి, అయ్యప్ప, కుమారస్వామి పుత్రులు గల శివుని దగ్గర ఉండే సన్నిహిత చిహ్నాలు, వాటికి ఈశ్వరుడికి గల సంబంధం గురించి కొంత తెలుసుకుందాం.

నంది (ఎద్దు):- శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్త మిత్రులలో ఒకటి. ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల కనబడుతుంది.

శివ భక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమని నందీశ్వరుని చెవులవద్ద భాదలను నివారించమని స్వామివారికి చెప్పు అని గుసగుసగా చెప్పుకుంటారు.

త్రిశూలము :- శంకరుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలము. శివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. త్రిశూలములో ఉండే మూడు వాడి అయిన మొనలు ఉంటాయి అవి ఏమిటనగా కోరిక, చర్య , జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి.

నెలవంక చంద్రుడు :- శివుడిని తరచుగా తన 'జటా' ఒక అర్ధ చంద్రాకార చంద్రుని కళా రూపాలతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ది చెందటం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందుమత క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది.

నీలిరంగుకంఠం :- శివునికి మరొక పేరు నీలకంఠుడు అని. శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగడం జరిగింది. అప్పుడు పార్వతిదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన కంఠం నీలం రంగులోకి మారినది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నాడు.

రుద్రాక్ష :- శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారమును ధరిస్తాడు. అంతే కాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటుంది. 'రుద్రాక్ష' అనే పదము 'రుద్ర' ( శివ యొక్క మరొక పేరు ) మరియు 'అక్ష్' అంటే కన్నీళ్లు నుండి వచ్చింది. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులోకి వెళ్లినాయి.

పాము :- శివుడు ఆయన మెడ చుట్టూ మూడు సార్లు చుట్ట బడిన ఒక పామును ధరిస్తారు. పాము మూడు చుట్టలకు అర్ధం .భూత,వర్తమాన,భవిష్యత్ కాలాలను సూచిస్తాయి.నాగదేవతను హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా తెలుస్తుంది.

మూడో కన్ను:- శివుని చిహ్నాలలో ఒకటిగా మూడో కన్నును చెప్పవచ్చు. ఆయన నుదుటిపైన మధ్య భాగంలో మూడో కన్ను ఉంటుంది. అయన చాలా కోపాని గురిఅయినప్పుడు చెడును నివారించాలనుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది.అప్పటి నుండి మూడో కన్ను జ్ఞానం మరియు సర్వ వ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది.

డమరుకం :- శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు.

జటా :- అట్టకట్టుకొని పీచులాగా ఉన్న జుట్టు.సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది.

కానీ శివ విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది.శివుని అట్టకట్టుకొని జుట్టు లేదా 'జటా' అందం పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టు చూపిస్తుంది.

శివుడిని భక్తితో కోలిస్తే తనపై ఒక్క చెంబేడు నీళ్ళను మంచి మనస్సుతో పోసి పూజిస్తే భక్తుల కోరికలను కరునించే బోళాశంకరుడు.శివపంచాక్షరీ ఆపదకాలంలో శివ భక్తులకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది.
పూర్తి సేకరణ..

భక్తి భావం

ఓం నమశ్శివాయ🙏

భక్తి భావం🙏
వ్రతాలు చేస్తే వరాలు లభిస్తాయని ,
పూజలు చేస్తే ఫలితాలు ఉంటాయని ,
అర్చనలు ,అభిషేకాలూ చేస్తే దేవుడు కరుణిస్తాడని అందరూ అనుకోవడం సహజం .
కష్టాలూ ,రోగాలు ,బాధలు కలిగినప్పుడు ,
నేనేమి తప్పులూ ,అన్యాయము చేశానని
దేవుడు మాకీ దుర్గతి కలుగచేసాడని ,
చాలామంది ఆవేశంగా మాట్లాడతారు .
అయితే హృదయమునిండా భక్తిభావంతొ
చేసే చిన్న పాటి సేవ అయినా భగవంతుడు కరుణిస్తాడు .
పుక్కిటి నొటితో శివలింగాన్ని శుభ్రం చేసి ,
కాలి చెప్పులతో వాడిన పువ్వులను తొలగించి ,
భక్తిని చాటుకున్న బోయవాడైన తిన్నడిని
నీలకంఠుడు కరుణించలేదా ?
భక్తితో శబరి ఎంగిలి పండ్లను శ్రీరామచంద్రునికి సమర్పించి ఆ వైకుంఠవాసుని అవతార కృపకు పాత్రులు కాలేదా ?
పట్టెడు అటుకులను ఆప్తమిత్రుడైన శ్రీకృష్ణునికి అర్పించి అఖండమైన సంపదలు పొంది కుచేలుడు భాగ్యవంతుడు కాలేదా ?
భగవంతునికి ఎంత అడంబరంగా ,
ఆర్భాటంతో ఖర్చుపెట్టి పూజలు ,నైవేద్యాలు
అలంకరణలు ,కానుకలు సమర్పించి కార్యక్రమములు చేశారన్నది ముఖ్యం కాదు .
మీ పూజలో ,సేవలో భగవంతుని పై ఏమేరకు
ఎంతసేపు భక్తి భావంతో మనసు లగ్నం చేసి
పూజలు చేశారన్నది ముఖ్యం .
స్వార్ధచింతన లేని నిష్కళంక భక్తి కి
భగవంతుడు దాసుడైపోతాడు .
భక్తుని హృదయమందిరంలో
సదా కొలువై ఉంటాడు ఆ పరమాత్ముడు🙏

శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏

గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? పూజించడం వల్ల లాభమేంటి?

గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? పూజించడం వల్ల లాభమేంటి?

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.

గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.

అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.

అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.

ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

ప్రసాదాల లోగుట్టు medical benefits of hindu prasadam

ప్రసాదాల లోగుట్టు

medical benfits of hindu prasadam

ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .

జీర్ణశక్తిని పెంచే ' కబెట్టె పొంగళి
" బియ్యం , పెసరపొప్పు , జీలకర్ర , ఇంగువ , నెయ్యి , అల్లం , శొంఠిపొడి , ఉప్పు , కరివేపాకు , జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని , జీర్ణశక్తిని పెంచు తుంది . మంచి ఆకలిని కలిగిస్తుంది .

జీర్ణకోశ వ్యాధుల నివారిణి ' పులిహోర
' బియ్యం , చింతపండుపులుసు , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి ఉప్పు , ఇంగువ , పసుపు , బెల్లం , నూనె , వేరుశన గలు , జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది . జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది .

మేధస్సును పెంచే దద్ధోజనం
' బియ్యం , పెరుగు , ఇంగువ , కొత్తిమీర , అల్లం , - మిర్చి కొంఠి పొడిల మిశ్ర మంతో తయారు చేసే ఈ - ప్రసాదం మేధస్సును పెంచుతుంది . శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది .

వార్ధక్యాన్ని నిలువరించే ' కదంబ '
బియ్యం , చింతపండు , ఎండుమిర్చి పోపులు , ఇంగువ , నూనె , ఉప్పు , కందిపప్పు పసుపు , బెల్లం , నెయ్యి , బెండకాయ , వంకాయ , గుమ్మడికాయ , చిక్కుళ్లు , బీన్స్ , దోసకాయ , క్యారెట్ , టమోటా , చిలకడదుంపల మిశ్రమంలో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం . సప్తధాతువుల పోషణ చేస్తుంది . వార్ధక్యాన్ని నిలువరిస్తుంది . అన్ని వయస్సుల వారికి మంచి పౌష్టికాహారం .

శ్లేష్మాన్ని తగ్గించే ' పూర్ణాలు "
పచ్చిశనగపప్పు , బెల్లం , కొబ్బరి చురుము , యాలకుల మిశ్ర మంతో ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది . శ్లేష్మాన్ని తగ్గిస్తుంది . మంచి బలవర్ధకం .

రోగనిరోధకశక్తిని పెంచే చలిమిడి
' బియ్యం పిండి , బెల్లం , యాలుకలు , నెయ్యి , పచ్చకర్పూరం , జీడిపప్పు , ఎండుకొబ్బరికో రుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం

కొబ్బరి పాల పాయసం
కొబ్బరి పాలు పచ్చ కర్పూరం యాలకుల పొడి బాదంపప్పు కుంకుమపువ్వు పంచదార ఆవు పాలు కలకండ పొడి తో చేసే ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్రేష్మాన్ని హరిస్తుంది.

మనలో సంతోషము ఎందుకు మాయమవుతుంది?

🌹. మనలో సంతోషము ఎందుకు మాయమవుతుంది? 🌹
…బహ్మాకుమారీస్‌
📚. ప్రసాద్ భరద్వాజ

భగవంతుని స్తృతి అనగా యోగము వలన సంతోషము కలుగునట్లు మనం చేసిన పొరపాట్ల వలన సంతోషం మాయమవుతుంది.

ఎప్పుడైనా పనికిరాని ఆలోచనలు మనసులోకి వస్తే వెంటనే వాటిని పెద్దల ముందుగానీ, సర్వశక్తిమంతుడైన శివ పరమాత్మ ముందుగానీ ఉంచి వారి నుండి అవసరమైన సూచనలు పొంది మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. ఇటువంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుని హృదయ భారాన్ని తగ్గించుకోవాలి.

గుర్తుంచుకోవలసిన మరో విషయమేమిటంటే, గడిచిన దాని గురించే ఆలోచిస్తూ, బాధ పడుతూ, దురదృష్టవశాత్తూ నేను ఇలా చేసాను. నా ఆధ్యాత్మిక స్థితి బాగాలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు.

గడిచిన దాని గురించి ఒక గుణపాఠం నేర్చుకుని, ఇక మీదట మళ్ళీ ఇటువంటి పొరపాట్లు జరగకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగాలి. అపచారం చేసాను అన్న మనోభారంలో నిరంతరం ఉండుట వలననే మన సహజత్వాన్ని కోల్పోతుంటాము.

ఒక లోటును సరిదిద్దుకోవడానికి దాని గురించే ఆలోచించడం కాకుండా స్వయం యొక్క ఉన్నత స్థితి గురించిన ఆలోచన అవసరం. బుద్ధిని ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకుంటూ, కలవరంలో కొట్టుకుపోకుండా , ఏ వికారీ ఆలోచన ఆటంకంగా రాకుండా చూసుకోవాలి.

ఇటువంటి అనిశ్చితమైన సంఘటనల నుండి జాగ్రత్తగా ఉండాలంటే దివ్య స్పృతి అనే జ్యోతికి ఎప్పుడూ దివ్య జ్ఞానము అనే నూనెను అందిస్తూ ఉండాలి.
🌹 🌹 🌹 🌹 🌹

ముస్లింలను ద్వేషిస్తున్నానా? కాదు జిహాదీలను ద్వేషిస్తున్నాను.

నాకు చాలా మంది ముస్లిం స్నేహితులు ఉన్నారు.
నేను చదివిన చోట నా పాఠశాలలో చాలా మంది ముస్లింలు ఉన్నారు.
నేను పనిచేస్తున్న చోట చాలా మంది ముస్లిం సహోద్యోగులు ఉన్నారు
నేను మా ముస్లిం పొరుగువారు కూడా కొనే దుకాణాల నుండి వస్తువులను కొంటాను.
నేను ముస్లింలు కూడా నివసించే ప్రదేశంలో నివసిస్తున్నాను.

"మేము వీధుల్లో ప్రార్థనలు చేస్తాము ...."
నేను చెప్పాను, రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ హక్కును ఇచ్చింది.

మేక అయినా, ఆవు అయినా మేము మాంసం తింటామని చెప్పారు….
నేను ఎటువంటి సమస్య లేదని చెప్పాను, రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఏదైనా తినడానికి మరియు త్రాగడానికి హక్కును ఇచ్చింది.

ఇప్పుడు నేను చెప్పాను, మన దేశంలో ఒక సాధారణ సివిల్ కోడ్ ఉండాలి ..
"ఇది ఇస్లాంకు వ్యతిరేకం" అని అన్నారు

"బహుభార్యాత్వాన్ని ఆపాలి" అన్నాను
"ఇది ఇస్లాంకు వ్యతిరేకం" అని అన్నారు

"జనాభా నియంత్రణకు ఒక చట్టం ఉండాలి" అని అన్నాను.
'ఇది కూడా ఇస్లాంకు వ్యతిరేకం' అని ఆయన అన్నారు.

"విడాకులు కోర్టు మాత్రమే ఇవ్వాలి" అని అన్నాను.
"ఇది ఖురాన్ కు అవమానం" అని ఆయన అన్నారు.

"చట్టవిరుద్ధంగా వలస వచ్చిన బంగ్లాదేశీయులందరినీ తిరిగి పంపించాలి" అని అన్నాను.
"వారు వారి ముస్లిం సోదరులు" అని ఆయన అన్నారు

నేను, "రోహింగ్యాలను తిరిగి వారి దేశానికి పంపండి"
వారు కూడా వారి సోదరులు అని ఆయన అన్నారు

నేను, "రాముని ఆలయాన్ని అయోధ్య రాముని అసలు జన్మస్థలంలో నిర్మించాలి" అని అన్నాను.
"అయోధ్యలో కాకుండా ఎక్కడైనా నిర్మించండి. బాబ్రీ మసీదు అక్కడ నిర్మించబడుతుంది" అని అన్నారు.

"కాశ్మీరీ పండితులు తమ ఇళ్లను పొందాలి" అన్నాను.
"కాశ్మీర్‌కు స్వాతంత్ర్యం ఇవ్వండి" అని అన్నారు

"మదర్సాలు మూసివేయబడాలి, భారతదేశంలో ప్రతి ఒక్కరూ సమాన విద్యను పొందాలి" అని అన్నాను.
"ఇది ఇస్లాంను అవమానించడం" అని ఆయన అన్నారు.

"బెంగాల్‌లో హిందువులకు కొన్ని సమస్యలు ఉన్నాయి" అని అన్నాను.
పశ్చిమ బెంగాల్‌లో దీదీ చాలా అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు.

"ఉగ్రవాదులందరినీ కాల్చి చంపాలి" అని అన్నాను.
"వారికి మెరుగుపరచడానికి అవకాశం ఇవ్వండి" అని అన్నారు

"మా 3 దేవాలయాల అయోధ్య, మధుర, కాశీలను తిరిగి ఇవ్వండి" అన్నాను.
"ఎలా ఇవ్వాలి ... అవి మా మసీదులు?"

గుర్తుంచుకోండి,
ముస్లింలందరూ ఒకటే. వారి జనాభా తక్కువగా ఉన్న చోట, వారు మీ సోదరులు. కానీ వారి సంఖ్య ఎక్కువగా ఉన్న చోట .. మీరు అక్కడ ఏమీ ఆలోచించలేరు.

తక్కువ ఉన్న చోట, వారు మీ నుండి ఉపాధి పొందుతారు.
వారు సంఖ్య తక్కువగా ఉన్న చోట, వారు మృదువుగా మరియు ప్రశాంతంగా ఉంటారు.
వారి ఉనికి ఎక్కువగా ఉన్న చోట, ప్రతిరోజూ హిందువులు హింసించబడుతున్నారు.

నేను ముస్లింలను ద్వేషిస్తున్నానా?
అది కానే కాదు

కానీ
నేను జిహాదీలను ద్వేషిస్తున్నాను.
నన్ను కాఫీర్ అని భావించే వారిని నేను ద్వేషిస్తున్నాను.
నా దేశంలో షరియా చట్టం కోరుకునే వారిని నేను ద్వేషిస్తున్నాను .
గజ్వా-ఎ-హింద్ని స్థాపించాలనుకునే వారిని నేను ద్వేషిస్తున్నాను
మా సాయుధ దళాలపై రాళ్ళు రువ్వే వారిని నేను ద్వేషిస్తున్నాను
_నా దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వారిని నేను ద్వేషిస్తున్నాను,

@ జై హింద్ @

శబ్ద చికిత్స "శీతలాదేవి" స్త్రోత్రం

శబ్ద చికిత్స "శీతలాదేవి" స్త్రోత్రం

సమస్త అంటురోగాలను, వైరస్ వ్యాధుల ప్రభావము పడకుండా శ్రీ శీతలాదేవి కాపాడుతుందని శాస్త్రోక్తి. ఆవిడ అనుగ్రహానికై రూపాన్ని ధారణ చేసి, ... ప్రార్థన చేసుకోవాలి.

అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః - అనుష్టుప్ ఛన్దః - శీతలా దేవలా దేవతా - లక్ష్మీర్బీజం - భవానీశక్తిః -సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః

ఈశ్వర ఉవాచ:

వన్దేహం శీతలాం దేవీం రాసభస్థాం దిగమ్బరామ్!
మార్జనీకలశోపేతాం శూర్పాలంకృత మస్తకామ్!!

వన్దేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహామ్!
యామాసాద్య నివర్తేత విస్ఫోటక భయం మహత్!!

శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహ పీడితః!
విస్ఫోటక భయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి!!

యస్త్వా ముదకమధ్యేతు ధృత్వా పూజయతే నరః!
విస్ఫోటకం భయం ఘోరం గృహే తస్య న జాయతే!!

శీతలే జ్వర దగ్ధస్య పూతిగంధయుతస్యచ!
ప్రనష్టచక్షుషః పుంస్ః త్వామాహుర్జీవనౌషధమ్!!

శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్!
విస్ఫోటక విదీర్ణానాం త్వమేకామృతవర్షిణీ!!

గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణామ్!
త్వదనుధ్యాన మాత్రేణ శీతలే యాన్తి సంక్షయమ్!!

నమన్త్రోనౌషధం తస్య పాపరోగస్య విద్యతే!
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్!!

మృణాల తంతు సదృశీం నాభి హృన్మధ్య సంశ్రితామ్!
యస్త్వాం సంచిత యేద్దేవి తస్య మృత్యుర్నజాయతే!!

అష్టకం శీతలాదేవ్యా యోనరః ప్రపఠేత్సదా!
విస్ఫోటక భయం ఘోరం గృహేతస్య నజాయతే!!

శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తి సమన్వితైః!
ఉపసర్గ వినాశాయ పరం స్వస్త్యయనం మహత్!!

శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా!
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమోనమః!!

రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః!
శీతలా వాహనశ్చైవ దూర్వాకంద నికృంతనః!!

ఏతాని ఖరనామాని శీతలాగ్రేతు యఃపఠేత్!
తస్యగేహే శిశూనాం చ శీతలా రుజ్ఞజాయతే!!

శీతలాష్టక మేవేదం నదేయం యస్యకస్యచిత్!
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధా భక్తియుతాయవై!!

🌷ఫలస్తుతి🌷

విశ్వచక్రంలోనున్న దేవతాశక్తుల్ని దివ్య మంత్ర,, నామ స్తోత్రాదులతో స్పందింపజేసి అభీష్టసిద్ధుల్ని సాధించే ’శబ్దచికిత్సా’ విధానాలను మన ఋషులు ఏర్పాటు చేశారు ఋషులు సూక్ష్మ జగత్తులో ఉన్న శక్తి ఆకృతులను మంత్రద్రష్టలు దర్శించి, వాటిద్వారా మనం తగిన ప్రయోజనాలను పొందాలని వివిధ స్తోత్రాలనందించారు.

జ్వరాది వ్యాధుల్ని పోగొట్టే ’శీతలాదేవి’
గాడిద, చేట, చీపురు, కలశం - ఈపరికరాలు రోగకారక క్రిమినాశన, జ్వరహరణ శక్తులకు సంకేతాలు.
స్ఫోటకము, ఉష్ణతలు, తీవ్రజ్వరాలు నశించడానికి, పిల్లలకు వచ్చే ఆటలమ్మవంటి ’మారీ’ వేదనలు తొలగడానికి, శీతలాదేవిని తలంచి ఈ స్తోత్రం చదివితే చాలు - తప్పక ఆ వ్యాధులు నివారణ అవుతాయని శాస్త్రోక్తి. "శీతలా" నామస్మరణమే జ్వరతాపాలను పోగొడుతుందని పురాణవచనం.

🌷శ్రీ మాత్రే నమః🌷
🌹 🌹 🌹 🌹 🌹

పంచారామాల పుట్టుక

పంచారామాల పుట్టుక

శ్రీనాధుడు (క్రీ||శ|| 14 నుండి 15వ శతాబ్డము) రచించిన బీమేశ్వర పురాణములో ఈ పంచారామముల ఉత్పత్తిని గురించి ఒక కథ ఇలా ఉన్నది. క్షీరసాగర మధనం లో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపము ధరించి సురాసురులకు పంచుచుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేత్రత్వములో తీవ్రమైన జపతపములను ఆచరించగా శివుడు మెచ్చి, వారికి వరములిచ్చాడు. కొత్తగాసంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహదేవుని శరణువేడుకున్నారు. దేవతల మోర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిధ్దికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలొ త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కుచెదరలేదు. దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛెదించి ఐదు వేరు వేరు ప్రదేసములందు ప్రతిష్టించుటకు గాను పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ట చెసిన ఈ ఐదు ప్రదేశములే పంచారమములుగా ప్రసిద్దికెక్కినవి.

స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తొంది.

హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొదుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపొవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ , పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.

శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః
‍ ‍ ‍ ‍ ‍ ‍ - స్కాందము

తారకాసురుడు నేల కూలడంతో అతనియందున్న ఆత్మలింగం ఐదు ముక్కలైంది. దేవతలు ఆ ఐదింటిని ఐదు చొట్ల ప్రతిష్టించారు. అవే పంచారామ క్షేత్రాలు.

దక్షారామము (ద్రాక్షారామము, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు
కుమారారామము (సామర్లకోట, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు
క్షీరారామము (పాలకోల్లు, ప||గో|| జిల్లా) - రామలింగేశ్వరుడు
భీమారామము (భీమవరం, ప||గో|| జిల్లా) - సోమేశ్వరుడు
అమరారామము (అమరావతి, గుంటూరు జి||) - అమరేశ్వరుడు

ఇవన్నీ దేవతలు ప్రతిష్టించినవేనని స్థలపురాణం చెపుతొంది.

అమరారామము

గుంటూరు జిల్లాలో గుంటూరు కు 35 కి.మీ. దూరంలో అమరావతి క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు అమరేశ్వరుడు, అమ్మ వారు బాలచాముండి. క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. ఇక్కడ స్పటిక లింగం ఎత్తు 16 అడుగులు. శివలింగం చుట్టూ రెండు అంతస్తులుంటాయి. అభిషేకాదులు రెండవ అంతస్తులో చేస్తారు. అమరావతి ఆలయం మూడు ప్రాకారాలతో నిర్మితమైంది. మొదటి ప్రాకారం లో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్ధివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోలలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపుర సుందరీదేవి ఆలయాలు, కల్యాణ మండపం, కృష్ణానదికి తోవ ఉన్నాయి. రెండో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు, నవగ్రహ మంటపం, యజ్ఞశాలలు ఉన్నాయి. మూడోప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు సూర్యుడి ఆలయాలు ఉన్నాయి.

దక్షారామము

తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో దక్షారామ క్షేత్రం ఉంది.
ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు
శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం దక్షారామము. దక్షప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది . తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలకున్నారు. మార్గమధ్యమంలో తుల్యఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋుషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రధమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋుషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణితో చేర్చానాని అది సప్తగోదావరి గా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు.
నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు.
భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండో అంతస్తులో ఉందు. అభిషేకాదులు పై అంతస్తులో లింగ భాగానికి చేస్తారు.
ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ. 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్థంభాలపై, గోడలపై 800 పైగా శాసనాలు ఉన్నాయి.

సోమారామము

పశ్చిమ గోదావరి భీమవరం (గునిపూడి) లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు (కోటీశ్వరుడు) అమ్మ వారు రాజరాజేశ్వరి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావస్య రోజున గోధుము వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణా దేవి అమ్మవాు పెఅంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.

కుమారభీమారామము

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపం లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి.

ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడినది. ఈయనే దక్షరామ దేవాలయాన్నీ నిర్మించినది. అందుకె ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడ ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై షుమారు 922 వరకు సాగింది.

కుమరారామ శ్రీ భీమేశ్వరస్వామి వేంచెసి ఉన్న భీమవరం గ్రామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో ఒక భాగం (అక్షాంశము 17 02' ఉ, రేఖాంశము 82 12' తూ). ఇది పూర్వం ఛాళుక్య భీమవరంగా ప్రసిధ్ధి చెందినట్టు భీమేస్వరాలయంలోని శిలాశాసనాలనుబట్టి తెలుస్తోంది.

క్షీరారామము

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఈ క్షేత్రం ఉన్నది. ఇచ్చట స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్టించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధుడు. ఆలయ విశేషం తొమ్మిది అంతస్తులతో20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్దగోపురం నుండి శివలింగంపే పడతాయి.

శ్రీ కృష్ణపరమాత్మ కు 16,000 భార్యలు ఎందుకు ఉన్నారు?

శ్రీ కృష్ణపరమాత్మ కు 16,000 భార్యలు ఎందుకు ఉన్నారు?

శ్రీ కృష్ణపరమాత్మ పదహారు వేల మంది(16000) గొపికలతొ క్రీడించాడని అంటారు. ఆయన్ను మంచి వాడు కాదు అన్న విధంగా చూపిస్తారు. అసలు సంగతి తెలియాలి అంటే ముందు కొన్ని తెలుసుకొవాలి.

రామావతారంలొ రాముడు మానవుడిగానే జీవించాడు. అది త్రేతాయుగం నాటి మాట. ద్వాపరయుగంలొ కృష్ణావతరం పరిపూర్ణావతారం. అంటే కృష్ణుడు పుట్టడమే నాలుగు భుజములతొ శంకు చక్ర గదా పద్మములతొ పుట్టి సాధారణ మానవుడిగా మారాడు. రాముడు ఏనాడు మాయలు చెయ్యలేదు. కాని కృష్ణుడిగా మాత్రం ఎన్నొ లీలలు చేసాడు. ఇది రెండు అవతారాలా మధ్య ఉన్న తేడా.

రాముడి వనవాస కాలంలొ ఆయన్ను చూసి మహర్షులు సైతం మొహించారట."పుంసాం మొహన రూపాయ" అని కదా. ఆ సుందరమైన రూపాన్ని చూసిన మహర్షులు ఒక్కసారి కౌగిలించుకోవలని ఉంది రామా అన్నారట. అందుకు రాముడు రాబొయే యుగంలొ ఆ అవకాశం ఇస్తానని చెప్పాడు. ద్వాపరయుగంలొ వారు అందరూ గొపికలుగా వేషాలు ధరించారు.కృష్ణుడ్ని పతిగా పొందాలని, ఆయన్ను చేరాలని "కాత్యాయని వ్రతం" ఆచరించి అమ్మవారిని వరం అడిగారు.

ఇక్కడ కాత్యాయని అంటే అర్దం ఏంటొ తెలుసా?ఒక్కప్పుడు ఒక ఆయన మహర్షులందరిని మార్గమేది మార్గమేది అని అడిగేవారు.మార్గం దేనికి అంటే పరమపదసోపానానికి,శాశ్వతమైన చోటుకి,పరమేశ్వరునిలొ ఐక్యానికి. అలా తపించి తపించి ఆయన తాపసి అయ్యారు.జ్ఞానం పొంది జ్ఞాని అయ్యారు. మౌనం వహించి ముని అయ్యారు.తర్వాత మహర్షి అయ్యారు. అప్పుడు ఆయన భక్తికి మెచ్చి జగన్మాత ఆయనకు కూతురుగా "కాత్యాయని"గా అవతరించింది.

ఆయనకు సత్ మార్గాన్ని చుపించింది. అటువంటి కాత్యాయని దేవిని వరు ఏమి కొరుకున్నారు అంటే కృష్ణపరమాత్మను చేరాలి, ఆయనలొ రమించాలి, బ్రహ్మానందాన్ని పొందాలి అని.వరంపొంది ఎవరిని చేరితే ఇక మళ్ళీ జన్మ ఉండదొ అటువంటి స్వామిని వారు పొందారు. కృష్ణుడు ఆత్మస్వరూపుడు.

వారికి కృష్ణపరమాత్మకు శారీరిక సంబంధం ఉన్నట్టు ఎక్కడైన ఉందా చెప్పండి.కృష్ణుడు దేవుడన్న సంగతి అందరికి తెలుసు,కాబట్టి దేవున్ని చేరారు తప్ప ఒక వ్యక్తిని కాదు.

ఇంకొక విషయం ఏమిటి అంటే కృష్ణుడు ఎప్పుడు ఏవరిని మొహించాలేదు. అందరు వాసుదేవుడ్నే మోహించారు. కృష్ణుడు గొపికల సహవాసం ఎప్పుడైన కొరుకున్నాడ? కాదు. గొపికలే కృష్ణతత్వంలొ ఆనందించి ఆయన కొసం తపించారు.పరమాత్మ దగ్గరకు చేరారు.

కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి.మహాయోగి.ఆయనే పరమాత్మ.కృష్ణపరమాత్మ పరబ్రహ్మం.మనము ఆత్మస్వరూపం. అదే కదా భగవద్గీత సారాంశం. మనం శరీర పరంగా చూసినప్పుడు మనం స్త్రీ పురుష బేధం ఉంటుంది.కాని ఆత్మ స్త్రీ స్వరూపంగా ఇక్కడ భావించబడింది. నది సముద్రంలొ కల్సిన విధంగా ఆత్మ ఆ సత్చిదానంద ఘనపరమాత్మలొ కలవాలి.ఆ పరమాత్మ పురుష రూపంగా భావించబడింది మన భాగవతంలొ. అంటే ఈ లొకంలొ అన్నిటిని భరించే భర్త ఒక్క పరమేశ్వరుడే. మిగితా జీవరాశి అంతా ఆయనచే భరించబడుతొంది. అదే తత్వజ్ఞానం.కృష్ణ దర్శనంతొ గొపికలకు కూడా అదే తత్వజ్ఞానం బొధపడింది.

అందుకే వారు అన్నిటిని సన్యసించి కృష్ణుడ్నే అంతటా చూసినవారై ఆయనే భర్తని తెలుసుకొని వేరె అన్నిటిని వదిలి ఆ ఆత్మస్వరూపాన్ని తమలొనే ఉందని గ్రహించి,వారిలొ ఉన్న ఆ పరమాత్మలో తమను తాము ఐక్యం చేసుకొని బ్రహ్మజ్ఞానన్ని పొంది బ్రహ్మానందాన్ని పొందారు.అల వారు ఆ అత్మస్వరూపమైన ఆ తత్వంలొనే రమించారు.శాశ్వతమైన ఆనందాన్ని పొందారు అని ఉందే కాని ఎక్కడా వారు తాత్కాలికమైన సుఖాలను కృష్ణుడి ద్వారా పొందారని ఎక్కడైన ఉందా చెప్పండి?

మన శరీరం సప్తధాతువులతో,నవరంధ్రాలతొ ఉందా లేదా?అటువంటి ఈ శరీరాన్ని అశాశ్వతమని భావించి ఆ శరీరాన్ని అదుపులొకి తెచ్చుకొవడానికి ఎంతొ వ్యయ ప్రయాసలకు లొను అవ్వాలి.మొత్తం ఆ నవరంధ్రాలు, సప్తధాతువులు కలిపి మొత్తం పదహారు.సంస్కృతంలొ వేలను సహస్రం అంటారు.సహస్రం అంటే అనంతం అని అర్దం.ఈ శరీరాన్ని అదుపులొకి తెచ్చుకొవడమే అనంతమని ఆ పదహారు వాటిని అదుపులొకి తెచ్చుకొని అ పరమాత్మునిలొ ఆత్మను లయం చేయడం అని అర్దం.అటువంటి అనంతమైన, అతి కష్టమైన ఈ మార్గన్ని అనుసరించి ఆయన్ను చేరుకున్న వారు ఆ గొపికలు అని అర్దం.అంతే కాని కృష్ణ్ది మీద లేనిపొని అబాంఢాలు వేయ్యొద్దు.

అలాగే పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ భూతాలు, మనస్సు కలిపి పదహారు(16).అనంతమైన వాటి మాయాను జయించడం కష్టం.అటువంటి వాటిని జయించి ఆత్మస్వరూపమైన ఆ పరమాత్మను ఎరుకలొకి తెచ్చుకొని వాటిని జయించినవారు ఆయన్ను తమలొనే దర్శించినవరికి ఆత్మానందాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పైన చెప్పిన ఆ పదహారు మనలని మాయలొ ఉంచే ముఖ్యసాధనాలు.వాటి మాయ చేష్టలు అనేకం.మనం వాటిలొ బ్రతికి మాయకు వశులమవుతున్నాం. అటువంటి ఆ పదహారు కూడా ఆ పరమాత్ముడ్ని ఏమి చేయలేక ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటాయి అని.

సహస్రశీరుష పురుషః సహస్ర్రక్షర్ సహస్ర పాత్ అని పురుష సూక్త వచనం. ఆయనకు వెయ్యి తలలు, కన్నులు, పాదాలు అని అర్దం. అంటే ఆయన అనంతుడు. ఇందాక చెప్పినట్టుగా సహస్రం అంటే అనంతం అని.అనేక విధాలుగా ఉన్న ఆ పరమాత్మ మాయను దాటి ఆయన్ను చేరారు అని అర్దం.
కృష్ణుడు ప్రతి గొపికకు కనిపించాడని భాగవతం చెప్పింది. అంటే పదహారువేల కృష్ణ పరమాత్మలు ఉన్నారా? పదహారు వేలు ఏంటి అంతటా వ్యాపించి ఉన్న ప్రాణశక్తి ఆ పరమేశ్వర తత్వం.ఆ ప్రాణశక్తిని తెలుసుకొని రమించారు గొపికలు.
చివిరిగా ఒకమాట. కృష్ణుడితొ ఏవరికి దేహసంబంధం లేదు.ఆయనతొ ఉన్నది ఆత్మ సంబంధం మాత్రమే.