Thursday, October 16, 2025

 [10/16, 13:26] +91 88867 01236: *# ఇస్తేనే... వస్తుంది!...*

☘️ఇవ్వడంలో ఉన్న ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుంది. కోట్ల సంపద ఉన్నా అవసరమైన వారికి చిరుసాయం చేయడానికి చేతులు రాని వాళ్లను చూస్తుంటాం. కొంచెమే ఉన్నా అందరితో పంచుకునేవాళ్లనూ చూస్తూనే ఉంటాం. అవసరమైన వారికి చేసే చిన్నపాటి సాయం కూడా ఎంతో విలువైంది. అందుకున్నవారి కళ్లలో కనిపించే కృతజ్ఞత కలిగించే ఆనందం అనుభవించిన వారికే తెలుస్తుంది. మంచి పని చేసిన వారిని హృదయ పూర్వకంగా నిజాయతీగా మెచ్చుకోవడం, సాయప వారిపట్ల కృతజ్ఞత కనబరచడం కూడా ఇవ్వడంలో భాగమే. స్వచ్ఛంద, ధార్మిక సంస్థల్లో సేవ చేయడమూ సమాజానికి తిరిగి ఇవ్వడమే.

☘️దయగల హృదయమే దైవమందిరమని పెద్దలు అంటుంటారు. ఇవ్వడానికి నేనేమైనా కోటీశ్వరుణ్నా? అన్న ప్రశ్నను చాలామంది నుంచి వింటాం.

*☘️సాటివారికి సాయం చేయడానికి డబ్బే అవసరం లేదు. మన దగ్గర ఉండే జ్ఞానం, నైపుణ్యం, మాట, పలుకుబడి, సమయం, వనరులు, దయ వంటివి ఉపయోగించి ఏదైనా చేయవచ్చు. కనీసం బాధలో ఉన్నవారిని ఓదార్చినా చాలు, వాళ్లు ధైర్యాన్ని కూడదీసుకుని జీవనపోరాటానికి సిద్ధమవుతారు. ఎలాంటి ఖర్చూ లేకుండా ఇవ్వదగినవి మన దగ్గర ఎన్నో ఉంటాయి. అవి గుర్తించి అవసరమైన వారికి ఇవ్వాలి. మనకు ఎన్ని ఉన్నా ఆత్మానందం లేకుంటే జీవితానికి అర్ధమే ఉండదు. దేన్నయినా పంచుకున్నప్పుడే లభిస్తుంది. అది ఇతరులకు ఏదైనా మేలు చేసినప్పుడు డోపమీన్, సెరెటోనిన్, ఆక్సిటోసిన్ వంటి సానుకూల రసాయనాలు విడుదలవుతాయని, అవి రోగనిరోధకశక్తిని మెరుగు పరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.*

☘️దూరప్రయాణం చేస్తున్న ఒక కుటుంబం పెద్ద  హోటల్లో దిగింది. రాత్రి వేళ పసిబిడ్డకు పాలు అవసరమయ్యాయి. హోటల్ వాళ్లను అడిగితే గ్లాసుకు వంద రూపాయలు వసూలుచేశారు. అదే కుటుంబం ప్రయాణం కొనసాగిస్తూ మరో రోజు రోడ్డుపక్కన టీకొట్టు దగ్గర కారు ఆపింది. పాపాయికి పాలు కావాలని కోరింది. ఆ హోటల్ యజమాని సీసా నిండుగా పాలుపోసి ఇచ్చాడు.

☘️డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు. పసిపిల్ల పాలకు కూడా డబ్బు తీసుకునేంత చెడ్డవాణ్ని కాదన్నాడు. వీళ్లలో నిజమైన ఐశ్వర్యవంతుడంటే కచ్చితంగా టీ షాపు యజమానే. 'పరుల కోసం పాటుపడని న బతుకు దేనికని? మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని' అన్న కవి సినారె మాటలు గుర్తొస్తాయి ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు. ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుందనేది ప్రకృతి నియమం. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు.

☘️కాస్త ముందు, వెనుక కావచ్చు కానీ అది రెట్టింపై
రావడం పక్కా అలాగని సాయం చేసేవారు
ప్రతిఫలాన్ని ఆశించకూడదు. లోకకల్యాణానికి
ఉపయోగపడే పనిచేస్తే ప్రకృతి కచ్చితంగా
సహకరిస్తుంది. చెట్లు, నదులు, జంతువులు... అన్నీ
నిస్వార్ధంగా మానవాళికి సేవ చేస్తున్నాయి.
అటువంటప్పుడు వివేకవంతుడైన మనిషి వాటికన్నా ఎన్ని రెట్లు చేయాలి?🙏🙏*
[10/16, 15:38] +91 98666 19196: "ప్రకృతి మనకు ఇచ్చిన అందమైన వరాలు, వాటిని కాపాడడం మన బాధ్యత.

 మనిషి, వివేకవంతుడైన జీవిగా, ప్రకృతిని గౌరవించి, దానిని కాపాడడం ద్వారా, చెట్లు, నదులు, జంతువుల కంటే..*ఎన్నో రెట్లు ఎక్కువ సేవ చేయాలి.* 🌿🌎

No comments:

Post a Comment