🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(246వ రోజు):--
ఆసుపత్రిలో జరిపిన పరీక్షలు డాక్టర్ దాస్ అనుమానాన్ని ధృవీక రించాయి. స్వామీజీ గుండెపై ఒత్తిడి పెరిగిన సూచనలు కనిపించాయి. మంచాలేవీ ఖాళీగా లేకపోవటం చేత వరండాలోనే మంచంవేసి ఆయనను పడుకోబెట్టారు. ఆయన ను సౌఖ్యంగా ఉంచటంకోసం మిషన్ సభ్యులు మంచం, పరుపు, తెరలు వంటివాటన్నిటినీ తెచ్చారు. గురువుగారికి సేవచేయటంకోసం దేశమంతటినుంచీ వైద్యనిపుణులు వచ్చారు. ఆయన పరిస్థితి మెరుగు పడటంకోసం అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
మూడురోజుల తర్వాత కొంచెం గుణంకనిపించింది. అదృష్టవశాత్తూ రెండురోజుల తర్వాత ఆసుపత్రిలో గది కూడా దొరికింది. మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు మినహాయిస్తే, నెలరోజుల్లో స్వామీజీ కోలుకున్నారు. మే పదవ తేదీన బెంగుళూరు ప్రయా ణానికి ఆయనను విడుదల చేశారు. కొత్తగా నిర్మించిన చిన్మయ ఆసుపత్రి వద్ద భక్తులందరూ ఆయనకోసం పో గయ్యారు. ఆ ఆసుపత్రికి ఆయనే మొదటి రోగి. తన సహజమైన హాస్య ధోరణిలో అందరినీ పలకరించారు. "బయటే ఉండి వైద్యంతీసుకొనే విభాగాన్ని మైసూరులో మొదలు పెట్టాను ; ఇక్కడేమో ఇక్కడే ఉండి చికిత్సపొందే విభాగానికి ప్రారంభో త్సవం చేస్తున్నాను."
పాకశాల అప్పటికింకా సిద్ధం కాకపోవటంచేత, ఉత్తరకాశీ నుంచి వచ్చిన శివరాం అనేఅతను స్వామీ జీకి తగినవిధంగా వంటచేసిపెట్టే బాధ్యత చేపట్టాడు. అతడే తర్వాత స్వామీజీకి స్వంత అనుచరుడిగా పనిచేశాడు. బెంగుళూరు ఆస్పత్రి స్థానిక మిషన్ సభ్యుల సేవాకార్య క్రమాలకు రంగభూమిగా ఉద్దేశించ బడింది. ఎందరో మిషన్ సభ్యుల విరాళాలతో ప్రారంభించబడిన ఈ పథకానికి నాయకత్వం వహించిన వారు రామకృష్ణారెడ్డి, పురుషోత్తం దంపతులు తప్ప, మొదట అనుకు న్నట్లుగా అక్కడ పనిచేయడానికి చిన్మయమిషన్ కు చెందిన ఆరోగ్య నిపుణులెవరూ లేకపోవటంచేత నిర్వహణఖర్చులు అధికమై, ఆస్పత్రి ప్రారంభించడం ఆలస్యమైంది.
1956లో మొదటియజ్ఞం జరిగి నప్పటినుంచీ, మిషన్ కార్యక్రమా లకు బెంగుళూర్ నుంచి ఊతని చ్చింది. ప్రతిసంవత్సరం జరిగే యజ్ఞా లకు పదివేలమంది పైగా హాజరయ్యే వారు. అందుచేత స్వామీజీ ఆస్పత్రి లో ఉన్నంతకాలం ఆయనను చూడ టానికి రోజూ చాలామంది వచ్చే వారు. చిన్నచిన్న ఇబ్బందులున్నా విసుక్కోకుండా ఆయన సరదాగానే ఉండేవారు. ఒకరు ఆయన మంచం మీద నల్లినిచూచి, తీసిపారేశారు. "నా అదృష్టం ఇలాఉంది. విష్ణు మూర్తి పాలసముద్రంలో ఆదిశేషుని మీద శయనిస్తుంటే, నాకు దక్కినది మాత్రం నల్లులమంచమే" అని వ్యాఖ్యానించారాయన, నవ్వుతూ.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment