Thursday, October 16, 2025

*అరుణాచల👏*
*నమో రమణ*

*'అమృత హస్తము, బంగారపు చెయ్యి' కలిగినవారు అని మహర్షిని చిన్నప్పుడు ఊరి ప్రజలు సంబోధిస్తూ ఉండేవారు అంట. ఊరి ప్రజలు ఏదైనా శుభకార్యాలను మహర్షి చేతిమీద చేయించే వారంట.*

*సాధారణంగా రమణాశ్రమం వచ్చినప్పటినుండి మా ఇంటిలోని పరిస్థితుల కారణంగా కొంతకాలం ఉండి వెళ్లిపోదామని అనుకుంటూ ఉండేవాడిని. దాదాపు నాలుగు ఐదు సంవత్సరాల వరకు కూడా ఇలా ఆలోచన సాగుతూ ఉండేది.  కానీ కొందరు సాధువులు 'రోజు రమణాశ్రమానికి వెళ్లి అమృతం తాగి వస్తున్నావు కదా! ఇంటికి ఇంకేమి వెళతావు!' అని అనేవారు.*

*మహర్షి జీవించి ఉన్నప్పుడు, మహర్షి స్వయముగా అందరికంటే ముందు నిద్రలేచి, వంటకు సిద్ధమయ్యేవారు. ఆ తర్వాత మిగతావారు వంటకు వచ్చేవారు. 'మహర్షి యొక్క దివ్య హస్తము అనుగ్రహ రూపంలో ఆ పదార్థాలలో చేరడం మూలంగా ఆ పదార్థాలకు ప్రత్యేక రుచి అనేది సహజంగా ఉంటుంది' అని అనేక భక్తుల ద్వారా మనం వింటూ ఉంటాం.* 

*దీనికి సాధువుల సాంగత్యంలో వివరణ :*

*నడిచే దేవుడైన కంచి పరమాచార్యులవారు 'పంచభూతాల(భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం) చేత అబాధితమైన(బాధింపపడని) బ్రహ్మము తిరువణ్ణామలైలో రమణుల రూపంలో తిష్ట వేసుకొని కూర్చుని ఉన్నది' అని అనేవారు కదా!*

    *🙏🌷శుభ భూయత్ 🌷🙏*
🍁🍁🍁 🪷🕉️🪷 🍁🍁🍁

No comments:

Post a Comment