Thursday, October 16, 2025

 🦚జ్ఞాన ప్రసూనాలు🚩
16/10/25

1)  సర్వాన్ని శివమయంగా చూడడం వల్ల నీవు శివుడివి కాలేవు.
నీవు శివుడివి అయితే సర్వం
శివమయం అవుతుంది.

2)చూచేవాడి కన్నా దైవం మరొకటి లేదు.
చూడబడేదాని కన్నా మాయ మరొకటి లేదు.

3) నీకు నీవు ఒక్క అడుగు ఎడంగా ఉండగలిగితే చాలు. అదే ఆధ్యాత్మికంలో నీవు పొందే గొప్ప మేలు.

4) జాగ్రత్ వ్యవహారాన్ని సుషుప్తిలోకి తీసుకెళితే అది స్వప్నము.
సుషుప్తిలో ఉండే ఆనందాన్ని జాగ్రత్తులోకి తీసుకువస్తే అది సహజ సమాధి.

5)ఈ నేనుకే కొలతలు ఆ "నేను"కు ఏ కొలతలూ లేవు

6)"ఎలా" అన్న దానికి మాత్రమే సైన్సు సమాధానం చెప్పగలదు. "ఎందుకు ?" అంటే సమాధానం చెప్పలేదు.

No comments:

Post a Comment