జార్చుకున్నాక
రత్నం అని తెలిసినా ఏమీ చేయలేము..
చేతిలో ఉన్న ప్పుడే
దానివిలువ తెలుసుకోవాలి....
పాదాల ముందు
పరి బ్రమించేప్పుడు
బంధాల విలువ
తెలుసుకోలేకుంటే..
కాలంలోకి ఒరిగాక
శాశ్వతంగా తెలుసుకోలేము....
ఎవరైనా జీవించినపుడు వారి
వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేకుంటే..
జ్ఞాపకాల్లో ఎంత వగచినా
ఫలితం...
శూన్యమే.........!!
No comments:
Post a Comment