Monday, March 9, 2020

Q:- వ్యక్తికి తాను గర్వంగా వున్నానని ఎలా తెలుస్తుంది?

A.గర్వానికి సంకేతాలు.
1)దేవుని ఉనికిని నమ్మడు.
2)తాను చేసిన తప్పుల్ని అంగీకరించడు.
3)వేరొకరు మనల్ని తప్పని,వారిది రైట్ అంటే భరించలేరు.
4)సత్యాన్నుంచి పారిపోతారు.
5)ఇతరుల కంటే అధికులమంటారు.
6)వారికే ప్రతిభ ఉందని అనుకుంటారు.
7)వారికి ఎవరు సాటి లేరనుకుంటారు.
8)అన్ని వారికే తెలుసు అనుకుంటారు.
9)వారి అభిప్రాయం సరైనదనుకుంటారు.
10)ఇతరులను తక్కువగా చూస్తూ వారు తక్కువ వారు అనుకుంటారు.
11)ఎవరినైనా బాధపెట్టిన లెక్కపెట్టరు.
12)వారికి జరిగే మంచి అంతటికీ కారణం వారే అనుకుంటారు.
13)వారికంటే వేరొకరు గొప్ప అని ఏ విషయంలో ఒప్పుకోరు.
14)అందరికి లోపాలుంటాయి,అందరూ తప్పులు చేస్తారు,అని అర్థం చేసుకోరు.
15)వారు వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు.
16)అసహనంతో మొండిగా,విసుగ్గా వుంటారు.
17)మార్పును ప్రతిఘటిస్తారు.
18)ఎవరైనా వారితో ఏకీభవించక పోతే తట్టుకోలేరు.
ఇలాంటివి ఏమైనా మనలో ఉన్నాయా అని మనం అనుక్షణం check చేసుకుంటూ ఉండాలి.ఇలాంటివి ఉంటే మనలో గర్వం ఉన్నట్లే.

No comments:

Post a Comment