Wednesday, March 25, 2020

శాంతా బయోటిక్స్ అధినేత వైద్య శాస్త్రవేత్త, sri వరప్రసాద్ రెడ్డి గారు ఏమి చెబుతున్నారో వినండి.

వినండి ఓపెన్ మైండ్ తో.
శాంతా బయోటిక్స్ అధినేత వైద్య శాస్త్రవేత్త, sri వరప్రసాద్ రెడ్డి గారు ఏమి చెబుతున్నారో.
ఆయన బ్రాహ్మణుడు కాదు. కాని వారు వేదాలను quote చేస్తూ, సైన్స్ అని ఆధునికత అని మనం గొయ్యి మనం ఎలా త్రవ్వుకున్నామో చెబుతున్నారు.
పాదయో పాద్యం సమర్పయామి
హస్తయో అర్ఘ్యం సమర్పయామి
శుధ్ధ ఆచమనీయం సమర్పయామి అన్న మాటల వెనుక సైన్స్ ని వివరిస్తున్నారు.
మన ఋషులు నిజమైన సైంటిస్టులు అని చెబుతున్నారు వినండి open మైండ్ తో.

Sri వరప్రసాదరెడ్డి, Chairman, శాంతాబయోటెక్, హెపటైటిస్ వాక్సిన్ తయారు చేయడమే కాక, అమెరికాలో 1000డాలర్ల (Rs74000/-) ఖరీదుచేసే వాక్సిన్ కేవలం Rs25 రూపాయలకే, అంతర్జాతీయ నాణ్యతతో మార్కెట్లో విక్రయించిన ధీరుడు. అంతటి సశాస్త్రీయమైన మహానుభావుడి మాటల్లోనే, మన సంస్కృతి, సాంప్రదాయాలు, వాటి ఔన్నత్యం గురించి వినండి.

వారు నొక్కి వక్కాణిస్తున్నది ఏమిటంటే వ్యాక్సిన్ అన్నది రావటానికి అధమ పక్షం మూడు నుంచి ఐదేళ్లు పడుతుంది. వచ్చినా ధరల పరంగా సామాన్యుడికి అందుబాటులో ఉండకపోవచ్చు.

ఇవన్నీ కాదు మనం చేయాల్సింది మన స్వధర్మాన్ని పాటించటం, చెట్లను ప్రకృతిని గౌరవించటం, ధర్మబద్ధంగా జీవించటం, శుభ్రత నీ పాటించటం, మందు పార్టీలు అని ఎగేసుకుంటూ తిరగకపోవటం, కరక్కాయ, శొంఠి , పసుపు తదితర వంటింటి సామాగ్రిని హాయిగా వాడటం, వేప, మామిడి వంటి వృక్షాలను కాపాడుకోవటం, ఆవుపేడతో చేసిన పిడకలతో ధూపం వేసుకోవటం, జీవహింస మానటం చేద్దామంటున్నారు.

ఛాదస్తం అంటే శాస్త్రం అన్న పదానికి మరో రూపకం. చాదస్తంగా ఉండటం తప్పేమి కాదు.
ధర్మాన్ని తప్పి నడవటమే అన్నీ ఉపద్రవాలకు మూల కారణం అని చెడబుతున్నారు.
ఇవి యే సామవేదం షణ్ముఖ శర్మ గారొ, చాగంటి వారో చెబితే నవ్వి వదిలెయ్యవచ్చు.
అయ్యా చెబుతున్నాయన సాక్షాత్తు వైద్య శాస్త్రవేత్త ఇప్పటికైనా కళ్ళు తెరచుకుందాము.


No comments:

Post a Comment