ఎవరబ్బా… దీన్ని ఇంత అద్భుతంగా రాసింది !!
కొత్త జోష్ నింపింది.
చదవడం స్టాట్ చేస్తే, మీకు 100 % అదే ఫీలింగ్ కలుగుతుంది. ప్రాసీడ్.
అది తూర్పు గోదావరి జిల్లా లో ఓ పల్లెటూరు . రాత్రి తొమ్మిదయ్యింది. పాకిస్తాన్ ‘ఉరీ’ మీద చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ కొమరం వీరేంద్ర భార్య, కొడుకు ఉంటున్న చిన్న పెంకుటిల్లు. ఆర్మీ అధికార లాంఛనాలు, లోకల్ లీడర్లు , మీడియా వాళ్ళ హడావిడి అంతా ఐయిపోయి , చివరికి వాళ్లిద్దరూ, చీకటి, నిశ్శబ్దం మిగిలాయి ఆ ఇంట్లో.
‘అమ్మా’ , పిలిచాడు కొడుకు రవి . ‘ఊ చెప్పు నాన్న’ అంది రాజేశ్వరి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. భర్త జ్ఞాపకాల్లా. ‘నాన్నకి యుద్ధం అంటే ఇష్టమా అమ్మా’ అడిగాడు రవి. ‘లేదు నాన్న’ అంది బాధగా. ‘మరి మనమంటే కోపమా,’ ‘లేదమ్మా ఎందుకు ఆలా అడుగుతున్నావు’ కొంచెం విసుగ్గా అడిగింది రాజేశ్వరి. ‘మరెందుకమ్మా నాన్న మనకి దూరంగా వెళ్ళిపోయాడు ?’ రవి ఏడుస్తూ అడిగాడు.
‘అదేం లేదు నాన్నా. అప్పట్లో మీ నాన్న పెద్దగా చదువుకోలేదు. కొంచెం బలిష్టంగా ఉండేవారు. మీ తాత వెళ్ళమంటే వెళ్లారు. అంతే.’ నాన్నకి దేశమంటే చాలా ఇష్టమని ఎందుకో కొడుక్కి చెప్పాలనిపించలేదు.
‘అమ్మా’, మళ్ళీ పిలిచాడు రవి. ‘చెప్పు నాన్నా’ ఈ సారి విసుక్కి ముసుగేసింది.
‘పక్కింటి అంకుల్ ఏం చదివారమ్మా’ అడిగాడు రవి.
‘ఆయన కూడా మీ నాన్నలాగే పెద్దగా చదువుకోలేదు . ఎందుకు అడుగుతున్నావు’ ?
‘మరి పక్కింటి అంకుల్ ఈ ఊర్లోనే జాబ్ చేస్తున్నారు . పైగా వాళ్లకి పెద్ద మేడ, కారు ఉన్నాయి. వాళ్ళ అబ్బాయికి కూడా మంచి క్రికెట్ కిట్ ఉంది. ఎలా అమ్మ, ఇవన్నీ’ .
‘వాళ్ళ నాన్న మున్సిపాలిటీలో బంట్రోతు నాన్నా, రెండు మర్చిపోతే డబ్బుకు లోటు ఉండదు” పైకి చెప్పలేదు రాజేశ్వరి.
‘పడుకో నాన్న, రేపుటినుంచి స్కూల్ కి వెళ్ళాలి” అంటూ అటు తిరిగి పడుకుంది. ఆకలి వెయ్యక పోయినా, తినాలి, నిద్ర రాకపోయినా పడుకోవాలి. ఏడుపు వస్తున్నా ఆపుకోవాలి. చా వాలని ఉన్నా బతకాలి.
పొద్దున్నే టిఫిన్ పెడుతూ అంది . “రవీ, నువ్వయినా బాగా చదవాలి. ఎదురింటి అన్న లాగ ఇంజనీరింగ్ చేసి అమెరికా లో సెటిల్ అవ్వాలి . ఇప్పుడు టెన్త్ క్లాస్. ఇప్పటినుంచి బాగా చదువు . మంచి కాలేజీ లో ఇంజినీరింగ్ సీట్ రావాలి నీకు సరేనా”. ‘అలాగే అమ్మా’ అన్నాడు రవి . వాడు కూడా ఎవరిమీదో తెలియని కసితో ఉన్నాడు.
కొన్నేళ్ల తర్వాత
అది ఐఐటీ, చెన్నై ప్రాంగణం. ఇన్డోర్ ఏసీ ఆడిటోరియంలో చల్లగా గాలి వీస్తోంది. క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యిన వాళ్లకి మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్ లాంటి కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చే ఫంక్షన్. పేరెంట్స్ ని కూడా ఇన్వైట్ చేసారు. హాలు మొత్తం స్టూడెంట్స్ , పేరెంట్స్ తో నిండిపోయింది. ఫంక్షన్ మొదలైంది.ఒకరి తర్వార్త ఒకరు మాట్లాడుతున్నారు. ప్యాకేజీలు అదిరిపోయాయి. పేరెంట్స్ కళ్ళల్లో చెరువు నిండిన కరువు రైతు పొందే ఆనందం.
రెండో వరుసలో ఆఖరి సీట్లో కూర్చుని ఉంది రాజేశ్వరి. మళ్ళీ ఆమె కళ్ళల్లో నీళ్లు. ఈసారి ఆనందంతో . ఆమె పక్కన ఉన్నావిడ చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. రాజేశ్వరికేసి చూసి ఒకసారి నవ్వింది. రాజేశ్వరి కూడా చిన్నగా నవ్వింది.
అందరూ మాట్లాడిన తర్వాత కంపేర్ నెమ్మదిగా ఇంగ్లీష్ లో చెప్పింది ‘ఇప్పుడు ఈరోజు చీఫ్ గెస్ట్ మాట్లాడుతారు’ .
చీఫ్ గెస్ట్ నెమ్మదిగా మొదలుపెట్టారు.
“డియర్ ఫ్రెండ్స్, ఆరు సంవత్సరాలు మీరు పడిన కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది. అందుకు మీకు అభినందనలు. దాదాపు 25 లక్షల మంది రాసిన ఎగ్జామ్ లో మొదటి 1000 లోపు వచ్చి ఉంటారు మీరు. దేశంలోనే ది బెస్ట్ ఫాకల్టీ ద్వారా ప్రొఫెషనల్ గా ట్రైన్ అయ్యారు. ఒక ఏడాది పని చేసాక, మీలో చాలా మంది యూ.ఎస్ లో ఉంటారు. ఈ దేశానికీ మీరే అతిపెద్ద సంపద. అక్కడ వాళ్లకి పనిచేస్తూ, వాళ్ళ ఎకానమీ బాగా పటిష్ట పరుస్తూ, అక్కడే గడిపేస్తారు. వాళ్ళు ఆ డబ్బుతో ఆయుధాలు తయారుచేసి, అవి పాకిస్తాన్ కి అమ్ముతారు. వాళ్ళు అవి మనమీద దొంగదెబ్బ తీయడానికి వాడుతూ ఉంటారు.
ఇక్కడ మీరు కట్టే ఫీజు ఈ స్థలాన్ని అక్వైర్ చేయడానికి గవర్నమెంట్ ఖర్చు పెట్టిన దానికి అయ్యే వడ్ఢేలో వందోవంతు కూడా ఉండదు. సగటున ప్రభుత్వం మీ ఒక్కొక్కరి మీద దాదాపు 10 లక్షలు ఖర్చు పెడుతోంది అన్ కండీషనల్ గా. దేశంలోని ప్రజలు మొత్తం కట్టే టాక్స్ లో కొంత మీ మీద ఇన్వెస్ట్ అవుతోంది. బట్ నో రిటర్న్స్. దేశంలో అతి కొద్దీ మంది మేధావుల్లో మీరు కొందరు. పోనీ ఇక్కడ అవకాశాలు లేవా అంటే . అసలు అవేంటో తెలుసుకొనే టైం కూడా మీకు లేదు, వీళ్ళు ఇవ్వరు.
(కంపెనీ ప్రతినిధులూ, యూనివర్సిటీ మానేజ్మెంట్ కొంచెం ఎంబేరాస్సింగ్ గా చూస్తున్నారు గెస్ట్ కేసి). సారీ, చెప్పి, తిరిగి మొదలుపెట్టాడు. ఇస్రో, DRDO , R & D , BRO, సివిల్ సర్వీసెస్, స్టార్ట్ అప్స్ , ఎంట్రప్రెన్యూర్షిప్, IT , ఇలా ఎన్నో ప్రొడక్టివ్ దారులు మీ గురుంచి తెరిచి ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేయండి. మీ మీద, మీ పిల్లల మీద, ఈగ కూడా వాలకుండా మా ప్రాణాలు అడ్డేసి కాపాడుతాం. మీరు హాయిగా లగ్జరీ గా బ్రతికేంత జీతాలు పెరిగాయి ఇప్పడు. దేశానికీ మీలాంటి మేధావుల అవసరం చాలా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మీలాంటి మేధావులంతా ఆన్ లైన్ కిరాణాల్లోనూ, వర్చ్యువల్ గేమింగ్ కంపనీల్లోనూ జాయిన్ అవ్వటం కొంచెం బాధగా ఉంటోంది. నిజమే, మనకున్న తెలివికి, మనం పడే కష్టానికి సరిపడా సంపాదించాలి అనుకోవటం న్యాయమే. కానీ, “ x+n = x” అనే థియరీ ఒకటి చెప్తాను. మనం హాయిగా బ్రతకటానికి ‘x ‘ అమౌంట్ ఆవరసరం అనుకుంటే, అంతకు మించిన సంపాదన (n ) మనకి ఏ రకంగానూ ఉపయోగపడదు (0) . ఉదాహరణకి ఒక ఇల్లు, ఒక కారు, ఒక ac , ఆ తర్వాత ? పెరుగన్నం తిన్న తర్వాత బిర్యానీ ఎంత బావున్నా మళ్ళీ తినలేంకదా.
పోనీ మన తర్వాత తరాలకి కూడా దాచాలనుకొంటే, ఈ మధ్య ఓ తెలుగు సినిమాలో చెప్పినట్టు, మన పిల్లలు మంచి వాళ్లయితే వాళ్లకి మన డబ్బు అవసరంలేదు. అలా కాదనుకొంటే మనం ఎంతిచ్చినా వాళ్ళు నిలబెట్టలేరు. నేను పైన చెప్పిన ఏ సర్వీసులో జాయిన్ అయ్యినా మీరు, మీ ఫామిలీ హాయిగా బ్రతకడానికి సరిపోయే జీతం వస్తోంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడున్న కంపెనీ ప్రతినిధులందరికి నా క్షమాపణలు. అయినా, దీన్నికూడా వాళ్లకున్న ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ లో ఒక భాగం అనుకుంటే సరిపోయే. జై హింద్.” అంటూ ముగించారు.
అప్పుడు స్టేజి మీద ఉన్న కంపేర్ మైక్ అందుకుని, “ఐ అం సారీ, చీఫ్ గెస్ట్ ని ఇంట్రడ్యూస్ చెయ్యడం మర్చిపోయాను. హి ఐస్ కమాండర్ కొమరం రవీంద్ర, సన్ అఫ్ లేట్ కొమరం వీరేంద్ర, పరమ్ వీర్ చక్ర. కమాండర్ రవీంద్ర ఇక్కడే బి.టెక్ చేసి, ఇండియన్ ఆర్మీ లో ఇంజనీరింగ్ వింగ్స్ లో ఒకటయిన మద్రాస్ sappers గ్రూప్ లో కంబాట్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఈ మధ్య కాశ్మీర్ లోని ‘ఉరీ’ వద్ద జరిగిన యుద్ధంలో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి వీరందించిన సహకారంతో ఎటువంటి ప్రాణహాని లేకుండా, శత్రువులని తుదముట్టించగలిగింది మన సైన్యం. వీరి సేవలకు ప్రభుత్వం ‘థియేటర్ హానర్’ అవార్డు కూడా ఇచ్చింది.
హల్ అంతా ఒక్కసారి చప్పట్లతో మార్మోగిపోయింది.
రాజేశ్వరి కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు. ఈసారి తృప్తితో.
కారు నెమ్మదిగా వెళ్తోంది. ‘సారీ అమ్మా, నేను అంతగా ఎమోషనల్ అవ్వకుండా ఉండవలసింది. నన్నుగుర్తు పెట్టుకొని ఇన్వైట్ చేసినందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టున్నాను.” అన్నాడు రవి.
రాజేశ్వరి చిన్నగా నవ్వి రవి చేతి మీద చేయి వేసింది. “నిజానికి నేను నీకు సారీ చెప్పాలి రా. మీ నాన్న పోయిన మొదట్లో నాకు ఎదో తెలియని ఉక్రోషం ఉండేది ఈ దేశం మీద. ఆ కసితోనే నిన్ను ఇంజనీరింగ్ చదవమని కంపెల్ చేశాను. ఎలాగైనా ఈ దేశం వదిలి పోవాలని. కానీ, ఆలా చేస్తే మీ నాన్న త్యాగానికి, గవర్నమెంట్ మన మీద చూపించిన కంపాషన్ కి విలువ లేకుండా పోతుంది. అందరిలాగా నువ్వూ ప్యాకేజీ చూడకుండా నా మాటకి విలువిచ్చినందుకు థాంక్స్.” అంది రాజేశ్వరి.
మళ్ళీ ఆమె కళ్ళల్లో నీళ్లు. బాధ, ఆనందం, తృప్తి, ఇవేవీ కాదు. అంతకు మించి. దేశభక్తితో
‘ఉరీ’కి నా భర్తని పంపఁగా
పోరుకి తానర్పితమవ్వగా
కరిగిన సింధూరం సాక్షిగా
మరిగిన నా రుధిరం కోరగా
తరిమెను నా కొమరుణ్ణి
ఎదురుగ పోరాడమని
అవసరమై కోరగా దేశం
ఇంకోసారమ్మగ మారనా
మరో వీరుణ్ణి అంకితమివ్వనా
ఎప్పుడో డైరీ లో రాసుకున్న వాక్యాలు గుర్తొచ్చాయి ఆమెకి.కారు స్థిరమైన వేగంతో ముందుకి కదుల్తోంది. దేశం ప్రగతిలాగా….
(ఇది వాట్సప్ మెసేజ్… ఆ రచయితకు ధన్యవాదాలు, పేరు తెలిస్తే చెప్పండి, ముందస్తుగా కృతజ్ఞతలు))

No comments:
Post a Comment