బాల్య స్మ్రుతులు
ఆదివారం తెల్లవారి 4 అయేసరికి ప్రతి ఇంట్లోలోని, ప్రతీ గొంతుక అధమము
ఓ గోకర్ణం ఆముదముతో తడిసేది,
పిల్లల ఏడుపులతో ఇళ్ళు దద్దరిల్లేవి!
అక్కడి నుండి
bating in toilet మొదలయి, సునాముఖీ చారుతో
వుద్రుతమై సుమారుగా half century దాటేక, ఒక్కొక్కరూ తోటకూర కాడలా వాలిపోతున్న తరుణములో
చారు అన్నముతో అ పూట పూర్తయేది!
ఆనాటి ఆహారం అమ్రుతతుల్యమవడానికి ఇదీ ఒక కారణమేమో!
అందుకు అనేక కారణాలలో ఒకటేంటంటే పిల్లలకు కడుపులో చిన్న, చిన్న నులి పురుగులు, పట్టు పాములు కట్టలు,కట్టలుగా నిల్వ వుండేవి వాటి నిర్మూలనకే ఈ ఆముదము! ఆ సమస్య ఇపుడు లేదు !
బహుశా ఆనాటి మట్టి రోడ్లు, తగిన పాదరక్షలు లేకపోవడం, మట్టి నేలలు కారణం కావచ్చని నా అభిప్రాయం!
అయితే ఆ రోజుల్లో అందరూ ఆరోగ్యంగా, ధ్రుడంగా వుండి అదిక శారీరిక శ్రమ చేసి, అనేక రకాల వంటకాలతో పుష్కలంగా , పుష్టిగా భుజించేవారు! ఇన్ని రకాల జబ్బులు లేవు, జ్వరం వస్తే లంఖణం, పడిశం పడితే మిరియాల కషాయం తో సరి!
పూర్వము అన్నీ
ఉమ్మడి కుటుంబాలవడము మూలాన కొన్ని కుటుంబాలు స్వయంసమ్రుద్దిని సాదించాయి !
సమ్రుద్దిగా కావలసిన
పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ల
నిమిత్తము ఆవులను పెంచేవారు.
ఆ రోజుల్లో ఉదయము ఏ ఇంట్లో చూసినా కవ్వాలతో వెన్న చిలికే గాజుల సవ్వడులే!
అది ఒక కమనీయ ద్రుశ్యం!
ఇంటికి కావలసిన కూరగాయలు ,
దేవుడి పూజకు మరియు స్త్రీలు సిగలో ముడుచుకొనే వివిద రకాల పుష్పాలు పండించుకొనేవారు.
తెల్లారగానే మగవాళ్ళందరూ కూరల తోటలోనే పని చేసేవారు!
వేసవికాలం రాగానే ఆ సంవత్సరమంతా సరిపోయే వివిధ రకాల ఆవకాయలు, మాగాయి,
నిల్వా పచ్చళ్ళు, అనేక రకాల వడియాలు, అప్పడాలు, చల్ల మిరపకాయలు రోజుల తరబడి తయారు చేసి మడిగా అటకలపై నిల్వా చేసేవారు!
మరి గుండలు, పచ్చళ్ళు, రాత్రిళ్ళు బామ్మలు, వంటిపూట వారికోసం ఫలహారాల నిమిత్తము పిళ్ళు, పిల్లలకు, సాయంత్రాలు చిరుతిళ్ళకు, ఉదయం పూట దేముని నైవేద్యము గురించి చెప్పనే అఖ్ఖర్లేదు. రుబ్బురోళ్ళు, తిరగళ్ళు, రోళ్ళు, సన్నికాళ్ళకి ప్రత్యేకించి ఓ గదే వుండేది.
ఇద్దరాడవాళ్ళు ఉదయాన్నే ఆ గదిలోకి దూరితే పైకొచ్చేసరికి భోజనాల వేళే.
ఆ ఇద్దరు ఆడవాళ్ళ జబ్బల నొప్పుల గురించి ఎంత చెప్పినా తక్కువే ఔతుంది!
పండుగలు, పబ్బాలకు వారం ముందునుండే తినుబండారాల తయారీ మొదలయేది!
మరి ఆనాటి భోజనశాల గురించి ఈనాడు చర్చించుకోవలసిందే!
నేతితో తేలుతున్న చప్పని పప్పు,
బెల్లం పప్పు, ఆకు కూరలతో కారం పప్పు, రెండు ముద్ద కూరలు, రెండు వేపుడు కూరలు, రెండు పచ్చళ్ళు, ఆవకాయలు, భగవంతుని ప్రసాదం, అప్పడాలు, వడియాలు,
అప్పడాల పిండి, చల్లమిరపకాయలు, పులుసు, గడ్డ పెరుగు, భోజనానంతరం ఫలం, తాంబూల సేవనం.
వంటల వాసనల ఘుమఘుమల వర్ణించతరము కాదు.
మరి అన్నేసి వంటలకు న్యాయం చేకూర్చే ఘనాపాఠీలే అందరూ.
పుష్టికరమైన భోజనము. భోజనము చేస్తూ మగవారు విసురుకునే హాస్యోక్తులు, పద్యాలు,
కొసరి, కోసరి వడ్డిస్తున్న ఆడవారి గాజుల గలగలలు అపురూపమైన పదహారణాల తెలుగు ద్రుశ్య కావ్యము!
పీటల మీద కూర్చుని భోజనం చేసేవారు కదా!
భోజనం మొదలు పెట్టేటప్పుడు నడుము వంచి తినేవారు, క్రమంగా కడుపు నిండుతున్నకొద్దీ పెరుగూ అన్నం తినే వేళకు నడుము నిటారుగా అయి చేతులు సాగదీసి భోజనం పూర్తి చేసేవారు! వడ్డన చేస్తున్న స్త్రీలు కొసరి, కొసరి వడ్డిస్తున్నప్పుడు భోజనం చేసేవారి ఈ అవస్థలను పరిశీలిస్తూ వడ్డించేవారు!
ఇన్ని రకాల వంటకాలు వున్నా,
కొందరు పధార్దానికి మరొక పదార్థము మిళితము చేసి మరిన్ని రుచులను రాబట్టుకునేవారు!
మా తాతగారు పులుసునే మూడు విధాలుగా చేసుకుని తినేవారు,
చిక్కని పప్పుతో కూడిన పులుసు ఒకసారి, రెండవ సారి బాగుగా గరిటెతో కలుపుతూ, మూడోసారి పులుసులోని తేట!
స్త్రీలు విస్తర్లు కుట్టుకుంటూ,
అప్పడాలు వత్తుతూ,
బియ్యం చెరుగుతూ
దేముని పాటలు పాడుకోనే వారు!
నాకు గుర్తున్న ఓ పాట పోస్ట్ పెడుతున్నాను!
మీరు తెలిసినవి కూడా పెడితే మన కింది తరాలకు అందుతాయి కదా!
"శ్రీరాముని మానసమున బావించితీ
వరపీఠమునందు వశీయింపజేసితి
హరికీ పన్నీటి స్నానమమరజేసితి
మొలకవెన్ను తులసులాను మెడను గట్టితీ
ధారుణి పతికి ధీపారధన ఛేసితీ!
ఆరగించవయ్య రాఘవ
మా తల్లితోడను సీతమ్మతోడనూ
ఆరగించు అరటిపండ్లు
అందమైన ధ్రాక్షపళ్ళు
కోవఫేణి కజ్జికాయ
గోధుమ పూరీలు హల్వా
సగ్గుబియ్యము పాయసంబు
సరసిజాక్షి సీతతో

No comments:
Post a Comment