యుగాది పంచాంగ శ్రవణం విశిష్టత
పంచాంగ శ్రవణం గురించి తెలుసుకునేముందు పంచాంగం అంటే ఏమిటో తెలుసుకుందాం.
తిధిర్వారంచ నక్షత్రం యోగః కరణమేవచ పంచాంగమ్.
తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనే అయిదు ప్రధాన అంగాలున్నదే పంచాంగం.
కాలరూపుడైన భగవంతుడు ఉండేది తిథి.
ఒక్కొక్క గ్రహం భగవంతుడిని సేవిస్తూ ప్రదక్షిణ చేసే దినం వారం.
క్షత్రం (హాని) కలగకుండా రక్షించేది నక్షత్రం.
అలాగే చంద్రుడు నక్షత్రంతో కలిసి ఉన్నకాలం యోగం.
వీటిని సాధించే ప్రక్రియే కరణం.
ఈ పంచాంగాల కలయిక వల్ల, ఏ ఏ ఫలాలు కలుగుతాయో చెప్పేదే పంచాంగం.
ఈ అయిదు దైవ స్వరూపాలైన కాలవిభాగాలే కనుక వీటిని దేవతా స్వరూపాలుగా ఎంచి, పంచాంగ శ్రవణం చేసేముందు కొత్త పంచాంగాన్ని పూజించాలి.
పంచాంగంలో తిథి శ్రవణం వల్ల సంపద,
వారం వల్ల ఆయుర్ వృద్ధి,
నక్షత్ర శ్రవణం వల్ల పాపవిముక్తి,
యోగం వల్ల రోగనివారణ,
కరణం వల్ల కామితార్థాలు సిద్ధిస్తాయి.
పంచాంగ శ్రవణం వల్ల గంగాస్నాన ఫలం, గోదాన, సర్వ దాన ఫలం లభిస్తుందని ధర్మసింధు వచనం.
సర్వేజనా సుఖినోభవంతు

No comments:
Post a Comment