Sunday, March 22, 2020

మనిషి... తన జ్ఞానాన్ని బట్టి విర్రవీగి...తమ దైనందిన జీవితంలో..

🌎 మనిషి... తన జ్ఞానాన్ని బట్టి విర్రవీగి...తమ దైనందిన జీవితంలో.. దేవుడిని (సత్ప్రవర్తననీ,కృతజ్ఞతతో కూడిన భక్తినీ...) కాస్త పక్కకు నెట్టాడు... 🤘

తనను విస్మరించి... మనిషి అనుసరించే మార్గం ఎంత పరిపూర్ణమైనదో గ్రహించాలని ... దేవుడు కూడా అనుమతించాడు.

మనిషి... నవీన నాగరికత... అనుకుంటూ ఒంటరిగా... ఆనందాల వైపు... సమస్యల వలయం వైపు నడిచాడు

కారణం... మనిషి పట్ల దేవునికున్న ఆలోచనల్ని పక్కన పెట్టాడు.

🤷‍♂మనిషి తనను బట్టి తాను గర్వించాడు....

తాను సృష్టించిన సంపదను బట్టి..

తాను కనుగొన్న సైన్స్ ...ను బట్టి..

తాను సంపాదించిన జ్ఞానాన్ని బట్టి..

తాను కనిపెట్టిన టెక్నాలజీని బట్టి..

నాకేమి...అన్నివిధాలా సేఫ్ అనుకొన్నాడు.

ఎవ్వరి కరుణా వీక్షణాలతో ఈ జగత్తు అనంత కాలం నుంచి సురక్షితంగా నిలబడుతున్నదో...

ఆ "జగద్రక్షకుడి మాటలను విస్మరిస్తూ నడుస్తున్నది..." మానవ సమాజం.

మనిషి దేవునికి (దేవుని హృదయానికి)... దూరం అయ్యాడు. దేవుడు కూడా తనకు దూరంగా... మనిషి జ్ఞానం ఎంత పరిపూర్ణమైనదో అవగాహన పరచాలనుకున్నాడు..

ఎంతో గొప్ప జ్ఞానిని అని విర్రవీగిన మనిషి, ఒక చిన్న కంటికి కనపడని సూక్ష్మ క్రిమితో పోరాడలేక తల్లక్రిందులవుతూ ఉన్నాడు .

కంటికి కనపడని ఈ సూక్ష్మ క్రిమి...

మనిషి శరీరానికి హాని కలిగించడం మాత్రమే కాదు,

కుబేరులను బికారులుగా మార్చుతున్నది...

సంపన్న దేశాల సంపదను అదృశ్యం చేస్తుంది..

మనుషులను అస్పృశ్యులుగా మార్చివేసింది..

దేశాధ్యక్షుల నుంచి, సామాన్యుల వరకు, మతం కులం, జాతి తేడా లేకుండా అందరిని భయపెడుతున్నది...

ఓ జ్ఞానీ! నీ జ్ఞానమెంతవరకు..?

ఓ శాస్త్రజ్ఞుడా! నీ మేధస్సు ఎంతవరకు?

ఓ ధనవంతుడా!.. నీ ధన ప్రభావం ఎంతవరకు ?

ఓ జాత్యహంకారీ !.. నీ జాతి గొప్పతనం ఎంతవరకు?

నీవు ఏర్పరచుకున్నవీ, నీవు గర్వించి సంపాదించినవీ... ఇవేవీ ఈ చిన్న క్రిమిని ఓడించలేకున్నాయి ఎందుకని?

ఇక చాలు, నీ గర్వాన్ని తొలగించుకో, ఈ భూమి మీద నీకున్న "కేవల జ్ఞానంతో మాత్రమే"... నీకు క్షేమం లేదన్న విషయాన్ని ఇప్పుడైనా గ్రహించు.

మనిషి దేవుని దయకు దూరమైతే, వినాశనమే నన్న సత్యాన్ని గ్రహించు.

దేవుని మార్గానికి దగ్గరగా జరుగు.

దేవునికి దగ్గర కావడమంటే...
"నీతిగా,యదార్ధంగా,పరోపకారంతో జీవించడమేనన్న సత్యాన్ని గ్రహించు"... భూమి పై పెరిగిపోతున్న పాప భారాన్ని తగ్గించటానికి... నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి...

ఈ లోకంలో ఎలా ఆనందించాలి, ఎలా గొప్పవాడ్ని కావాలి... అనే.. స్వార్థం, అహంతోనే.. సమయాన్నంతా గడపకుండా...

సర్వసృష్టి వలే ... నీవు కూడా దేవుని చేతి పని వన్న సత్యాన్ని గ్రహించి...,

ఈ సమాజంలో ప్రేమతో,సత్యంతో ,సేవాభావంతో తోటి వారితో మెలగటం ప్రారంభించు.

నే నిక్కడ ఎంత గొప్పగా జీవించాలి... అని ప్రశ్నించుకొంటూ... డబ్బు ,హోదా సమకూర్చుకోవడమే.. జ్ఞానం, జీవిత పరమార్ధం అనుకోకుండా...

నీ అవసరం ఎక్కడ వుందో అక్కడ పరోపకారిగా, సేవాభావంతో జీవించడమే నీ జన్మకు సార్ధకత ..అన్న సత్యాన్ని గ్రహించు.

🙏 స్వార్ధం, కులం, మతం, జాతి, అహంకారం లేని

దేవుడు కోరుకున్న
ప్రేమ, సత్యం, నిజాయితీ అనే..
దేవుడు వేసిన మన "అనాది కాలపు మానవత్వపు పునాది మీద" అందరం ఒకటై నిలబడినప్పుడు, దేవుడు కూడా మనతో కలిసి నడుస్తాడు.. . 🙏

అప్పుడు... ఒక్కటేం కర్మ, వేయి కరోనాలు అయినా...
మనవైపు చూడటానికే.. భయపడతాయి. మనకు నష్టం కలిగించలేక పారిపోతాయి 💥

No comments:

Post a Comment