Tuesday, March 17, 2020

భక్తిభావం

💥భక్తిభావం💥

ఒక ఊళ్ళో ఒక దుర్గ ఆలయం ఉండేది. ఆ ఆలయ పూజారి అమ్మవారిని మాత్రమే దర్శించేవాడు. కటిక బ్రహ్మచర్యం పాటించేవాడు. అన్య స్త్రీని తల్లిలా భావించేవాడు. అమ్మవారికి నిత్యం చతుఃషష్ఠి ఉపచారాలతో పూజిస్తూ అమ్మసేవలోనే ఆ ఆలయంలోనే గాడిపేవారు.

అదే ఆలయంలో ఒక భగవంతుడి సేవకు మాత్రమే అంకితమైన నర్తకి వచ్చి పరమేశ్వరుడి ముందు నాట్యం చేసి వెళుతుంది. అప్పుడు, ఒక్కసారిగా ఆ పురోహితుని మనస్సు అమెవైపు ఆకర్షించబడి ఆలయ సమయం అయిపోగానే ఆవిడ ఇంటికి వెళతాడు.

ఆమె తల్లి ఆయన్ని గమనించి ఏమని ప్రశ్నించగా మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను మీ అమ్మాయిని అడగడానికి వచ్చాను అంటాడు. వారించి కుదరదని చెబుతుంది తల్లి. మీరు ఎంతో గొప్పవారు .....తల్లీకే అంకితమైన బ్రహ్మచారులు..... మీరేమిటి ఇలా.....! వెళ్ళండి అంటుంది. అప్పుడు, అదంతా చాటుగా వింటున్న నర్తకి ఆయన వద్దకి వచ్చి అలాగే నేను మిమ్మల్ని వివాహమాడుతాను అయితే ఒక సహాయం చేయాలి మరి నాకు అని అడుగుతుంది.

ఇంతకీ ఏమిటా సహయం అని అడుగగా, గుడిలోని అమ్మవారి నగలని హారాలని, వడ్డాణం, ముక్కుపుడక, కిరీటం, వంకీలు, గజ్జెలు, శంఖచక్రాలు, గధ, అన్ని ఆభరణాలు, పట్టుచీర, పూల దండలు, కబరీబంధపు జడ కుచ్చులు ఇవన్నీ కావాలని అవన్నీ తెచ్చి తనని అలంకరించుకోవాలి అని అడుగుతుంది. అచ్చు అమ్మవారిలా తయారు చేయమని అప్పుడే తనని వివాహమాడుతానని అంటుంది.

అప్పుడు ఆవిడ ఒప్పుకున్న పారవశ్యంలో అలాగేనని ఆలయానికి పరుగెడుతాడు. అవన్నీ మూట గట్టి తెచ్చి అమ్మాయిని ఉయ్యాలలో కూర్చోబెట్టి ముఖానికి పసుపు రాసి పెద్ద బొట్టు పెట్టి ఆమెకి అలంకరించి కిరీటము పెట్టి చివరగా పూలమాల అలంకరించి త్రిశూలం చేతికి ఇస్తాడు.

ఎంతో అందంగా ఉంటుంది అచ్చు అమ్మవారిలా ఉన్న ఆమెని ఉయ్యాల ఊపి దూరంగా వెళ్లి నిలుచుని పరిశీలించి చూస్తాడు. ఒక్కసారిగా ఆమెలోని వెలుగు ఊంజల్ సేవలో ఉన్న అమ్మవారి రూపం కనిపించేలా అవుతుంది. వెంటనే ఆ అమ్మాయిని మరచిపోయి, అమ్మ దుర్గామ్బ తాయి అంటూ కాళ్లపై పడిపోయి మంగళ హారతి ఇస్తాడు. కాసేపయ్యక అమ్మాయిని గమనిస్తాడు. ఒక్కసారిగా, తన తప్పు తెలుసుకొని క్షమించమని అడిగి మిద్వారా మీలోని తల్లి దర్శనం అయింది అమ్మ ఇక నగలు ఇవ్వండి తిరిగి ఆలయానికి వెళతాను అంటాడు. అప్పుడు ఆఅమ్మాయి మరి వివాహం అంటుంది. అపుడు ఆయన తల్లిని వివహమాడటం ఎంత తప్పు. లేదు మీరు నాతల్లి అని చెప్పి నమస్కరిస్తూ వెళ్ళిపోతాడు.

కాసేపయ్యక అమ్మాయిని ఆమె తల్లి ప్రశ్నిస్తుంది ఏమిటి అలా అన్నావు చివరికి అతను అలా వెళ్ళాడు అని. అమ్మాయి, భక్తిలో ఉన్నవారు తల్లిని దర్శించగలరు కానీ కన్యని దర్శిస్తారా అమ్మ. అందుకే అలా అలంకరించమన్నాను. ఆయనకి అలా గుర్తురావలని ఇదంతా చేసాను అంటుంది.

ఆయన గబగబా ఆలయంలోకి పరిగెత్తి తిరిగి అమ్మవారికి నగలు అలంకరించి నినిజ దర్శనం కల్పించావు తల్లి శరణు శరణు అంటూ ఆనందంతో ఏడుస్తూ పాదాలపై పడి లీనమైపోతాడు.

భక్తి ముందు ఏ అవాంతరమైన, ఏ అపవాదైన, ఏ అవలక్షణమైన, ఏ ఆకర్షణ అయిన ఇట్టే మననుండి తొలగిపోతుంది. దేవుడు, మనల్ని అలాగే కాపాడుకుంటాడు. భగవంతుణ్ణి నమ్మినవాడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు. మంటల నుండి కూడా రక్షణ పొందుతాడు.

🌹 సర్వేజనా సుఖినోభవంతు🌹
శ్రీ ధర్మశాస్త సేవాసమితి🐆 విజయవాడ🏹7799797799

No comments:

Post a Comment