గురు బోధ
....................................................................
ఆత్మ స్వరూపులందరికీ శుబోదయం .
ఆత్మ స్వరూపులారా మనమందరం దైవ వారసులం .
దైవం ఎప్పుడూ మనతోనే ,మనలోనే ఉంటుంది .నీవు మరలా దైవం కోసం ఎక్కడికో వెళ్లనవసరం లేదు ..కొంతమంది అంటారు గంగలో మునిగితే ,చేసిన పాపాలు పోతాయి అని .పోతాయి ,కాని మరలా అంటుకుంటాయి .
ఎలాగంటే గంగ పవిత్రమైనది గంగలో నీ శరీరం మునుగుతుంది తప్పా ,నిన్ను అంటుకున్న పాపాలు మునగవు .ఇద్దరు స్నేహితులు ఒకసారి గంగలో మునిగి చేసినపాపాలు పోగోట్టుకోవడానికి గంగానదికి వచ్చారు .అక్కడ ఒక సాధువు కూర్చుని ఉన్నాడు .ఇద్దరిలో ఒకడు గంగలో మునిగి బయటకి వచ్చాడు .ఎంతో ఆనందముగా
ఆహా నాపాపాలు అని పోయాయి అనుకుంటున్నాడు .ఇందంతా గమనిస్తున్న సాధువు అతనితో మాట్లాడుతాడు ,ఏమినాయనా అంత ఆనందముగా ఉన్నావు ? అప్పుడు అతను అంటాడు నేను గంగలో మునిగేసాను నా పాపాలు అన్ని పొయాయి అని .అప్పుడు ఆ సాధువు అంటాడు ,నాయనా నీకు కొంతసేపు దివ్య దృష్టి ప్రసాదిస్తున్నాను చూడు .అని దివ్యదృష్టి ప్రసాదిస్తాడు .నీస్నేహితుడు గంగలో మునగడానికి వెడుతున్నాడు కదా ,చూడు అతని పరిస్థితి అని చెప్పగా , రెండవ స్నేహితుడు గంగలో మునుగుతున్నాడు .ఒక్కొక్క మెట్టు దిగుతుండగా ,అతనిని అంటుకున్న పాపాలు ఒక్కొక్కటి ప్రక్కనే ఉన్న చెట్టుమీదకి అతనిని వొదలి వెళ్లి కూర్చుంటున్నాయి .అతను పూర్తిగా మునిగాడు గంగలోనికి .పాపాలు అన్ని వొదిలిపోయాయి .
గంగాలోనుంచి శిరస్సు పైకి లేపేటప్పటికి అతని శిరస్సు దేదీప్యమానంగా వెలిగిపోతుంది .అతని పాపాలు అని పోయాయి కబాట్టి .ఇదంతా చూస్తున్నడు ,దివ్యదృష్టి వచ్చిన అతని స్నేహితుడు . గంగలో మునిగిన వ్యక్తి పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వస్తున్నాడు అతనిని వొదిలిన పాపాలు కూడా ఒక్కొక్కటి తిరిగి మరలా అంటుకుంటున్నాయి .పూర్తిగా బయటికి వచ్చేశాడు ,అతని పాపాలు అన్ని పూర్తిగా అంటుకున్నాయి .ఇదంతాచూస్తున్న వ్యక్తి సదువుతో అడిగాడు ,ఇదేమిటి స్వామి అని అడగగా ,
స్వామి చెబుతాడు .గంగ పవిత్రమైనది ,కాని గంగలో మునగడానికి పాపాలకు శక్తి లేదు .ఎందుకంటే అతను చేసిన తప్పుడు కార్యాలన్నీ తన మనస్సుతో చేసాడు. కావున అవి పాపాలుగా మారి అతనిని చుట్టుకున్నాయి .అవి బ్యాంకు లో చేసిన డిపాజిట్లు .ఖర్చుచేస్తేనే తగ్గుతాయి తప్పా , గంగలో మునిగేతే శరీరం తడుస్తుంది తప్పా ,పాపాలు పోవు .ఏమనస్సుతోనైతే తప్పుడు కార్యాలు చేసాడో అదే మనస్సుని తిరిగి పవిత్రం చేసుకుని పుణ్య కార్యాలు ,తపస్సు ,గురు సజ్జన సాంగ్యాత్యం , ఎదుటివారికి సహయం చేస్తూ ,స్వాధ్యయనం చేస్తూ ,ఈ జన్మనే ఆఖరు జన్మ చేసుకోవాలి అని తలంచి ,గురువుని ఆశ్రయించి దివ్య జ్ఞానాన్ని పొంది తపస్సునాచరించిన పిదప అతనియొక్క పాపాల సమసిపోతాయి తప్పా గంగలో మునిగినంతమాత్రాన పాపాల పోవు అని తెలుపుతాడు .మరి నా పరిస్తితి ఏమిటి స్వామి ,నాపాపాలు మాటేమిటి ? అని అడుగగా అవిఎప్పుడో నిన్ను చుట్టేసుకున్నాయి ,నీవు గంగాలోనుండి పైకి రాగానే అంటుకున్నయి అని తెలుపుతాడు .
ఈ విదముగా ఎవరయితే పాపకార్యములు చేయక పుణ్యకార్యములు చేస్తూ గురువుని ఆశ్రయించి దివ్య ఙ్ఞానాన్ని పొందుతాడో ,సాధన ద్వారా మాత్రమే పాపాలనన్నిటిని చెరిపివేయగలడు .అంతే గాని గంగలో మునిగినంత మాత్రానా పాపాలు పొవు .......

No comments:
Post a Comment