శ్రీనివాస సిద్ధాంతి
9494550355
పూజగది అలంకరణ
మన సాంప్రదాయం ప్రకారం మన ఇంటిలో పూజకి ప్రత్యేక స్థానం ఉంది. దేవుడిని ఆరాదించడానికి ఇంటిలో ప్రత్యేకంగా ఒక పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. ఉదయం లేవగానే స్నానపానాదుల ఆచరించిన తర్వాత చాలా మంది ఇళ్లలోనే పూజ గదిలో కొద్ది నిమిషాలు గడపడడం చాలా మందిలో ఆనవాయితీ. దీని వల్ల మనశ్శాంతి, ఆయురారోగ్యాలు, సంతోషం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. అయితే పూజ గదిని శుభ్రంగా, మరింత అందంగా తీర్చిదిద్దుకోవడం చాలా అవసరం.
అలంకారం
పూజ గది గోడలకు మీ ఎంపిక చేసుకునే రంగలు మాత్రం లైట్ కలర్ షెడ్ లు ఉండే విధంగా ఎంచుకోవాలి. గోడలకు వేసిన రంగుల వల్ల మనస్సు ప్రశాంతత చేకూర్చే విధంగా ఉండాలి. పూజ గదికి వేసే రంగులు ముఖ్యంగా తెలుపు రంగుతో పాటు పసుపు, లేత గులాబి, లేత నీళం రంగులను వాడుకోవచ్చు.
ఇక పూజ గదికి ఏర్పాటు చేసే మండపాన్ని చక్కగా అలంకరించాలి. ఈ మండపాన్ని సంప్రదాయబద్ధంగా ఉండే విధంగా చక్కటి కలపను వాడాలి. ప్రస్తుతం మార్కెట్ లో మార్బల్, ఇత్తడితో పాటు గ్రైనేట్ మండపాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ మండపాలకు పూలతో చక్కగా అలంకరించాలి.
ఆ తర్వాత, సరైన విగ్రహాలను ఎంపిక చేసుకోవాలి. విగ్రహాల ఎంపికకు తేలికపాటి విగ్రహాలను ఎంపిక చేసుకోవాలి. చక్కతో చేసిన విగ్రహాలైతే మేలు. లేదా లోహంతో తయారు చేసినవ కూడా ఫర్వాలేదు. బంకమట్టితో చేసిన విగ్రహాలు కూడా వాడవచ్చు.
పూజ గదిలో వెండి, రాగి లేదా ఫ్రేమ్ తో తయారు చేసిన ఫోటోలను పూజ గది గోడలకు అందంగా అలంకరించవచ్చు. పూజ గదిలో వెండి, లేదా ఇత్తడి దీప స్తంభాలు మార్కెట్లో వివిధ ఆకారాల్లో లభిస్తాయి. వాటిని పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే పూజ గదికి మరింత అందం చేకూరుతుంది.
వెండితో తయారు చేసిన పళ్లాలు కూడా వాడవచ్చు. వాటిలో కర్పూరం, చందనం, పూలు తదితర పూజ సామగ్రిని ఉంచుకోవచ్చు. కాలాన్నిబట్టి మార్కెట్లో వివిధ రకాల పూలు దొరుకుతాయి. రోజుకో రకం పూలను వాడుకోవచ్చు. అయితే పూజకు వాడే పూలను దేవునిపై విసిరివేయకుండా చరణాలకు సమర్పించవలెను. మూర్తి దూరంగా ఉంటే వాటిని దేవుని ఎదుట ఉండే పళ్ళెంలో ఉంచకూడదు.
పూజగదిలో పువ్వులు, దీపాలు పెట్టడానికి నువ్వుల నూనె, ఆవునెయ్యి, వత్తులూ, మట్టిప్రమిదలూ, కుందులూ, అగరొత్తులూ, అగ్గి పెట్టెలూ, పసుపూ, కుంకుమా, గంధమూ, సిందూరమూ, విభూతిపండు, జపమాల, అక్షింతలూ, కర్పూరం, కొబ్బరికాయ, తమలపాకులూ, వక్కముక్కలూ, ముగ్గూ, కలకండ, గంట, ఏకారతి, కూర్చోవడానికి చాపలూ/ పీటలూ/ మృగచర్మమూ, పారాయణ పుస్తకాలు పెట్టుకోవడానికి తగిన స్థలం, మందిరాన్ని శుభ్రం చేసే ప్రత్యేకమైన చీపురూ, దేవుణ్ణి శుభ్రం చేయడానికి ఒక ప్రత్యేకమైన వస్త్రం, వస్తువుల్ని తుడవడానికి మరో ప్రత్యేకమైన మసిగుడ్డ - ఇవన్నీ ఏర్పరుచుకోవాలి. వీటిల్లో నిత్యపూజకి కొన్నీ, ప్రత్యేక సందర్భాలకి మరి కొన్ని ఉపయోగపడతాయి. ఇవన్నీ చవగ్గా దొరికే వస్తు ద్రవ్యాలే. అయినా పూజాద్రవ్యాల మీద ఖర్చుచేయడానికి లోభించకూడదు. లోభించేవారికి ఫలితమివ్వడానికి దేవుడు కూడా లోభిస్తాడని మర్చిపోరాదు. తగుమాత్రం ఖర్చుపెట్టాలి. ఎంత చేసుకుంటారో అంతే ప్రాప్తం.
ప్రతిరోజూ పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఈ పనిని కూడా గృహస్థుడు గానీ, గృహిణి గానీ స్వయంగా చేయాలి. పనివారికి అప్పగించకూడదు.
ఎటువైపు ఉండాలి..?
పూజ గది ఈశాన్య లేదా తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పా టు చేయాలి. ఉదయమే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటాడు. హిందువుల ఎవరి ఇంట్లోనైనా దేవీ-దేవతల ఫోటోలు వుంటాయి. కొందరి ఇళ్ళల్లో ప్రత్యేకంగా పూజాగది ఉంటుంది. మరికొందరి ఇంట్లో గోడలకు మాత్రమే దేవీ-దేవతల ఫోటోలు వ్రేలాడుతూ కనబడతాయి. అయితే దేవీ-దేవతల విగ్రహాలను కానీ, ఫోటోలు కానీ వరుసక్రమంలో పెట్టుకోవాలి.
వినాయకుడి విగ్రహం లేదా చిత్రము మధ్యలో అమర్చుకోవాలి. పురుష దేవతలు గణపతి విగ్రహానికి కానీ ఫోటోకి కాని కుడి వైపున (ఉదా: హనుమంతుడు, శ్రీకృష్ణుడు). స్త్రీ దేవతలు(ఉదా : అన్నపూర్ణదేవి) గణపతికి ఎడమ వైపున వచ్చే విధంగా అమర్చుకోవాలి. కొన్ని ఫోటోలలో దేవీదేవతల కలిసిన ఫోటోలు (ఉదా: సీతారాముడు, లక్ష్మి నారాయణుడు) వుంటాయి. అలాంటి ఫోటోలను గణపతి దేవునికి కుడి వైపు వచ్చే విధంగా అమర్చుకోవాలి. ఎవ్వరికైనా ఆధ్యాత్మిక గురువు ఉండి, కేవలము ఒక్కరే నివసిస్తుంటే అతను కేవలం గురువుల ఫోటోను మాత్రమే అమర్చుకోవాలి. ఒక్కవేళ కుటుంబ సభ్యులు వుంటే గురువుల ఫోటోను గణపతి దేవునికి కుడి వైపున వచ్చే విధంగా అమర్చుకోవాలి.
లక్ష్మీ లలిత వాస్తుజ్యోతిష నిలయం.
స్వర్ణ కంకణ సన్మానిత.
జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి

No comments:
Post a Comment