🙏సహజత్వమే దైవత్వము🙏
🥦ఈనాటి మానవుడు తన సహజత్వంగా జీవించడం మర్చిపోయాడు
🥦ఈ భూమ్మీద ప్రతి చెట్టు సహజంగా జీవిస్తుంది ఎదుగుతుంది
🥦ఈ భూమ్మీద ప్రతి జీవి కూడా సహజంగానే జీవిస్తున్నాయి ఎదుగుతున్నాయి.
🥦కేవలం ఒక మానవుడి మాత్రమే తన సహజత్వానికి భిన్నంగా సమాజం నేర్పించిన అజ్ఞానానికి అనుగుణంగా
జీవిస్తున్నాడు.
🥦అందుకే ఈ భూమి మీద మానవుడు దుఃఖంతో వేదనతో రోదనలతో ఉంటున్నాడు కారణం తను సహజత్వానికి కనుగుణంగా లేకపోవడమే.
🌹మనిషి తన సహజత్వాన్ని అనుగుణంగా ఇతరులును నష్ట పెట్టకుండా ఏది చేసినా
అది ఆనందాన్ని ఇస్తుంది.
🌹మనిషి తను ఆనందంగా జీవించడం మర్చిపోయి, ఇతరుల కోసం జీవిస్తూ, ఉన్నాడు అందుకని దుఃఖంతో ఉన్నాడు.
🌹ఈ భూమి మీద ఒక మానవుడు కే గతం గురించి బాధ, భవిష్యత్తు గురించి భయం, ఇతరులతో పోల్చుకోవడం, గుర్తింపు కోసం ఆరాట పడడం, పుట్టుక సహజం పోవుట సహజం అని తెలుసుకోలేక పోవడం, దీని వల్ల మానవుడు సహజంగా జీవించలేక పోతున్నాడు
🌹మానవుడు తాను ఒక శరీరం కాదు శరీరంలో ఉన్న ఆత్మను అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో చావును గురించిన భయం ఉండదు.
🌹సమాజం ఉండని సంసారం ఉండని బంధువులు ఉండని, మిత్రులు ఉండని, ఎంతమంది అయినా ఉండని నువ్వు నువ్వే నువ్వు నీ లాగానే సహజంగా ఉండడం నేర్చుకోంటే సహజంగా ఎప్పుడు ఆనందంలో ఉంటావు.
🌹జీవితంలో ఎక్కువ మంది ఎక్కువ భాగం నటిస్తున్నారు కాబట్టే ఎక్కువ మంది సహజంగా ఆనందంగా ఉండలేకపోతున్నారు
🌹నటించడం మానుకోవాలి. జీవించడం నేర్చుకోవాలి నీ లోపల నీ అంతరాత్మను ఏమి చెప్తే ఆ విధంగా ఉండటమే సహజత్వం.
🌹నీ సహజత్వమే నీకు ఆనందాన్నిస్తుంది, బయట ప్రపంచం కాదు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♂
No comments:
Post a Comment