Friday, May 1, 2020

కురుక్షేత్రం

💥💥💥💥💥💥💥💥💥💥
అమ్మా మంచి సందేహం.
యుద్ధానికి పూర్వం దుర్యోధనాదులూ..ధర్మరాజాదులూ యుద్ధం చేసేందుకు క్షేత్రం కోసం కృష్ణుడి నే వెతకమన్నారు.
అపుడు కృష్ణుడూ అర్జునుడూ కలసి వెళ్ళారు.అర్జునుడు సారధిగా కృష్ణుడు రధికుడుగా...అలా వెతుకుతూ ఉన్నారు ఎన్నో మైదానాలనూ...పంటపొలాలనూ..ఇరువైపులా మహా సేనలున్నాయి. ఇరువైపులా అత్యంత ప్రమాదకరమైన అస్త్ర శ స్త్రాలున్నాయి. ఆ సైనికులందరికీ ఇరువైపుల వారికీ జలము అందుబాటులో ఉండాలి ..అన్నీ అందుబాటులో ఉండేలా ఉండాలి. అక్కడ యుద్ధం చేయబోయే మహా నాయకులు స్వధర్మంలో నిలచి ఉండే మూలాధార శక్తి నిరంతరం అందుతూ ఉండాలి.
అది సపోషకమూ. సదైవికమూ..సధార్మికమూ అయి ఉండాలి. మనం జీవించాలంటే మనం మనం నిలచిన భూ భాగం ధర్మ పూర్ణ అణు స్వరూపమై ఉంటేనే మనం ధర్మ బద్ధంగా జీవించగల్గుతాం. అంటే..ఆ భూమికి ఆ చోటులో విశ్వం నుండీ అందించబడే శక్తి యొక్క మెరిడియన్స్ తో అనుసంధానమై ఉండాలి..!!
ఆ ప్రదేశానికి వచ్చేసరికి కృష్ణార్జునులకు ఒక వింతైన సంఘటన దర్శనమిచ్చింది.
అదంతా ఒక పొలం. ఒక రైతు అక్కడ తన పొలానికి నీరు పెడుతున్నాడు..తన మోటబావి నుండీ..
అతనికి తెలుసు తాను చేయవలసిన ప్రతి కార్యాన్నీ
నిరహంకారంగా సమర్పణా పూర్వకంగా భూమికి అందిస్తేనే కానీ ఆ భూమి సస్య శ్యామలమై మంచి ఫలితాన్ని ఆరోగ్యవంతమైన ప్రాణ శక్తిని తన పాల రూపం లో ప్రతి విత్తనంలో నింపదూ అని. అందుకని అతడు చాలా
సమర్పణా స్వభావంతో నిరహంకారిగా...అంటే తన పొలమేదో ఎక్కువ పంట వస్తే తాను ఘనతను సాధించవచ్చును అన్న భావనేమాత్రమూ లేదు.!!
కేవలం తాను నిమిత్తమాత్రం గా ఆ మొక్కలకందించవలసిన ప్రాణశక్తిని ఆ భూమికి అందించటమే తన ధర్మంగా వ్యవసాయం చేస్తూన్నాడు.!!
ఇంతలో అతని కుమారుడు ఆ రైతుకు మధ్యాహ్న భోజనాన్ని తీసుకొచ్చాడు.!!
ఆ రైతు కాలువలో నీటిని ఒక చుక్క కూడా పక్క కు పోకుండా ప్రతి చుక్కా పొలం లోకే మళ్ళించాలన్న ధృఢ సంకల్పంలో ఉన్నాడు. ఒకచోట..కాలువ గట్టు ఎంతగా మేట వేసినా ప్రవాహం ఆ అంచును కొట్టేసి నీటిని పక్క కు పారించేస్తోంది. ఇప్పుడా రైతు ఆ అన్నం తెచ్చిన కుమారుని తలను ఖండించి ఆ తలను ఆ కాలువలో తెగుపోతున్న చోటులో అడ్డుగా వేసె మేట వేశాడు. ఆ సంఘటనంతా జరుగుతున్నప్పుడు...ఆ తండ్రి కానీ కుమారుడు కానీ ఎలాంటి ఉద్వేగాలకూ భావాలకూ లోనుకాలేదు.
ఆ పైన ఆ కాలవ మరమ్మత్తునావిధంగా పూర్తి చేసి ఆ రైతు తన భోజనాన్ని పూర్తి చేశాడు.!! ఆ తర్వాత
తను తడపవలసిన భూమినంతా తడిపి వచ్చాక ...ఆ చద్ది మూటను
ఇంటికి తీసుకు వెళ్ళేందుకు మామూలుగానే తన కొడుకును పిలిచాడు.. ఆ తలా మొండెమూ ఏకమై ఆ బిడ్డ ఆ చద్ది మూట తీసుకుని
ఇంటికి బయలుదేరాడు. ఇదంతా చూసిన శ్రీ కృష్ణ మూర్తి దీనినే.. ఇంతటి ధర్మ వంతమైన ప్రదేశం లో యుద్ధం చేయటం వల్ల ధర్మ మే జయిస్తుంది .అనీ అంతటి కార్యాచరణా ధర్మాన్నీ దాని ఫలితాన్నీ వెంట వెంటనే అందించగల స్థాయీ ప్రకంపనాలున్న క్షేత్రం కనక దానినే ధర్మ క్షేత్రం గా కురు క్షేత్రం గా ఎంపిక చేయటం జరిగింది.అని నేను విన్నాను.

ఇక రెండవ అర్ధం మానవ దేహం ధర్మ క్షేత్రమే..
ఎలాగంటే

ప్రతి జీవీ తానంతవరకూ నేర్చుకుని నిర్ణయించుకున్న సవ్యమని సమ్మతించిన అపసవ్యమని సమ్మతించిన ప్రతి కర్మ ఫలాన్నీ తన దేహంగా కలిగి ఉంటుంది.

ఈ ధర్మ క్షేత్రంలో నిరహంకారంతో
కర్మాచరణలు చేయటం సంభవిస్తూ..ఉండాలంటే ..
నిరంతరం ఆత్మ శక్తి ..అనే ధర్మ ప్రవాహపు మెరిడియన్ తో అనుసంధానం కావాలి.

అది జరగాలంటే మన పంచకోశాల విజ్ఞానం మనమెరగాలి.

కర్మేంద్రియాల
అవుట్ పుట్సూ..

జ్ఞానేంద్రియాల ఇన్పుట్సూ...
దేహము..
మనసూ..బుద్ధీ చిత్తమూ అహంకారముల ..
పంచ పాండవీయం లో లోకాలన్నీ సుఖంగా ఉండటానికి కావలసిన తామాచరించవలసిన
సంకల్పాల అస్త్రాలు..

తమలో తమను సద్గుణాల వైపుకు వెళ్ళనీక గట్టిగా పట్టుకుని పీడించే రక్షణ కోరే రాక్ష స వృత్తులను సమర్ధం గా
సంపూర్ణంగా పడగొట్టే

శస్త్రాలు మనలోని వివేక వైరాగ్యాది..ఖడ్గములు.

గతాన్నీ భవిష్యత్తునీ వదిలి వర్తమానం లో విహరించేందుకు వాయువ్యాస్త్రం...శ్వాస మీద ధ్యాస.

ఇతరులూ మనమూ వేరు వేరూ అనే భావనలను కత్తిరించేందుకు జ్ఞానమనే ఆగ్నేయస్త్రం.

గతానికి చెందిన ఏవో ఘన జ్ఞాపకాలను ముందుగా మేధస్సులోనూ తర్వాత వాటి ప్రతిబింబాలను దేహం లోనూ పొందికగా అమర్చుకున్న వాటిని...కడిగేందుకు వారుణాస్త్రం..
ధ్యానం చేస్తే కురిసే ఆకాశగంగ

మూలాధారం
నుండీ కుండలినీ కాయిల్ బాటరీని వెలిగించేందుకు నాగాస్త్రం

అనేక జన్మ పరంపరల నుండీ మనం మోసుకొస్తున్న పశు లక్షణాలైన

సాధ్యమయ్యేలా ఉంటే ఎదిరించు. అలా కాకుంటే పారిపో. సుఖంగా ఉంటే కట్టుబడి ఉండు...

అనే బంధిత మనసుకు ముక్తినిచ్చేందుకు
పాశుపతాస్త్రం...
సత్వరజస్తామసాలకు త్రిశులాలూ...
అహంకారానికి సుబ్రహ్మణ్య స్వామి బల్లెమూ...

మనసును మురిపిస్తూ జిివిత కాలాన్ని సంహరించే మమత్వానికి విల్లమ్ముల ..పొదులూ...

అన్నీ ధర్మ బద్ధంగా జ్ఞానపూర్ణంగా వాడే ప్రదేశం జీవుడు..కురుక్షేత్రం దేహం.*
🙏🙏☯️☯️☯️☯️🙏🙏

No comments:

Post a Comment