Tuesday, December 14, 2021

కొన్ని హిందూ వివాహాలు ‘‘అగ్ని సాక్షి’’ గా చేయడం వెనుక రహస్యం ఏంటి?..

🙏కొన్ని హిందూ వివాహాలు ‘‘అగ్ని సాక్షి’’ గా చేయడం వెనుక రహస్యం ఏంటి?..🙏

✍️మురళీమోహన్

🙏హిందు సాంప్రదాయంలో వైవాహిక శుభకార్యాల్లో ''అగ్ని''ని సాక్షిగా ఎందుకు పెడతారు అన్న విషయం చాలా మంది దంపతులకు తెలియదు. మన సంస్క్రతి, సాంప్రదాయాలలో అగ్నిని పవిత్రంగా చూడటం ఆచారం. పూజలు, యజ్ఝ యాగాదలు అగ్ని లేకుండా జరగవు.

అగ్ని సాక్షిగా లేకపోతే ఆ వివాహం ధర్మ సమ్మతం కాదంటారు. ఐతే వివాహానికి, అగ్నికి ఉన్న సంబంధం ప్రాచీన వేదాల్లోనూ, పురాణాల్లోనూ ఉంది. అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం బుగ్వేదంలో వివరించారు.

అగ్ని సాక్షిగా’’ వివాహం ఎందుకు చేస్తారు..?
“సోమ: ప్రధమో వివిధే, గంథర్వో వివిధ ఉత్తర:''
త్రుతీయాగ్నిష్టే పతి: తురీయప్తే మనుష్య చౌ:''

అని వివాహ సమయంలో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తర్వాత గంధర్వుడూ ఆ తర్వాత అగ్నీ ఏలారు. ఇహ నాల్గవ వానికి గా నేను నిన్ను ఏలుతాను అని అర్ధం.

అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు(చంద్రుడు). ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసి పాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన.

కొంత మంది వయస్సు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరిస్తాడు.

‘‘లావణ్యవాన్ గంధర్వ:'' అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమయిన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందాన్ని ఇచ్చేసినా పనయిపోయిందిఇక నీదే పూచీ అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళ్ళిపోతాడు.

ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు. ‘‘అగ్నిర్వై కామ కారక:'' అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామగుణాన్ని ( కామాగ్నిని ) ప్రవేశ పెడతాడు.

ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణమని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది.

ఇప్పుడు ఆమె వివాహానికి యోగ్యురాలైనది. ఇప్పుడు అగ్ని, వాయు, చంద్రు,ఆదిత్య, వరౌణులను పిలిచి 'దదా మీ త్యగ్ని ర్వదతి' - అంటే ఇంక ఈ కన్యను వరునికి ఇవ్వదలచుకున్నానయ్యా అంటాడు అగ్ని. వెంటనే వాయు, చంద్రాదిత్యవరుణులు తమ అంగీకారాన్ని తెలుపుతాడు. అంటే అమ్మాయి వివాహానికి యోగ్యురాలైనది. ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్లాలి కనుక కళ్యాణ సమయంలో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు.

చంద్రసాక్షిగా గంధర్వుడూ, గంధర్వసాక్షిగా ఆ, అగి ఈమెను రక్షించగా, అగ్నిసాక్షిగా వరుడు గ్రహిస్తాడు ఈ అమ్మాయిని. అందుకని 'అగ్ని సాక్షిగా పెళ్ళి'
అనే మాట వచ్చింది. ఇలా మన సంస్కృతి లో అగ్నికి చాలా ప్రాముఖ్యత ఉంది.

ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని ప్రథమసూక్తం అగ్నిసూక్తం. అగ్నిమీళేపురోహితం అనేది ప్రథమ మంత్రం. ఇలా వేదాలలోని ప్రథమ శబ్దం అగ్ని అంగా
పరబ్రహ్మ స్వరూపుడైన అగ్నినే ఋషులు గుర్తించి అగ్రస్వరూపునిగా కీర్తించారు.

ఆగ్ని, ఇరాకార జ్యోతిర్మయ బ్రహ్మం అగ్ని. సాకార విశ్వమూ అగ్నే. మన దేహంలో జఠరాగ్ని, కంటిలో ప్రకాశం, శరీరంలో ఉష్ణత్వం, సూర్యుడు, నక్షత్రాలు, జ్ఞానాగ్ని, వనాగ్ని అంటూ సమస్తం అగ్నిమయం.

మన మానసిక భావములు కూడ అగ్నులే. క్రోధాగ్ని, కామగ్ని, తపోగ్ని... ఇలా సర్వం అగ్నిమయం జగత్. ఈశ్వరుని బ్రహ్మజ్యోతి స్వరూపంచ అని అన్నారు. మహోన్నతమయి సర్వత్రా నిండిన జ్యోతి (అగ్ని) స్వరూపుడన్నది స్పష్టం..🙏

సేకరణ

No comments:

Post a Comment