Tuesday, December 14, 2021

మంచి మాట...లు

ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు అది దంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో మీకు మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటు.. అందరు బాగుండాలి అందులో మనముండాలి
సోమవారం --: 13-12-2021 :--
ఈ రోజు AVB మంచి మాట...లు
తోలి శ్వాస తీసుకొని ఏడుస్తావ్ తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావ్ ఈ రెండు ఏడుపులు మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం డబ్బులు ఊరికే రావు కానీ జబ్బులు ఊరికే వస్తాయి కాబట్టి నీ మనో ధైర్యమే నీకు మందు మిత్రమా! .

నీవు పదిమందిలో ఉన్నప్పుడు పట్టింపులు మరిచిపో ,నలుగురితో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఆనందం అయినవాళ్లతో పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో గతం చేసిన గాయాలు మరచిపో ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషి జీవితం అంటే ఒక యుద్థం అని తెలుసుకో .

దారి వెంట పోవడం కాదు దారి చేసుకుని వెళ్తేనే నీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడమంటే రాబోయే తరాలకు దారి చూపడమే , ఏ ఒక్కరి జీవితం కూడా పుట్టకతో పూలవనం కాదు అందరివి పడిలేచే బతుకులే మన ఒక్కరికే కాదు అసలు భూమి పైన సమస్యలు లేని మనిషే లేడు అందుకే రేపటి రోజున సంతోషం వస్తుంది అనే ఆశతో నవ్వుతూ జీవిద్దాం .

పిరికి వాడికి ఆపద కనిపిస్తుంది దైర్యవంతునికి అవకాశం కనిపిస్తుంది అపదలో ఆకాశాన్ని ఆయుధంగా మార్చుకుని జీవిత యుద్దంలో ముందుకు సాగే వారే విజయం సాధిస్తారు .

సేకరణ ✒️*మీ ...ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 🤝🌹💐

సేకరణ

No comments:

Post a Comment