365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో
♥️ కథ-46 ♥️
అనుభూతి : నా జీవితంలోని ప్రతీ ప్రేమపూరిత సంబంధానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను.
సంబంధాలలో పరివర్తన
ఉదయం నుంచి మా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనిఉంది. మా అత్తగారి మొహంలో మెరుపుకు, వంటింట్లోంచి వస్తున్న వంటకాల సువాసనకు - రెంటికీ ఒకటే కారణం. ఆమె స్నేహితురాలు ఈరోజు భోజనానికి ఇంటికి వస్తున్నారు. ఇల్లంతా అలంకరించబడుతోంది.
నిన్న సాయంత్రం మాట్లాడుకుంటున్నప్పుడు, ఆమె తన స్నేహితురాలు ఈ రోజు వస్తున్నట్లు చెప్పారు.అందుకని ఆవిడకి బహుమతి కొనడానికి మేం మార్కెట్‌కి వెళ్ళాం, అత్తయ్యగారు, తన స్నేహితురాలికి ఒక మంచి, ఖరీదైన చీరను కొన్నారు.
ఈ రోజు ఆమె మరొక స్థాయిలో ఉన్నట్లుగా అనిపిస్తున్నారు! అత్తయ్యగారు ఉదయాన్నే ఉత్సాహంగా లేచి, నా కంటే ముందే వంటగదిలోకి ప్రవేశించి, చాలా ప్రేమగా,ప్రయాసతో తాను ముందే అనుకున్నవంటకాలను ఒకదాని తర్వాత ఒకటి సిద్ధం చేయడం ప్రారంభించారు.
ఆమె నిజంగా సంతోషంగా కనపడుతున్నారు, కానీ నేను.... నా ముఖం మీద నకిలీ చిరునవ్వుతో, బరువెక్కిన హృదయంతో ఆమెకు సహాయం చేస్తున్నాను.ఈరోజు మా అమ్మగారి పుట్టినరోజు. నా పెళ్లయ్యాక, మా అమ్మకి ఇది మొదటి పుట్టినరోజు. నేనేమో ఇక్కడ ఉన్నాను, నాన్నగారు ఆఫీస్ టూర్లో ఉన్నారు, మా సోదరుడు విదేశాలలో ఉన్నాడు, ఆమెతో ఎవరూ ఉండరు.
నేను నా మనస్సును బలపరుచుకుని, ఎలాగైనా అమ్మ దగ్గరికి వెళ్లాలని నిన్న నిర్ణయించుకున్నాను. అదే నేను మా అత్తగారితో మాట్లాడబోయాను, కానీ నేను ఏమీ అనకముందే ఆమె తన స్నేహితురాలి గురించి చెప్తూ - మధ్యాహ్నం భోజనం, సాయంత్రం, అందరం ఆమెతో కలిసి ఫన్ సిటీకి వెళ్తామని చెప్పారు.
అప్పుడు ఇంక నేను ఏం అనగలను? నేను మౌనంగా ఉండి పనిలో పడ్డాను. ఆసక్తి లేకుండా, నేను ఇంటిని అలంకరించడం ప్రారంభించాను, నేను కూడా తయారయ్యి, సిద్ధంగా ఉన్నాను. కాసేపటికి, డోర్‌బెల్ మోగింది, అత్తయ్యగారు తన స్నేహితురాలిని స్వాగతించమని నన్ను పంపారు.
నేను తలుపు తెరిచేసరికి, పెద్ద పుష్పగుచ్ఛం వెనుక దాగిఉన్న ముఖం చూసేసరికి, నా కళ్ళు పెద్దవి చేసి, తెల్లబోయాను!
అక్కడ నా ఎదురుగా మా అమ్మ నిలబడి ఉంది. అమ్మ నాకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి, ఆశ్చర్యపరుస్తూ నన్ను పలకరించింది.
నేను ఆశ్చర్యంగా, ఆనందంగా అమ్మ వైపు చూస్తూ నిలబడిపోయాను. "నా స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పవా?" అని మా అత్తగారు వెనుక నుండి అన్నారు.
" అమ్మా....మీ స్నేహితురాలా?" ఆశ్చర్యంతో అడిగాను.
"అరే, నేనేమీ అబద్ధం చెప్పలేదు! మేం స్నేహితులుగా ఉండకూడదని ఎవరు చెప్పారు?" అన్నారు అత్తయ్యగారు. "తప్పకుండా ఉండగలం! ఇది తన కోడలిని కూడా కూతురిలా ప్రేమించే వారికి మాత్రమే సాధ్యం." అంటూ ఆవిడ వెళ్లి అమ్మని కౌగిలించుకుంది.
ఆనందంతో నాకు నోట మాటరాలేదు, నా కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. నేను అత్తయ్యగారి చేతులను నా చేతుల్లోకి తీసుకుని,వాటిని కళ్ళకద్దుకున్నాను,అరచేతులను ముద్దుపెట్టుకొని, ఆమెను కౌగిలించుకున్నాను.
మా అమ్మ మమ్మల్ని చూస్తూ చెమ్మగిల్లిన కళ్లతో నవ్వింది.
బాంధవ్యాల పండుగను ఎంతో ప్రేమగా జరుపుకుంటూ,
ఒకవైపు మా అమ్మ - నాకు సంబంధాల ప్రాముఖ్యతను నేర్పితే,
మరోవైపు, మా అత్తయ్యగారు - హృదయపూర్వకంగా వాటిని ఎలా కొనసాగించాలో నేర్పించారు.
వాళ్ళిద్దరూ నన్ను చూసి నవ్వుతూ నిలబడ్డారు, నాకు కలిగిన అదృష్టానికి గర్వంతో ఇద్దరి మధ్య నిలబడి ఉన్నాను - నా కళ్లలో నీళ్లతో, ముఖంపై చిరునవ్వుతో.
♾️
" ఆత్మగౌరవంపై దృష్టి పెట్టే బదులు, ఇతరులకు గౌరవం ఇవ్వడం గురించి ఆలోచించాలి." 🌼
దాజి
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
అనువాదబృందం ఆంధ్రప్రదేశ్
సేకరణ

No comments:
Post a Comment