Tuesday, December 14, 2021

మోక్షాన్ని ఎవరు ఇప్పించగలరు?

🍁మోక్షాన్ని ఎవరు ఇప్పించగలరు?🍁

✍️ మురళీ మోహన్

👉ఒక రాజు ఉన్నాడు. "భాగవతాన్ని విన్న వెంటనే పరీక్షిత్తుకు పరమపదం ప్రాప్తించిందని ఆయన తెలుసుకుని ఒక పండితుని తన ఆస్థానానికి పిలిపించుకుని భాగవత పారాయణ చెయ్యమని కోరాడు. రాజు ఏడు రోజులు నియమబద్ధంగా భాగవత కథను ఆలకించి పరిసమాప్తి చేశాడు.


మరుసటిరోజు పండితుని పిలిపించి
రాజు "స్వామీ! మీరు భాగవతాన్ని ఎంతో
శ్రద్ధగా విన్పించారు. నేను కూడా శ్రద్ధగా
విన్నాను. మరి నాకెందుకు ఉత్తమగతులు కలుగలేదు? అని ప్రశ్నించాడు. దానికి ఆ పండితుడు --


"ప్రభూ! మీ ప్రశ్నకు నావద్ద సమాధానం
లేదు. బహుశా నా గురువు మీ సందేహాన్ని తీర్చగలరు" అనగారాజ
సభకు గురువుగార్ని సాదరంగా రప్పించారు. మహారాజు ఆ గురువుకు
నమస్కరించి అతిధి సత్కారములు చేసి తన సందేహం ఆయన ముందు ఉంచారు. 'గురువర్యా! భాగవతాన్ని విన్నా నాకెందుకు ముక్తి కలుగలేదు?


గురువు రాజుతో-- "ప్రభూ! కాసేపు మీ
అధికారాన్ని నాకు ఇవ్వండి".అలాగే
నన్నాడు రాజు. ఇప్పుడు ఆ గురువే రాజైనాడు. రాజుగా మారిన గురువు వెంటనే రాజుగారిని మరియు పండితుణ్ని బంధింపజేసాడు.తర్వాత
పండితునితో " ఓయీ! నీవు రాజును
బంధవిముక్తుని చేయుము "అని ఆజ్ఞాపించాడు. దానికి పండితుడు
"ఆచార్యా! స్వయంగా నేెను బంధితుడనై ఉన్నాను. ఇక నేను మహారాజును ఎలా
విడుదల చేయగలను ?" వెంటనే గురువు
మహారాజుతో "రాజా! మీ ప్రశ్నకు సమా
ధానం లభించినదా? అడుగగా రాజు తనకర్థం కాలేదనగా గురువు తిరిగి ఇలా అన్నారు.


"రాజా! స్వయంగా బంధితుడైన వ్యక్తి
ఎదుటివారిని బంధాలనుండి తప్పించలేడు. అర్థమైనది కదా! అలాగే ముక్తుడు కానివాడు మరొకరికి ముక్తిని
ప్రసాదించలేడు. సిద్ధుడు, ముక్తసంగుడైన
వాడే శ్రద్ధాళువుకు ఉత్తమగతిని కల్పించ
గలడు. " అని వివరించాడు.


శుకమహర్షి వంటి ముక్తిసంగుడు, పరీక్షత్తు వంటి శ్రద్ధాళువు ఉన్నపుడే
ముక్తి లబించగలదని భావం.


నీతి:- జ్ఞానియైన గురువునకు శ్రద్ధగల శిష్యుడు సమకూరి నప్పుడే మోక్షం లభించగలదు.

సేకరణ

No comments:

Post a Comment