Friday, December 17, 2021

నేటి మంచిమాట. బంధాలు.

నేటి మంచిమాట.

నీటిని ఎక్కువగా మరిగిస్తే అవిరైపోతాయి అలాగే భరిస్తున్నారుకదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి సన్నిహితులారా..

అబద్దం అప్పు వంటిది, అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరీ కొన్ని అబద్ధాలు చెప్పక తప్పదు..

నిజం నిప్పు వంటిది, అది చెప్పే వాడి నాలుకకు చేదుగా, వినేవాడి చెవులకు మంటగా ఉన్న కూడా మంచే చేస్తుంది..

తప్పు మన మీద ఉంటే మనల్ని మించిన లాయర్ ఉండడు..తప్పు ఇతరులపై ఉంటే మనల్ని మించిన జడ్జి వుండడు..
తప్పు చెయ్యడానికి ఎవ్వరు భయ పడడం లేదు..చేసిన తప్పు బయట పడకుండా ఉండడానికి మాత్రమే భయపడుతున్నారు..

గెలవటం గొప్ప కాదు..ఓడిపోవడం తప్పు కాదు..మళ్లీ ప్రయత్నించకపోవడం అతి పెద్ద తప్పు..

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment