Tuesday, December 14, 2021

" ఋషభ నమక పరమాత్మ" తెలియపరిచిన విషయము " మహాత్ములు" అంటే ఎలా ఉండాలి?

🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🚩" ఋషభ నమక పరమాత్మ" తెలియపరిచిన విషయము " మహాత్ములు" అంటే ఎలా ఉండాలి?

🙏🏽" సమర్పణ: "Mazumdar Bangalore" 87925-86125.
🌹🌹🌹
🚩" జగత్ప్రభువునైన నా ప్రీతి, నా స్నేహమే ప్రయోజనము గా కలిగి ఉండి, ఇంకే ఆపేక్ష ఎవరికి ఉండదో; భార్య-- సంతానము-- బంధువులు-- ఐశ్వర్యము -- గృహము అంతస్తు -- ఆస్తి--, ఇలాంటి వేటి పైన ఆసక్తి ఎవరికి ఉండదో; ఎవరు అవసరమైనంత వరకే లోక వ్యవహారం చేసి, మిగిలిన ఏ వ్యవహారములందు ఆసక్తి చూపకుండా తమ సాధనను చేసుకొందురో- అట్టివారు "సజ్జనులు."

🙏🏽" సదా "పరమాత్ముని" ధ్యానము చేయు వారు,
ప్రశాంత చిత్తము కలిగి, క్రోధము లేనివారు, సకల ప్రాణుల యందు మమత, అనురాగము,దయ గల వారు, అందరికీ మంగళకరమగు కార్యములను చేయువారు. అట్టివారు మహాత్ములు, వారి సేవ చేయండి. మహాత్ముల సేవ చేసినచో వారికి "ముక్తి" కి మార్గమును చూపించెరు.

🙏🏽" నా యందు" భక్తి" ఉంచండి. దేహమే నేను'అను బుద్ధి ఉండరాదు. దేహము నాది కాదు అని తెలుసుకోండి. గురువుల యందు భక్తి ఉంచండి. దేహమే నేను' అను బుద్ధి ఉండరాదు. దేహము నాది కాదని తెలుసుకోండి. నేను ఈశ్వరుని భక్తుణ్ణి,. నాకు ఈశ్వరునికి ఉన్న సంబంధమే నిత్యము,. అది అనాది మరియు అనంతమైనది. ఇతరులతో వున్న సంబంధము నిత్యము కాదు. మిగతా ఏది శాశ్వతము కాదు. దేహము నశ్వరము. ఏదో ఒక రోజు విడిచి వెళ్లాలి " అని తెలుసు చేసుకోవడం ముఖ్యము.

🙏🏽" ఇది దృఢముగా గుర్తుంచుకోండి. లౌకిక విషయ అన్నిటిలోనూ దుఃఖము ఉన్నది. భగవంతుని ఉపాసన చేసినప్పుడు మాత్రమే మనుష్యుడు దుఃఖం నుండి విముక్తి పొందుట సాధ్యము.

🙏🏽" భగవంతుని సేవ లోనే మనస్సు దృడమౌతుంది. నిరంతరమూ నా సేవ చేస్తూ, హరికథా శ్రవణం చేస్తూ, భగవత్ భక్తుల సాంగత్యము నందు మీరు ఉన్నచో క్రమముగా జ్ఞానోదయం అవుతుంది.
అటుపిమ్మట ఈ లింగ శరీరము భంగమై, మోక్షమును పొందగలరు.

🙏🏽" జగత్తు లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ,చేతన అథవా అచేతన, అన్నియు నా ప్రతిమ / అధిష్ఠానము అని గుర్తుంచుకో; అన్నిటిలోనూ నేను ఉన్నానని చింతన చేయండి. ప్రకృతిలోని సూర్య-చంద్ర -నక్షత్రములు -అన్నిటిని నా అధిష్టానం అని భావించండి. ప్రతి చేతను డు నా అధిష్టానమే. ఆయా వస్తువులకు ఈయవలసిన గౌరవం ఇస్తూ, లోపల ఉన్న నా యందు భక్తిని చూపండి.

🙏🏽" సూర్యుని కాంతియు
పరమాత్ముని ప్రకాశమే అని తెలుసుకోండి. జగత్తు నందు వెలుగు శక్తి-- వేడి చేయు శక్తి-- పక్వము చేయు శక్తి-- నీరు సృష్టి యగుట-- సౌర శక్తి-- ఆకర్షించు శక్తి-- ఆ అన్ని శక్తులు కూడా- ఆయా వస్తువుల్లో నారాయణుడు ఉండి కలిగిస్తున్న శక్తులు అని తెలిసు కోండి.

🙏🏽" మనుష్యుల్ని లోని మేథా శక్తి, పరమాత్మ ప్రసాదించిన శక్తియే, ఒక్కొక్క మనుషునికి, ఒక్కొక్క మనస్సును పరమాత్మ ప్రసాదించాడు.
అది అనాది నుండి అతని వెంటనే ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియములను-- పంచ కర్మేంద్రియములు- లను ఇచ్చినాడు.

🙏🏽" దేహము పోయిన మనసు,/ఇంద్రియములు జీవుని తోటే ఉంటాయి.
మరో జన్మలో కూడా అవి మన వెంటనే ఉంటాయి.
దేహములో కనపడు బాహ్యా గోళకములు వేరు,
ఇంద్రియములు వేరు, అనాది కాలము నుండి ముక్తి దొరకు వరకు ప్రతి ఒక్క జీవికి ఆ ఇంద్రియములు ఆ జీవి వెంటనే వుంటాయి.


🙏🏽" బయటకు కనబడు కన్నులు ఇంద్రియము కాదు. అది గోళకము, లోపల మనిషి యొక్క చక్షువు ఇంద్రియములు ఉంటుంది. బయట కనపడు చెవి వేరు, లోపల శ్రవణ ఇంద్రియం ఉంటుంది. అలాగే అన్ని ఇంద్రియములు కూడా!

🙏🏽" మన అందరి శక్తియే ఇంతటి శక్తి గలది అయితే,
బ్రహ్మదేవుడు ,వాయు దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి.
వాయుదేవుడు అనంత జీవుల చేత 14 లోకములందు అనంత కర్మలను చేయించాలి. వారి పాపములను తగ్గించి, సత్కర్మల ఫలములను ఇవ్వవలసిన బాధ్యత వాయుదేవుని ది. ఇంత అద్భుతముగా జగత్తు నిర్మాణము చేసిన భగవంతుని మహిమ ఎంత గొప్పదో ఊహించుట అసాధ్యము కదా!

🙏🏽" జీవులు చేయు సకల కార్యములను నా "పూజ" అని తెలుసుకోండి.🚩
🙏🏽" నేనే జీవులు అని మాత్రము తెలియక కండి.
జగత్తులో ఉన్న జడ వస్తువులు నేనే అని తెలియక కండి.🚩
🙏🏽" అన్నిటిలోనూ నేనే ఉన్నాను అని మాత్రమే అనుకోండి. అడుగడుగున జీవునికి- పరమాత్మ నికి భేదము ఉన్నది. పరమాత్మ సర్వోత్తముడు; "జీవునికి- పరమాత్మ "కు బేధము ఎవరు తెలుసుకుంటారో- వారు "ఉత్తములు".
జీవుడు పరమాత్మ ఆదీనుడు - అని ఎవరు తెలుసుకుంటారో, వారు నా నిజమైన భక్తులు. వారి యందు నాకు అత్యంత ప్రీతి.- అని భగవంతుని రూపమైన
" వృషభ పరమాత్మ" భరతుడు అందరి పుత్రులను కూర్చోబెట్టి తత్వోపదేశం ఇచ్చినారు. ఆ ఉపదేశము మన కొరకే, అని భావించి ఆ ఉపదేశించినది, నేడు ద్వైత సిద్ధాంతాన్ని అవగాహన కొరకు "శ్రీమద్వాచార్యులు" అందించినారు.

🚩" పై విషయములను
చదివి అర్థం చేసుకుని, మెలగండి. లేనిచో చెవిటి వాని ముందు" శంఖం" ఊదటం, మరియు గుడ్డివారికి "అద్దం" ఇవ్వటము వలే ఉంటుంది. ఈ నా ప్రయత్నం. పూర్వజన్మ సుకృతం లేకుంటే వారికి అరణ్యరోదనగా ఉండవచ్చు. అందుకే మన భాగవతం చెబుతోంది పొందే వారి యోగ్యతను బట్టి ఉంటుంది. వారి "ప్రారబ్ద కర్మ" పైన ఆధారపడి ఉంటుంది కూడా! ఎవరిని నిందించే పని, అవసరం లేదని గుర్తుంచుకోండి.
🚩🚩🚩🚩🚩🚩🚩

సేకరణ

No comments:

Post a Comment