Tuesday, December 14, 2021

మహాలయామావాస్య సంకల్పం

మహాలయామావాస్య సంకల్పం


అమావాస్య రోజున మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంకల్పం చెప్పుకుంటే మంచిది .

🌻🌻🌻🌻🌻🌻 🌻
------------------------------------

మీ గోత్రం ..

మీ పేరు చెప్పుకొని...

నా జన్మకు మూల కారణమైన నా తల్లి - దండ్రులకు నా యొక్క అనంతకోటి నమస్కారములు.అలాగే నా తల్లి - దండ్రులకు మూలమైన తాతలకు , ముత్తాతలకు అనంత కోటి ప్రణామములు .

సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకూ ఈ వంశ పరంపరల్లో జన్మించిన పూర్వీకులైన వారందరికీ అనంతకోటి నమస్కారములు .

ఎందరో యోగులు, మహాత్ములు, పుణ్యాత్ములైన మీ అందరి యొక్క సంస్కార బలం నాలో ప్రవేశించి , నేను ఇంతటి గొప్ప జ్ఞానంతో కూడిన జీవితాన్ని పొందియున్నాను. ఈ వంశంలో జన్మించినందుకు నేను ఎంతగానో గర్వించు చున్నాను . మీలో ఉన్న సద్భావాలు నాలో ప్రవేశించి లోక హిత కార్యాలు చేసేటటువంటి శక్తిని ప్రసాదించండి . ఈ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆ చంద్రార్కము అవనిలో విలసిల్లునట్లుగా ఆశీర్వదించండి .

నాలోనూ , నా కుటుంబ సభ్యుల లందరిలోనూ ఉన్నటువంటి దోషాలను తొలగించి , క్షేమ , స్థైర్య , ధైర్య , విజయ ,అభయ , ఆయుః , ఆరోగ్య , ఐశ్వర్య ముల నొసగి , ధర్మార్ద , కామ , మోక్ష ముల నొసగి , అహం పదార్ద రహిత స్తితి కలిగేటట్లుగా దీవించి నా జన్మ ధన్యత చేకూర్చగలరని కోరుతూ

అష్ట వసువులు , ఏకాదశ రుద్రులు , ద్వాదశ ఆదిత్యులు ,త్రిమూర్తులు , త్రిమాతలు , అష్ట దిక్పాలకులు , నవ గ్రహాలు , సమస్త సద్గురువులు మరియు సమస్త దేవతా మూర్తుల యొక్క ఆశీస్సులను కోరుతూ నా యొక్క అనంత కోటి నమస్కారములు సమర్పించుచూ మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్ధిగా , ఈ మహాలయ అమావాస్య రోజున సంకల్పం చేసి పెద్దలందరికీ నమస్కరించు చున్నాను .

💐🕉 జైగురు 💐
శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి.

సర్వం పరమాత్మ పాదార విందార్పణమస్తు

🙏🙏🙏🙏🙏🙏

సేకరణ

No comments:

Post a Comment