Tuesday, December 14, 2021

ధ్యానం 2 - {గ్రంథం : సత్యదర్శనం}"*_ _*"శ్రీరమణమహర్షి - శ్రీజిడ్డు కృష్ణమూర్తి గారల బోధనల్లోని ఏకాత్మతా విశ్లేషణ !"*

సత్యదర్శనం -(134)
🕉🌞🌎🌙🌟🚩

"ధ్యానం" [2]

✍️ మురళీ మోహన్

🤘మనసుకు ఎటువంటి నిర్బంధం లేనప్పుడు అంటే కోరికలు లేనప్పుడు స్వేచ్ఛగా ఉంటుంది. మనసుకు తన్నుతాను గమనించుకునే శక్తి కూడా ఉంటుంది. పునశ్చరణలో, అనుభవాల్లో మనసుకు తనను గమనించే శక్తి క్షీణించిపోతుంది. అంటే మనసు తానుఉన్న స్థితికాక తనలో ఉన్నదాంతో ప్రయాణిస్తూ తన సహజగుణం [గమనించేశక్తి] పోగొట్టుకుంటుంది. నిరంతరాయంగా ఉండే సహజస్థితిని గమనించలేకపోతుంది. మనసులో ప్రతిఘటన ఉంటే అవగాహన ఉండదు. ఇక్కడ అవగాహన అంటే వాస్తవిక [ఒరిజినల్ స్థితి] స్థితి. అది క్రమశిక్షణవల్ల రాదు. క్రమశిక్షణ ద్వారా ఏకాగ్రతను, దానివల్ల విషయాలతో వచ్చే సంతోషాన్ని పొందగలుగుతామేమోగానీ అవగాహన రాదు. ప్రతి మనో కదలికను సూటిగా చూడటం అలవర్చుకుంటే అవగాహన కలుగుతుంది. అది లేకుండా మనసులోని ఆశ, కోపం ఇత్యాది విషయాలను గమనించినప్పుడు అవి ఉన్నాయని తెలుసుకుని అణచివేసే ప్రయత్నం చేస్తాంగానీ వాటిని అర్థం చేసుకోలేము. స్వేచ్ఛపొందిన మనస్సు విషయాలను అవగాహన చేసుకుంటుందిగానీ అణచివేసే ప్రయత్నం చేయదు !!

"{గ్రంథం : సత్యదర్శనం}"
"శ్రీరమణమహర్షి - శ్రీజిడ్డు కృష్ణమూర్తి గారల బోధనల్లోని ఏకాత్మతా విశ్లేషణ !"

🕉🌞🌎🌙🌟🚩

సేకరణ

No comments:

Post a Comment