అందరూ చదవాల్సిన చక్కని కథ.
ఎన్నో కష్టాల మీద కష్టాలు అనుభవిస్తున్న ఒక గురువు గారిని తన శిష్యుడు గమనిస్తు
గురువు గారు అనుభవిస్తున్న కష్టాలను చూసి బాధ పడుతూ వుంటాడు
ఒక రోజు ఒక అగ్ని ప్రమాదం లో
గురువు గారి ఆశ్రమం అంత ఏమి
మిగలకుండ అంతా కాలి బూడిద
అయి పోతుంది
అప్పుడు శిష్యుడు కి ఒక సందేహం వచ్చి గురువు
గారిని ఇలా ప్రశ్నిస్తాడు
గురువు గారు మీరు ఎన్నో కష్టాలు
అనుభవిస్తున్నారు ఇది నేను చూస్తున్నాను
మీ లాగే ఎందరో గురువులు వారు కూడ
మీలాగే ఎన్నో కష్టాలు అనుభవించారు
జీసస్,సోక్రటీస్,కబీర్,బుద్దుడు ఓషో,రాముడు,కృష్ణుడు,సత్య హరిశ్చంద్రుడు,ఇలా, ఇంకా ఎందరో మహానుభావులు అందరు కూడ ఎన్నో కష్టాలను చవి చూశారు కదా
అయితే నాకు వచ్చిన సందేహం ఏమిటంటే
మీ గురువులు అందరు కూడ ధర్మం లో ఉండండి ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని
అంటుంటారు
మరి ఈ గురువులు అందరు కూడ
దర్మంగానే ఉన్నారు కదా మరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు అనుభవించారు అని ప్రశ్నిస్తాడు
ఈ ప్రశ్నవిన్న గురువు గారు శిష్యుడు కి ఇలా సమాధానం ఇస్తారు
నువ్వు గురువులు అందరు ఎన్నో
కష్టాలు అనుభవించారు అని నువ్వు అనుకుంటున్నావు కానీ
వాటిని అనుభవించిన గురువులు మాత్రం వాటిని పరీక్షలు అనుకున్నారు
భౌతిక సుఖo కోసం ఆరాట పడే
వారు సహనం తో ఉండలేరు
ఎవరైతే సహనం తో ఉండరో వారు
ఎప్పుడు సత్యాన్ని చూడలేరు, చేరుకోలేరు
మనలో సహనాన్ని పెంచేవి జీవిత పరీక్షలు మాత్రమే
మనం ఎన్ని పరీక్షలు అయితే ఎదురుకుంటామో మనలో అంత సహనం పెరుగుతుంది
మనం ఎంత సహనాన్ని పెంచు కుంటామో అప్పుడు మనం అంత సత్యాన్ని చూడగలుగుతాము , చేరుకొగలుగుతాము
అందుకే గురువు లలో సహనాన్ని పెంచడం కోసమే
ప్రకృతి గురువులకు పరీక్షలు ఇచ్చి వారిలో ఎంతో సహనాన్ని పెంచి
వారికి సత్యాన్ని చూపి వారిని మహానుభావులను చేసింది
కాబట్టి మనకు వచ్చే పరీక్షలను
పరీక్షలు అని కూడ అనుకోకండి అవి మనలో
సహనాన్ని పెంచి సత్యానికి చేర వేసే వారధిలు అనుకోండి
సేకరణ. మానస సరోవరం 👏
No comments:
Post a Comment