తలంబ్రాలుగా బియ్యమే ఎందుకు గోధుమలు వాడొచ్చు కదా !
...............................................................
వరుడు వధువును ఉద్దేశించి
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం.
నా బంగారుజీవితానికి సుఖ సంసారానికి కారణమైతున్న ఈ శుభసూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. నువ్వు సుమంగళిగా నిండు నూరేళ్ళు జీవించాలి.
ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి.
ధర్మ నిర్వహణలోకాని సంపదలు పొందినపుడు కాని, సంసారిక జీవితాన్ని గడపడంలో కాని, చివరకు మోక్షము పొందుటలో కాని నేను నిన్ను విడువనని ప్రమాణం చేస్తున్నానని అంటాడు.
మాంగల్యధారణ అనంతరము తలంబ్రాలు పోసుకోవడం మన ఆచారం, సాంప్రదాయం.ఇందులో ఎంతో పరమార్థాన్ని పరాశరుడిలాంటి స్మ్రతికారులు ఏర్పాటుచేశారు. తలంబ్రాలనే అక్షతావరోహణం అంటారు. అక్షతలు లోని అక్షత అంటే క్షయం లేనిది, నాశనంకానిదని అర్థం. తలను + ప్రాలు = తలంబ్రాలు. ప్రాలు = బియ్యం.
అక్షతలకు కాని తలంబ్రాలకు కాని బియ్యాన్నే ఎందుకు వాడాలి ? జొన్నలు, రాగులు, సజ్జలు, బార్లీ, గోధుమలు వంటి ఇతర ధాన్యాలను ఎందుకు వాడకూడదు ?
పసుపుతో కలిసిన బియ్యం శుభానికి సూచన.జొన్నలు, రాగులు, సజ్జలు, బార్లీ, గోధుమలు వంటి ధాన్యాలను కల్లము (త్రెష్షింగ్ ప్లోర్) నుండి ఇంటికి తెచ్చుకొని అవసరమున్నప్పుడు దంచుకొని, లేదా విసురుకొని లేదా నూరుకొని వంట చేసుకొని తింటాము, అంటే ధాన్యాన్ని ప్రత్యక్షంగా తింటామన్నమాట.(Direct Consupmtion) బియ్యము కావాలంటే వడ్లను దంచి, బియ్యాన్ని తయారు చేసుకొని, ఆ
బియ్యాన్ని మరల దంచుకొని లేదా విసురుకొని లేదా నూరుకొని తినాలి, అంటే శ్రమించి అన్నాన్ని చేసుకోవాలి.అలాగే దాంపత్యజీవితంలో కూడా జీవించటానికి శ్రమ అవసరము. శ్రమకు గుర్తుగా బియ్యాన్ని ఉదాహరించడం జరిగింది.
తలంబ్రాలు పోసుకొనే సమయంలో వధూవరులు ఎంతో ఉత్సాహంతో తలనిండుగా బియ్యం (తలంబ్రాలు) పోసుకొంటారు. దంపతుల జీవితములో అన్నం నిండుగా ఉండాలని, సమృద్ధిగా దొరకాలని జీవితాంతం ఎంతో ఉత్సాహంగా గడపాలని సింబాలిక్ గా చెప్పడమే తలంబ్రాల తంతు ముఖ్యోద్దేశ్యము.
పురోహితుడు వధువు దోసిట్లో తలంబ్రాలు పోసి ఆపై నేయ్యిని విదిలించి, వరుడి దోసిలిలో (అంజలిలో) అక్షతలు పోసి, నేయిని చిలకరించి వధువు అంజలి కింద వుంచుతాడు. తరువాత ప్రజాపతి స్త్రీ యాంయశ: కామస్య తృప్తిమానందం తస్యాగ్నే హమ అని మంత్రం చదువుతూ వధువు శిరస్సుపై తలంబ్రాలు జారవిడవాలి.అలాగే వధువు కూడా వేదమంత్రాలను పఠిస్తూ తలంబ్రాలను వరుడు తలపై పోయాలి.
తలంబ్రాల తంతు తరువాత పాణిగ్రహణం వుంటుంది. ఈ కార్యములో వరుడు వధువును అగ్నిగుండము దగ్గరకు తీసుకు వెళ్ళి ప్రధానహోమము చేస్తాడు. వరుడు తన కుడిచేత ( బోర్లించిన విధంగా అంటే అరచేయి కిందకు ఉండేలా) వధువు యొక్క కుడిచేతిని పట్టుకొంటాడు. వధువు కుడి అరచేయి ఆకాశంవైపు చూస్తూవుండాలి) దీనినే పాణిగ్రహణమంటారు.
ఆడపిల్ల సంతానము కావాలంటే వరుడు వధువు యొక్క నాలుగు వేళ్ళను, పురుష సంతానం కావాలంటే బొటనవేలిని పట్టుకోవాలి, ఇద్దరు కావాలంటే అన్ని వేళ్ళను పట్టుకోవాలి.
/సేకరణ /
...................
No comments:
Post a Comment