Friday, October 28, 2022

శ్రేయో భూయాత్ సకల జనానాం

271022b2306. 281022-2.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀279.

శ్రేయో భూయాత్ సకల జనానాం
➖➖➖✍️

ఇది జగద్గురు శంకరాచార్య శ్రీచంద్రశేఖర సరస్వతి స్వామి వారు రాసిన ‘మైత్రీం భజత’ అనే పాట చివరి పాదం. దీని అర్థం ‘ప్రపంచంలోని ప్రతి ప్రాణి ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి’ అని కాంక్షించడం.

1996లో ఐక్యరాజ్య సమితి 50వ వార్షికోత్సవం సందర్భంగా కర్ణాటక సంగీత సమ్రాజ్ఞి, భారతరత్న శ్రీమతి యమ్.యస్. సుబ్బులక్ష్మి గారిని కచేరి ఇవ్వమని ఆహ్వానం పంపారు. ఆమె ఈ విషయం పరమాచార్య స్వామివారికి తెలిపి ఆశీస్సులు అందుకోవడానికి వచ్చినప్పుడు స్వామి వారు సంస్కృతం లో ఈ పాటను రాసిచ్చారు. ప్రపంచ శాంతిని, మత సామరస్యాన్ని ప్రతిబింబించే ఈ పాటను అక్కడ పాడటం ప్రతి భారతీయుడికి గర్వకారాణం.

పరమాచార్య స్వామివారు ఇచ్చిన ఆ పాట, దాని భావం...

“మైత్రీం భజత, అఖిల హృత్ జైత్రీం | స్నేహము, వినయంతో ప్రవర్తించి అందరి హృదయాలను గెలువు.
ఆత్మవదేవ పరాన్నపి పశ్యత | అందరినీ నీలాగే(సమానంగా) చూడు.
యుద్ధం త్యజత, స్ఫర్ధాం త్యజత | యుద్ధాన్ని త్యజించు, అధికారం కోసం పోటీపడడం త్యజించు.
త్యజత పరేషు అక్రమఆక్రమణం || వేరేవారి ఆస్తులను ఆక్రమించాలనే దుర్భుద్ధి త్యజించు.

జననీ పృథివీ కామదుహాస్తే | కామధేనువు వంటి భూమాత నీ కోరికలన్నీ తీరుస్తుంది.
జనకో దేవః సకల దయాళుః | భగవంతుడు..మన తండ్రియై అందరిని కరుణిస్తాడు.
'దామ్యత, దత్త, దయధ్వం' జనతా | నిన్ను నువ్వు అదుపులో ఉంచుకో; నీ ఆస్తి పదుగురికి పంచు;

వేరేవారిపట్ల దయతో ఉండు; ప్రపంచ జనులారా!
శ్రేయో భూయాత్ సకల జనానాం || ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి.
శ్రేయో భూయాత్ సకల జనానాం || ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి.
శ్రేయో భూయాత్ సకల జనానాం || ప్రపంచంలో ప్రజలందరూ ఆనందంగా సుసంపన్నంగా ఉండాలి.

సర్వ మానవాళి సంక్షేమమే పరమాచార్య స్వామి వారి లక్ష్యం.

ఈ పాటను, ప్రతి పంక్తిని శ్రద్ధగా పరిశీలిస్తే మీకు బోధపడుతుంది... “దామ్యత”, “దత్త”, “దయధ్వం” లోని మూడు “ద”లను మనిషి ఎన్నటికి మరువరాదు.

ప్రపంచ దేశాల ప్రతినిధులందరికి దీన్ని అనువదించి ఇవ్వడం జరిగింది. యమ్.యస్. అమ్మ, ఐక్యరాజ్య సమితిలో ఈ పాట పాడగానే దాని భావానికి అందరి మనస్సులు కరిగిపోయాయి. వారి గాత్ర మాధుర్యానికి తన్మయత్వానికి లోనై, సారాన్ని అర్థం చేసుకున్న ఎంతోమంది ప్రతినిధులు కళ్ళనీళ్ళు కారుస్తూ ఉండిపోయారు.

అరోజు ఆవిడకి గొంతు బాగాలేక సరిగ్గా ఊపిరి కూడా తీయని పరిస్థితిలో ఉన్నారు. కచేరి ఎలా చేయడమా అని భయపడుతూ పరమాచార్య స్వామిని ప్రార్థించగా, పాడడం ప్రారంభించగానే గొంతు సరిఐపోయి అత్యంత మాధుర్యంగా కచేరి చేసారు. పరమాచార్య స్వామి వారిగురించి అమ్మ మాటల్లో, మరియు ఆ కచేరి ఈ క్రింది వీడియోలో...

https://www.youtube.com/watch?v=y7uijcWK1mQ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సేకరణ

No comments:

Post a Comment