Monday, October 24, 2022

మన జీవితంలో వెలుగులు (నేడు దీపావళి సందర్భంగా....)

 మన జీవితంలో వెలుగులు

(నేడు
దీపావళి సందర్భంగా....)
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

🪔 మన జీవితం లో 'అంధకారం'... అనేది మన 'అఙ్ఙానముకు' మరియు మన 'నిరాశకు' చిహ్నం..

అలాగే..  

🪔 వెలుగు అనేది మన 'ఙ్ఞానానికి' మరియు మన జీవితంలో 'ఆనందానికి' చిహ్నం.

🪔 అఙ్ఞానమనే చీకటి నుంచి... ఙ్ఞానమనే వెలుగులోకి ప్రయాణించడమే ‘దీపావళి’ పండుగలోని అంతరార్ధం.

🪔 *‘దీప’ అంటే దీపము....‘ఆవళి’ అంటే వరుస...
దీప + ఆవళి అంటే.. దీపాల వరుస అని అర్ధం...

🪔 దీపం ఐశ్వర్యం అయితే..‌. అంధకారం దారిద్ర్యం .... దరిద్రాన్ని పారద్రోలి,  ఐశ్వర్య మార్గంలోకి ప్రయాణిచడమే  ‘దీపావళి’ పండుగ...

🪔 ‘దీపం’ త్రిమూర్తి స్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి.

‘ఎర్రని’ కాంతి బ్రహ్మదేవునికి..,
‘నీలి’ కాంతి శ్రీమహావిష్ణువుకి..
‘తెల్లని’ కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు.

సాజ్యం త్రివర్తి సంయుక్తం - వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం - త్రైలోక్య తిమిరాపహం
భక్త్యా దీపం ప్రయచ్ఛామి - దేవాయ పరమాత్మనే
త్రాహిమాన్నరకాద్ఘోరాత్  - దివ్య జ్యోతిర్నమోస్తుతే

🪔 ఏ దీపమైనా మూడు వత్తులు వేసి వెలిగించాలి గానీ.. ఒక వత్తు దీపం.... రెండు వత్తుల దీపాలు... వెలిగించరాదు.

‘మూడు వత్తుల దీపం.. గృహానికి శుభాలు చేకూరుస్తుంది...

ముల్లోకాలలోని అంథకారాన్ని పారద్రోలి లక్ష్మీ నిలయంలా చేస్తుంది.  నరకం నుంచి రక్షిస్తుంది.

🪔 దీపం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం. అటువంటి దీపాన్ని...  ఆవు నేతితోగానీ.. నువ్వుల నూనెతోగానీ...  భక్తిగా వెలిగించాలి...

మరెంతో భక్తిగా నమస్కరించాలి అని పై శ్లోకం అర్థం. 

🪔  దీపం - లక్ష్మీ స్వరూపం.

దీపం ఉన్నచోట  సర్వసంపదలు తాండవిస్తాయి...  ఆనందాలు వెల్లివిరుస్తాయి...  సుఖ, సంతోషాలు చోటు చేసు కుంటాయి..

అందుకే నిరంతరం మన పూజామందిరంలో దీపం వెలుగుతూండాలనే నియమం పెట్టారు...

🪔 దీపం..  విజయానికి చిహ్నం...

అందుకే పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే సైనికులకు, రాజులకూ విజయతిలకం దిద్ది విజయహారతులిచ్చి పంపేవారు...

🪔 నిజానికి ‘దీపాన్ని’ మట్టి ప్రమిదలోనే
వెలిగించాలి... మట్టి.., ఉష్ణాన్ని తనలో లీనం చేసుకుంటుంది. అందుకే ఎంతసేపు వెలిగినా మట్టి ప్రమిద వేడెక్కదు.

💫 మనం ఆర్భాటం కొద్దీ ఉపయోగించే  వెండి,  ఇత్తడి,  రాగి,  కంచు ప్రమిదలు..  దీపం వెలిగించిన కొద్దిసేపటికే వేడెక్కి పోతాయి..  ఆ వేడిని భూమాత భరించలేదు..  కనుకనే వట్టి నేలపైన దీపం వెలిగించరాదు.

🪔 ప్రమిదలో ప్రమిద వేసి మూడు వత్తుల దీపం వెలిగించాలి.

✅ ఇది సాంప్రదాయం.

✅👉 మానవదేహం మట్టి
నిర్మితం. అందుకే  మనం ఎంత నలుగు పెట్టుకుని రుద్దినా.,  ఎన్ని సబ్బులు అరగదీసినా., ఎన్ని షాంపూలతో స్నానం చేసి వచ్చినా..,  మన దేహంపై ఎక్కడ రుద్దినా కాస్తో కూస్తో మట్టి రాలుతుంది. గమనించండి.

🪔 ఈ మానవదేహం ఓ మట్టి ప్రమిద. ఈ ప్రమిదలో జ్యోతి రూపంతో భాసిల్లేవాడే ‘పరమాత్మ’.

🪔 ఆ జ్యోతి ఈ మానవ ప్రమిదలో వెలుగుతున్నంత సేపు  ఈ దేహం చైతన్యవంతంగా, ప్రాణంతో ఉంటుంది.  దీపం లేని ప్రమిదకు విలువ ఉండదు.

🪔 అందుకే మనిషి మరణించిన తర్వాత ఆ పార్థివదేహం తల దగ్గర ఒంటి వత్తు దీపం వెలిగిస్తారు. ఈ దేహంలోని జ్యోతి బయటకు వెళ్లిపోయింది అని తెలియ చెప్పడానికి ఆ దీపం నిదర్శనం.

🪔👉 ఇక్కడ మాత్రం ఒంటి వత్తు దీపాన్నే వెలిగించాలి.
కారణం..   ‘ఏకో పరాత్మా బహుదేహ వర్తిః’

దేహాంతర్గతుడైన పరమాత్మ ఒక్కడే. ఇది వేదాంతార్థం.

💫 ఇక.. అగ్నిదేవుని రూపమే ఈ దీపం. మన హైందవధర్మానికి మూలస్తంభాలు నాలుగు వేదాలు.  అందులో తొలివేదం.. ‘ఋగ్వేదం’.

‘అగ్నిమీళే పురోహితం యఙ్ఞస్య దేవమృత్విజమ్ హోతారం రత్నధాతమమ్’

ఇది ఋగ్వేదంలోని తొలి ఋక్కు. ఈ ఋక్కుతోనే వేదం ప్రారంభమవుతుంది. అంటే...

🪔 తొలిసారిగా కీర్తించబడిన తొలి దేవుడు ‘అగ్ని’. అంటే ‘జ్యోతి స్వరూపం’.  ఈ జ్యోతి స్వరూపమే పురహితాన్ని కోరే తొలి పురోహితుడు.. ఋత్విక్కుడూను. 

🪔 మన జీవితంలోని  మంచి, చెడులలో మనకు తోడుగా ఉంటూ, మార్గ దర్శకత్వం వహించేది ఈ జ్యోతి ఒక్కటే.  కనుక ఆ ‘జ్యోతి' ని ఉపాసించడం., ఆరాధించచడం  మన ధర్మం.

🪔 నరకాసుర సంహారంతో  సకల లోకాలు కష్టాల  అంథకారంలోంచి  సంతోషమనే వెలుగులోకి వచ్చాయి. అందుకే నరకచతుర్దశి నుంచే.. మన సుఖ,  సంతోషాలను వ్యక్తం చేయడానికి నిదర్శనంగా దీపాలు వెలిగించాలి.

ఆ వెలుగులో.... మన జీవితం.. మన కుటుంబం... మన నవసామాజిక సమాజం పయనించాలి.

ఈ దీపావళి పండుగ రోజున మీకు.. మీ కుటుంబానికి...  సకల దేవతల ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ... దీపావళి శుభాకాంక్షలు...🙏🏻🙏🏻


🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

No comments:

Post a Comment