Monday, October 24, 2022

నేటి మంచి మాట, మన చేత, మన వల్ల”ప్రత్యక్షంగా,పరోక్షంగా ఓ 10 మందికి”మంచి జరిగితే, మన ఈ జన్మ సార్థకమయినట్లే.

 నేటి మంచి మాట

సత్యం, ధర్మం,శాంతి,
ప్రేమ,అహింస లను
పాటించడమే "మహా ఔషధంగా" భావించాలి.
విస్తరాకు ;విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగాఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటారు. 
బోజనము తినే వరకు ఆకుకు మట్టిఅంటకుండా జాగ్రత్త వహిస్తాము,
తినిన మరుక్షణం ఆ విస్తరాకును మడిచి, దూరంగా మురికి పెంటపై పడేసి వస్తాము.తర్వాత ఆ ఎంగిలి ఆకును ముట్టుకోము కూడా.
మనిషి జీవితం కూడ అంతే .“ఊపిరి" పోగానే ఊరిబయట పారేసి వస్తారు . విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు “ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను”అన్న తృప్తి ఆకుకు ఉంటుంది,విస్తరాకుకు ఉన్న”ముందు ఆలోచన", తృప్తి భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ! సేవ చేసే అవకాశము వచ్చినపుడు సేవచేయండి"జారవిడుచుకోకూడదు”. మళ్లీ ,
ఇంకొకసారి, ఎప్పుడో చేయవచ్చుఅనుకొని వాయిదా వేయకండి, 
ఆ అవకాశము మళ్లీ వస్తుందనీ అనుకుంటే..,
కుండ ఎప్పుడైనా పగలవచ్చు, అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.
ఎంత సంపాదించి ఏమి లాభం ?ఒక్క పైసా కూడా తీసుకు పోగలమా?
మన చేత, మన వల్ల”ప్రత్యక్షంగా,పరోక్షంగా ఓ 10 మందికి”మంచి జరిగితే, మన ఈ జన్మ సార్థకమయినట్లే.

శుభోదయం చెప్తూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment