Tuesday, October 25, 2022

ఊహ:-

 ఊహ:-

అన్నీ సంబంధాలు ఊహ జనితాలే. ఎందుకు అంటే ఎప్పుడైతే నీ నుంచి నువ్వు బయటకి వస్తావో అప్పుడు కేవలం ఊహ అనే తలుపు గుండా వెళతావు. అక్కడ ఇంకో తలుపు లేదు. 

మిత్రుడు, శత్రువు ఇద్దరూ నీ ఊహల్లోని వారే. నువ్వు ఊహించడం పూర్తిగా మానేస్తే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. కేవలం ఒంటరిగా మారిపోతావు. ఒక సారి నువ్వు జీవితమూ, తక్కిన అన్నీ సంబంధాలు ఊహల్లోనివే అని అర్థం చేసుకుంటే నువ్వు జీవితానికి వ్యతిరేకంగా వెళ్ళవు. నీ అవగాహన నీ సంబంధాలు సంపన్నం కావడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఇప్పుడు సంబంధాలు అన్నవి ఊహల్లోనివి అని తెలిసింది కదా మరి! ఇప్పుడు వాటికి మరింత ఊహని ఎందుకు జోడించవు!? వాటిని వీలైనంత గాఢంగా ఎందుకు ఆనందించవు? పువ్వు ఉంది కేవలం నీ ఊహ అని తెలిశాక అద్భుతమైన పుష్పాన్ని ఎందుకు సృష్టించవు? కేవలం సాధారణ పుష్ఫంతో ఎందుకు సంతృప్తి పడతావు? ఆ పువ్వు రత్నాలతో, వజ్రాలతో ధగధగలాడనివ్వు! 

నువ్వు ఏది ఊహిస్తే అది ఉంటుంది. ఊహ పాపం కాదు. అది ఒక అద్భుతమైన సామర్థ్యం. అది ఓ వంతెన. నదికి చెందిన రెండు తీరాలను కలపడానికి వంతెన ఉపకరించినట్లు నీ ఊహ ఇద్దరు మనుషులను దగ్గరకి చేస్తుంది. దాన్ని నువ్వు ప్రేమ అను. విశ్వాసం అను, కానీ అది ఊహే! మానవ మాత్రులకు ఊహ ఒకటే సృజనాత్మకత విషయం. అదే సృజన శక్తి. కాబట్టి ఏది సృజనాత్మకమైనా అది ఊహగా మారుతుంది. కాబట్టి దాన్ని ఆనందించు. దాన్ని మరింత, మరింత సౌందర్యభరితం చేయి! అప్పుడు నువ్వు క్రమ క్రమంగా ఒక దానిని సమీపిస్తావు. అక్కడ నువ్వు సంబందాల మీద ఆధారపడి ఉండవు. నువ్వు ఇతరులతో పంచుకుంటావు. నీ దగ్గర ఏదైనా ఉంటే ఇతరులకు ఇస్తావు. కానీ నీతో నువ్వు సంతృప్తి పడతావు. ప్రేమ అంతా ఊహత్మకమే. ఊహ అన్నది సాధారణ అర్దం లో కల్పనగా కొట్టి పారేస్తూ ఉంటారు ‌ . ఆ అర్థం లో ఇక్కడ చెప్పడం లేదు. ఊహ అనేది ఒక దైవ శక్తి.

No comments:

Post a Comment