Tuesday, October 25, 2022

సూక్తులు_ జీవన నిత్య సత్యాలు

 🤷‍♂️సూక్తులు_ జీవన నిత్య సత్యాలు🤷🏻‍♀️

🔥అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, అదొక్కటి చాలు మనం కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి💯

🔥సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వారికి మిగతా మంచి అలవాట్లూ వాటంతటవే వస్తాయి💯

🔥పిరికి మాటలు మాట్లాడొద్దు, వినొద్దు, మీ అభివృద్ధికి అవే ఆటంకాలు💯

🔥విమర్శించే వ్యక్తి దిగజారతాడు, విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు💯

🔥ఆనందం వస్తువుల్లో లేదు, అది మనసులో ఉంది💯

🔥శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే💯

🔥సమస్యకు పరిష్కారం, ప్రశ్నకు సమాధానం, దుఃఖం తర్వాత సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం కచ్చితంగా ఉంటుంది💯

🔥మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే.. విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి💯

🔥నీ పని నీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇతరుల పని ఇంకా కష్టంగా ఉంటుంది అని నీకు తెలియనప్పుడు!💯

🔥మనసు ఆనందంగా ఉంటే.. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది💯

📚సేకరణ
💞విప్పోజు శ్రీనివాస చారి విశ్వకర్మ 💕

No comments:

Post a Comment