*🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
*_🌴 భక్తి అంటే భగవంతునికి లొంగి ఉండడం, నమ్మి ఉండడం. తమ అవసరాలు కోసం భగవంతుణ్ణి ప్రార్ధించడం అసలు భక్తి కానే కాదు. ఉదయం లేచినది మొదలు తిరిగి పరుండినంత వరకూ ఒకటేమిటి ఎన్నెన్నో ఏవేవో కోరికలు అడుగుతూ ఉంటాం. కానీ వాటి అర్హత కోసం మాత్రం సాధన చేయం! ఆయనను మనస్ఫూర్తిగా విశ్వసిస్తే తప్ప నాకు అది కావాలి, ఇది కావాలి అని అడగడానికి మనకి ఎలాంటి హక్కు లేదు! అసలు అప్పుడు కూడా అడగవలసిన పని లేదు! ఎక్కడో కొండలలోని రాతి బండలోపల ఉన్న కప్పకు ఏదో రీతిన ఆదుకుంటున్న వాడు, నిత్యమూ ఆయననే నమ్ముకుని ఉన్న నిన్ను ఆదుకోడా! ఎందుకు ఆయనను పదేపదే అడగడం! గట్టిగా నమ్ముకో! అన్నీ నీ దగ్గరికే పంపిస్తాడు!.🌴_*
No comments:
Post a Comment