🕉 శ్రీ గురుభ్యోన్నమః 🕉
తల్లిలేని ఉడుత పిల్లలు గూటిలోనే ఉంటే సుఖమని తెలియక, గూటిలో నిలువలేక బయటికి వెళ్ళడానికి ప్రయత్నించి బాధలు పడినట్లే, మనస్సు ఉన్నచోటనే (హృదయంలో ) ఉంటే సమస్య లేదు. అది బయటకు వెళ్ళడానికి ప్రయత్నించినపుడల్లా దానిని తీసి, గూటిలో పడెయ్యాలి.
నేను - నాది అనేది ప్రకృతి విషయం. మమకారం బంధించినట్టు జీవుణ్ణి మరేదీ బంధించదు.
మనం ఈ నేను అనే దానిని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాము. కాని భగవంతుడు దానిని వదలకుండా నొక్కి పెట్టి ఉంచుతాడు.
కారణం, ఆ "నేను" అనే తలంపు ద్వారా ఇంకా ఖర్మానుభవం పొందవలసి ఉంది కాబట్టి, దానిని అలా తొక్కిపెట్టి ఉంచి జీవుణ్ణి జీళ్ళపాకంలా సాగదీస్తాడు.
అప్పుడు కానీ "పూర్ణ ఎరుక" సాధ్యం కాదు.
నీకు ఏ క్షణంలో అయినా "ఎరుక" కలిగితే, అదే కడసారి జన్మ.
అప్పుడు ఆ ఎరుక ఎలా ఉంటుంది అంటే, ఒక చెయ్యి రెండవ చెయ్యిని పట్టుకుంటే స్పర్శ ఎలా తెలుస్తుందో అంత స్పష్టంగా ఆ వస్తువు తాలూకు వైభవం నీకు తెలుస్తుంది. అది నీవే అన్న సంగతి కూడా నీకు తెలుస్తుంది.
🌷🙏🌷
No comments:
Post a Comment