*🍁 ఒత్తిడిని ఎలా అధిగమించాలో ఈ ఐదు సూత్రాల ద్వారా తెలుసుకుందాం*🍁
✍️ మురళీ మోహన్
👉మీకు ఏమి ఎదురైనా, మీరు దానిని ఎలా ఎదుర్కొంటారు, దానినుంచి మీరేమి నేర్చుకుంటారు అన్నది పూర్తిగా మీమీదే ఆధారపడింది.
మిమ్మల్ని యాతనకు గురిచేస్తోంది మీ షెడ్యూల్ కాదు. విషయం ఏమిటంటే మీరు కేవలం మీ ఆలోచనా, భావోద్వేగాలలో ఊపిరిసలపనంతగా మునిగిపోయి ఉన్నారు.
మీరు సంపాదించేది బాగా జీవించడానికే, ఒత్తిడితో మిమ్మల్ని మీరు చంపుకోవడానికి కాదు.
ఏ పని ఒత్తిడిని కలిగించదు. మీ శరీరం, మనస్సు, భావోద్వేగాలను మీరు సరిగ్గా నియంత్రించుకోలేక పోవడమే ఒత్తిడిని కలిగిస్తుంది.
బయటి పరిస్థితులు మీకు శారీరకమైన నొప్పిని మాత్రమే కలుగ జేయగలుగుతాయి. బాధ మాత్రం మీ మానసిక సృష్టే. 🤘
No comments:
Post a Comment