Sunday, October 2, 2022

వ్యాపారేతరం

 *వ్యాపారేతరం*
     వ్యాపారం కానిది వ్యాపారేతరం.
     ధనాన్ని సంపాదించే ఉద్దేశ్యంతో చేసే 1 )వస్తువులను చేతులు మార్చడం 2),సేవలు అందించడం, 3) వస్తువులను,భావాలను ఉత్పత్తి చేయడాన్ని వ్యాపారం అనవచ్చు.
    వ్యాపారం అనిపించుకోవడానికి పైన పేర్కొన్న వివిధ పనులు కేవలం డబ్బు సంపాదన కోసమైనదే కాదు , కీర్తి, ప్రతిష్టలు,గౌరవం, గుర్తింపు,పలుకుబడి, పేరు, ఆఖరుకు స్వీయ తృప్తి, మొదలగునవి ఆశించినా, సంపాదించాలి అనుకున్నా అది వ్యాపారమే.
    ఈ నిర్వచనంని అనుసరించి,ఈ రోజుల్లో ఉన్న అందరూ వ్యాపారస్తులే
  .ఉదా.. రాజకీయనాయకులు  ఓటు ఆశిస్తున్నారు,  స్వచ్చంధ సంస్థలు గుర్తింపు ఆశిస్తున్నాయి, ఆధ్యాత్మిక వేత్తలు స్వర్గాన్ని కోరుతున్నారు  ,సహాకారం సంఘాలవారు కీర్తి ఆశిస్తున్నారు. 
      కనుక వివిధ నిర్వాహకులు, నిర్వహణ  వ్యాపారేతరాలు కావు.
  ఇట్లు
నిర్వాహకుడు లేని నిర్వహణ.

No comments:

Post a Comment