Friday, October 21, 2022

అవసరాలు - కోరికలు!

 V. X2. 1-8.  181022-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


         అవసరాలు - కోరికలు!
                 ➖➖➖✍️

కోరికలు లెక్కలేనన్ని! అవసరాలు కొన్నే. అవసరాలని తీర్చుకోవచ్చు. కోరికలను తీర్చుకోలేం. 

కోరిక అనేది పిచ్చెక్కించే అవసరం. దానిని సంతృప్తి పరచడం అసంభవం. నువ్వు వాటిని తీరుస్తూ వెళ్ళిన కొద్ది ఇంకా ఇంకా అడుగుతూనే ఉంటాయి.


ఒక సూఫీ కథ ఉంది. అలెగ్జాండర్ చనిపోయి స్వర్గానికి వెళితే ఆయన తనతో పాటు తన రాజ్యాన్ని, బంగారాన్ని , వజ్రాలను తీసుకుని వెళ్ళాడంట. ఇది నిజం కాదు. ఒక భావన, ఈ బరువు అంతా మోసుకెళ్ళడం ఆయనకు పెద్ద కష్టంగానే ఉంది.

అక్కడి ద్వారపాలకులు నవ్వి …“ఎందుకు ఇంత బరువును మోసుకొచ్చావు? నీకు కష్టంగా లేదా?”అని అడిగాడు. 

అలెగ్జాండర్ "ఇదంతా నేను సంపాదించింది!” అన్నాడు.

ద్వారపాలకులు ఒక త్రాసు తీసుకుని వచ్చి అలెగ్జాండర్ తెచ్చిన వాటన్నింటినీ పెట్టి, ఇంకో వైపు ఒక కన్ను పెట్టారు. 

అలెగ్జాండర్ యొక్క సమస్త ఐశ్వర్యం కంటే కూడా ఆ కన్నే బరువుగా ఉంది. అలెగ్జాండర్ సంపదంతా తేలిపోయింది. 

ద్వారపాలకుడు ఆ కన్నును చూపించి "ఇది మనిషి కన్ను. కోరికకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దీనిని సంతృప్తి పరచడం అసంభవం. అసాధ్యం. ఎంత సంపదయినా, ఎంత గొప్ప సామ్రాజ్యమయినా, ఎంత గొప్ప ప్రయత్నం అయినా దీనిని సంతృప్తి పరచడం చాలా కష్టం! " అన్నాడు. 

అని కొంత దుమ్ము తీసి ఆ కంట్లో చల్లాడు. అప్పుడు ఆ కన్ను ఇటూ అటూ కదిలి దాని బరువును కోల్పోయింది.

కేవలం అవగాహన అనే చిన్న ధూళిని కోరిక అనే కంట్లో చల్లాలి. అప్పుడు కోరిక మాయమై అవసరాలే మిగిలి ఉంటాయి.  

అవసరాలు కొన్నే. అవి అద్భుతంగా ఉంటాయి. అవి బరువు ఉండవు. తేలికగా ఉంటాయి. కోరికలు అసహ్యంగా ఉంటాయి. నరరూప రాక్షసుల్ని తయారు చేస్తాయి. పిచ్చివాళ్ళను సృష్టిస్తాయి. 

ప్రశాంతతని ఎలా ఏర్పర్చుకోవాలి అనే విషయం నువ్వు తెలుసుకోవడం మొదలు పెడితే నీకో చిన్న గది చాలు. అంత అన్నం చాలు. కొన్ని బట్టలు చాలు. ఒక ప్రియమైన వ్యక్తి చాలు.✍️

గమనిక :- {ఈ పోస్ట్ కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే పోస్ట్ చెయ్యబడింది.}
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment