🙏 నీటితో వెలుగుతున్న దీపం..!!🙏
🌿నిప్పుకు బద్ద శత్రువు నీరు. కానీ, ఆ ఆలయంలో ఉన్న దీపం గత ఐదేళ్ల నుంచి నూనెకు బదులు నీటితోనే వెలుగుతోంది...
🌸దేవుడి గుడిలో దీపాన్ని వెలిగించాలంటే నూనె లేదా నెయ్యి అవసరం. కానీ ఈ గుడిలో నీటితో కూడా దీపాన్ని వెలిగించవచ్చు.
🌿మధ్యప్రదేశ్లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ నది ఒడ్డున ఉన్న గడియాఘాట్ మాతాజీ మందిరంలో ఈ అద్భుతాన్ని చూడవచ్చు.
🌸ఈ దీపం గత ఐదేళ్ల నుంచి నూనె, నెయ్యి అవసరం లేకుండానే నీటితో వెలుగుతోంది.
🌿దీంతో ఈ వింత చూసేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
🌸 ఐదేళ్ల నుంచి ఈ దీపం ఆరకుండా వెలుగుతూనే ఉందని, దేశంలో చాలా మందిరాల్లో ఇలా ఆరకుండా వెలిగే జ్యోతులు ఉన్నా..
🌿ఇక్కడ మాత్రం చాలా భిన్నమైనదని ఆలయ నిర్వాహకులు తెలుపుతున్నారు. ప్రమిదలో నిత్యం నూనెకు బదులు నీటిని పోస్తే చాలు.. అలా వెలుగుతూనే ఉంటుందన్నారు.
🌸ఈ ఆలయం పూజారి సిందూ సింగ్ మాట్లాడుతూ.. ''ఇదివరకు ఈ జ్యోతి నూనెతోనే వెలిగేది. అయితే, ఓ రోజు అమ్మవారు కలలోకి వచ్చి..
🌿ఈ దీపాన్ని నీటితో వెలిగించాలని చెప్పారు. ఆమె ఆదేశాల ప్రకారం నీటితో వెలుగుతోంది.
References:
Lamp at Gadiya Ghat Mata Ji burns with water, know story of this miraculous temple
No comments:
Post a Comment